
ప్రపంచాన్ని గజగజ వణికించిన కరోనా వైరస్ చైనా నుండే వ్యాపించిందని ప్రపంచంలోని చాలా దేశాలు పేర్కొన్నప్పటికీ.. ఎటువంటి ఖచ్చితమైన ఆధారాలు తెరపైకి రాలేదు. ఆరోపణలు మాత్రమే వచ్చాయి. అంతేకాదు చైనాలోని కరోనా కేసులు, ఈ వైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య గురించి ప్రపంచానికి వెల్లడించలేదు. అయితే ఇప్పుడు ఓ అధ్యయనంలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. చైనా కరోనా కట్టడికోసం విధించిన లాక్ డౌన్ ను అకస్మాత్తుగా ఎత్తివేసింది. అయితే రెండు నెలల్లోనే కోవిడ్ -19 కారణంగా 18 లక్షల మందికి పైగా మరణించారని అధ్యయనం ద్వారా వెల్లడైంది.
అమెరికాలోని సీటెల్‌లోని ఫ్రెడ్ హచిన్‌సన్ క్యాన్సర్ సెంటర్ ఈ అధ్యయనం చేసింది. ఈ అధ్యయనం చైనాలోని కొన్ని విశ్వవిద్యాలయాలు, ఇంటర్నెట్ శోధన ద్వారా జరిగింది.. దీనిలో మరణాల డేటా నమూనాలను తీసుకున్నారు. డిసెంబర్ 2022 నుంచి జనవరి 2023 మధ్య.. 30 ఏళ్లు పైబడిన వారు కరోనాతో మరణించినట్లు వెలుగులోకి వచ్చింది. మరణాల సంఖ్య 1.87 మిలియన్లు దాటింది. అయితే ఈ మరణాల సంఖ్యలో టిబెట్‌లో మరణాల సంఖ్యను చేర్చనట్లు తెలిసింది.
మూడేళ్లుగా అమలు చేసిన జీరో కోవిడ్ విధానానికి గత డిసెంబర్‌లో చైనా ఆకస్మికంగా ముగింపు చెప్పింది. జీరో కోవిద్ విధానం ప్రకారం.. సామూహిక పరీక్షలు, లాక్‌డౌన్‌తో సహా అనేక కఠినమైన ఆంక్షలు అమలులో ఉండేవి. జీరో కోవిడ్ విధానాన్ని రద్దు చేసిన వెంటనే, ఆసుపత్రిలో చేరిన రోగులు.. కరోనా మరణాల సంఖ్య భారీగా పెరిగాయి. అయితే ఈ కేసులను ప్రభుత్వం చాలా తక్కువ అని చూపిస్తూ తమ నివేదికలను ఇచ్చిందని ఆరోగ్య నిపుణులు చెప్పారు.
ఈ అధ్యయనంలో పరిశోధకులు ప్రచురించిన మరణాల గణాంక విశ్లేషణను.. బైడు అనే ప్రసిద్ధ చైనీస్ ఇంటర్నెట్ శోధన ఇంజిన్‌పై పరిశోధనకు చెందిన డేటాను ఉపయోగించారు. చైనాలో జీరో-కోవిడ్ విధానాన్ని తొలగించిన తర్వాత ఏర్పడిన పరిస్థితుల పై అధ్యయనం అనుభవపూర్వకంగా ఉత్పన్నమైన బెంచ్‌మార్క్ అంచనాను సెట్ చేస్తుందని పరిశోధకులు అంటున్నారు. అదే సమయంలో ఈ అధ్యయనం ప్రచురించిన కథనం.. కరోనా మరణాల గురించి నేషనల్ హెల్త్ కమీషన్ ఆఫ్ చైనా ఇప్పటి వరకూ స్పందించలేదు..
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..