Corona: చైనాలో మరింత కఠినంగా కరోనా ఆంక్షలు.. నెగెటివ్ వచ్చినా క్వారంటైన్ లో 50 రోజులు ఉండాల్సిందే

ప్రపంచవ్యాప్తంగా కలవరపెడుతున్న కరోనా చైనా(China)లోనూ తన ప్రతాపాన్ని చూపిస్తోంది. దీంతో ఏం చేయాలో తెలియక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఎలాగైనా మహమ్మారి వ్యాప్తిని అడ్డుకునేందుకు తీవ్రంగా...

Corona: చైనాలో మరింత కఠినంగా కరోనా ఆంక్షలు.. నెగెటివ్ వచ్చినా క్వారంటైన్ లో 50 రోజులు ఉండాల్సిందే
Follow us

|

Updated on: Jun 16, 2022 | 12:47 PM

ప్రపంచవ్యాప్తంగా కలవరపెడుతున్న కరోనా చైనా(China)లోనూ తన ప్రతాపాన్ని చూపిస్తోంది. దీంతో ఏం చేయాలో తెలియక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఎలాగైనా మహమ్మారి వ్యాప్తిని అడ్డుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ క్రమంలో కరోనా నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నారు. అంతే కాకుండా జీరో కొవిడ్(Zero Covid) లక్ష్యాన్ని సాధించేందుకు తీవ్ర కసరత్తు చేస్తున్నారు. కాగా.. ఉత్తర కొరియాతో సరిహద్దు నగరమైన దండాంగ్‌లో 50 రోజుల తర్వాత కరోనా బాధితులను బాహ్య ప్రపంచంలోకి విడిచిపెట్టింది చైనా ప్రభుత్వం. కరోనా పాజిటివ్‌గా తేలిన వారిని కఠినమైన నిబంధనలుండే క్వారంటైన్‌లో నిర్బంధిస్తున్నారు. 50 రోజుల పాటు అక్కడే ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. కరోనా నెగెటివ్ గా తేలిన 50 రోజుల క్వారంటైన్ పూర్తి చేసుకున్నాకే బయటకు విడిచిపెడుతున్నారు. అంతే కాదు.. నెగెటివ్ వచ్చాక తమ కుటుంబసభ్యులను చూసేందుకూ కఠిన ఆంక్షలే అమలు చేస్తున్నారు. ఇనుప కంచెలు ఏర్పాటు చేసి, వాటి మధ్యన బంధువులు, కుటుంబ సభ్యులను కలిసేలా ఏర్పాట్లు చేశారు. గత రెండు వారాల్లో పాజిటివ్ కేసులు లేని ప్రాంతాల వారిని మాత్రమే బయటకు వదిలారు. లాక్‌డౌన్ సడలింపు ప్రకటన వెలువడగానే చాలా మంది ప్రజలు కంచెల వద్దకు వచ్చి తమవారి కోసం పడిగాపులు కావడం తీవ్ర ఆవేదన కలిగించింది.

మరోవైపు.. చైనాలో వ్యాక్సినేషన్‌తో పొందిన రోగనిరోధక స్థాయులు ఒమిక్రాన్‌ ఉద్ధృతిని అరికట్టేందుకు సరిపోవని ఆ అధ్యయనం పేర్కొంది. ఆ వేరియంట్‌ కారణంగా ఐసీయూలు నిండిపోతాయని ఆందోళన వ్యక్తం చేసింది. చైనా కొవిడ్ జీరో వ్యూహంపై ప్రపంచవ్యాప్తంగా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రపంచ దేశాలు నిబంధనలు పాటిస్తూ, టీకాలు అందిస్తూ ముందుకు సాగుతున్నాయి. అలాగే భవిష్యత్తులో మరోసారి వైరస్‌ విజృంభిస్తే, తట్టుకునేలా వైరస్‌తో కలిసి జీవించే విధానాన్ని కూడా అలవాటు చేసుకుంటున్నాయి. కానీ చైనా మాత్రం కొవిడ్‌ కేసులను సున్నాకు తీసుకువచ్చే వ్యూహాన్ని అమలు చేస్తూ.. కొద్దిపాటి కేసులకే ప్రజలను ఆంక్షల చట్రంలో బంధిస్తోంది. దీనిపై డబ్ల్యూహెచ్ఓ గతంలో పలు సూచనలు చేసింది.

మరిన్ని అంతర్జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి