మరోసారి బయటపడ్డ డ్రాగన్ కంత్రీ(ట్రీ) బుద్ది.. మాయదారి రోగం అంటగట్టి.. మందుల ధరలు పెంచేసింది..!

| Edited By: Ravi Kiran

May 14, 2021 | 2:30 PM

Medical Drugs Prices: భారత్‌లో కరోనా సెకండ్‌ వేవ్‌ తీవ్ర రూపం దాల్చడంతో బాధితులు హాస్పిటల్స్‌ చుట్టూ తిరుగుతున్నారు...

మరోసారి బయటపడ్డ డ్రాగన్ కంత్రీ(ట్రీ) బుద్ది.. మాయదారి రోగం అంటగట్టి.. మందుల ధరలు పెంచేసింది..!
Medicines Prices Hike
Follow us on

Medical Drugs Prices: భారత్‌లో కరోనా సెకండ్‌ వేవ్‌ తీవ్ర రూపం దాల్చడంతో బాధితులు హాస్పిటల్స్‌ చుట్టూ తిరుగుతున్నారు. ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో వెంటిలేటర్స్‌, ఆక్సిజన్‌, వ్యాక్సిన్‌ కొరత ఉంది. దీంతో జనం అతలాకుతలం అవుతుంటే ఇదే అదనుగా బావించిన చైనా దొంగ దెబ్బ తీస్తోంది. ఆ దేశం నుంచి దిగుమతి చేసుకునే డ్రగ్స్‌పై ట్యాక్స్‌ను విపరీతంగా పెంచేసింది.

కరోనా వేళ పారాసిటమల్‌, అజిత్రోమైసిన్‌ లాంటి ట్యాబ్‌లెట్స్‌ వినియోగం అధికంగా ఉంది. అయితే ఇలాంటి సమయంలో ముఖ్యమైన ట్యాబ్‌లెట్స్‌ కు ఉపయోగించే ముడిసరుకుల ధరలను విపరీతంగా పెంచింది చైనా. దీనిపై ఇండియన్‌ డ్రగ్‌ మ్యాన్‌ఫాక్చరర్స్‌ అసోసియేషన్‌ ఆందోళన వ్యక్తం చేసింది.

గతంలో చైనా నుంచి భారత్‌కు భారీగా డ్రగ్స్‌ ముడిసరుకులు దిగుమతి జరిగేది. అయితే ఏప్రిల్‌ 26 నుంచి సిచువాన్‌ ఎయిర్‌లైన్స్‌ కార్గో ఫైట్లను నిలిపివేసింది. దీంతో డ్రాగన్‌ నుంచి భారత్‌కు వచ్చే మందుల ముడిసరుకుల రవాణా ఆగిపోయింది. తాజాగా మందుల ముడిసరుకుల ధరలను భారీగా పెంచేసింది చైనా. పారాసిటమల్‌ కి సంబంధించిన ముడిసరుకుల ధర కేజీ 350 నుంచి 900 రూపాయలకు పెంచారు. ఐవర్‌ మెక్టిన్‌రోజ్‌ అనే డ్రగ్‌ ధర కేజీ 15 వేల నుంచి 70 వేలకు పెంచారు. డోక్సిసైక్లయిన్‌ అనే డ్రగ్‌ ధరను కేజీ 6 వేల నుంచి 15, 500 రూపాయలకు పెంచారు. అజిత్రోమైసిన్‌ డ్రగ్‌ దిగుమతి ధర కేజీ 8,500 నుంచి 14 వేలకు పెరిగింది.

ఒకవైపు ఇప్పటికే భారత్‌లో వ్యాక్సిన్‌ కొరత, ఆక్సిజన్‌, వెంటిలేటర్ల కొరత ఆందోళన కలిగిస్తోండగా, ఇప్పుడు కరోనా నివారణలో ప్రధానమైన ట్యాబ్‌లెట్స్‌ ముడి సరుకుల ధరలను చైనా భారీగా పెంచడంపై ఆందోళన వ్యక్తమవుతోంది.