China: రండి బాబు.. రండి.. విదేశీ పర్యటకులకు కోవిడ్ క్వారంటైన్‌‌తో పనిలేదు.. చైనా ప్రభుత్వం కీలక నిర్ణయం..

|

Dec 27, 2022 | 12:18 PM

విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులు తప్పనిసరిగా క్వారంటైన్‌లో ఉండాల్సిన అవసరం లేదని అధికారికంగా ప్రకటించింది. జనవరి 8నుంచి ఇది అమల్లోకి రానుంది.

China: రండి బాబు.. రండి.. విదేశీ పర్యటకులకు కోవిడ్ క్వారంటైన్‌‌తో పనిలేదు.. చైనా ప్రభుత్వం కీలక నిర్ణయం..
China Ends Covid Quarantine
Follow us on

చైనా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విదేశీ ప్రయాణికులపై ఉన్న ఆంక్షలు తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. మూడేళ్ల తర్వాత కరోనా నిబంధనలను తొలగించింది. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులు తప్పనిసరిగా క్వారంటైన్‌లో ఉండాల్సిన అవసరం లేదని అధికారికంగా ప్రకటించింది. జనవరి 8నుంచి ఇది అమల్లోకి రానుంది. అయితే, 48గంటలకు ముందు చేయించుకున్న కరోనా నెగెటివ్‌ సర్టిఫికెట్‌ చూపించాల్సి ఉంటుంది. అలాగే విదేశీయుల ట్రాక్‌ చేయడాన్ని కూడా నిలిపివేస్తోంది. ఆ దేశంలో జీరో కొవిడ్‌ విధానానికి వ్యతిరేకంగా నిరసనల తర్వాత ప్రభుత్వం ఈ డెసిషన్‌ తీసుకుంది. ఐతే సరుకు దిగుమతికి ఎదురవుతున్న ఇబ్బందుల కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే, చైనాలో కరోనా విలయతాండవం చేస్తోంది. రోజువారీ కేసులు లక్షల్లో..మరణాలు వేలల్లో నమోదవుతున్నాయి. ఒక్క జెజియాంగ్‌ ప్రావిన్స్‌లో ఒకేరోజు 10లక్షల కేసులు నమోదయ్యాయి. ఆస్పత్రులన్నీ కరోనా బాధితులతో నిండిపోయాయి. కంపెనీలు, ఫ్యాక్టరీలు సహా అన్నీ మూసేసే పరిస్థితులు వచ్చాయి. ఉత్పత్తులు కూడా భారీగా తగ్గిపోయినట్టు అంతర్జాతీయ నివేదికలు చెప్తున్నాయి. ఆటో మొబైల్ ఇండస్ట్రీలో 15శాతం మేర ఉత్పత్తి తగ్గింది. గత సంవత్సరం డిశంబర్‌తో పోలిస్తే ఈ సారి 30 అతిపెద్ద నగరాల్లో.. 44 శాతం మేర రియల్ ఎస్టేట్ డీలింగ్స్ పడిపోయాయి.

బీజింగ్, షాంఘై వంటి టైర్-వన్ నగరాల్లోనూ కరోనా ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ఆర్డర్లు లేకపోవడంతో చాలా ఫ్యాక్టరీలు వారాలపాటు మూసివేయాల్సిన పరిస్థితులు చైనాలో కనిపిస్తున్నాయి. నవంబర్‌ నుంచి రిటైల్ అమ్మకాలు భారీగా తగ్గాయి. ఈ ఆరు నెలల్లోనే రికార్డ్ స్థాయిలో నిరుద్యోగ శాతం పెరిగింది. ఇక పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌లో ప్రయాణించే వారి సంఖ్య ఏకంగా 60శాతం పడిపోయింది.

గ్వాంగ్‌డాంగ్, జెజియాంగ్, షాన్‌డాంగ్ లాంటి ప్రావిన్సుల్లో 60శాతం టెక్స్‌టైల్ కంపెనీలు ఉత్పత్తి నిలిపివేశాయి. ఉద్యోగుల్లో ఎక్కువ మందికి కరోనా సోకడం.. కొత్త వాళ్లు ఉద్యోగంలో చేరే పరిస్థితి లేకపోవడంతో.. కంపెనీని మూసేసుకోవాల్సిన పరిస్థితి.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం