India – China: డ్రాగన్ కంట్రీ మరో కుతంత్రం.. ప్యాంగ్యాంగ్ సరస్సుపై బ్రిడ్జ్ నిర్మాణం.. ఆ పనుల కోసమేనా..?

|

May 19, 2022 | 9:49 AM

తూర్పు లద్దాఖ్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చైనా - భారత్(China - India) సరిహద్దు ప్రాంతమైన పాంగాంగ్ సరస్సుపై డ్రాగన్ దేశం మరో వంతెన నిర్మాణానికి పూనుకుంది. ఇప్పటికే ఒక వంతెన నిర్మించిన చైనా.. ఇప్పుడు మరో వంతెన...

India - China: డ్రాగన్ కంట్రీ మరో కుతంత్రం.. ప్యాంగ్యాంగ్ సరస్సుపై బ్రిడ్జ్ నిర్మాణం.. ఆ పనుల కోసమేనా..?
Pangong Lake
Follow us on

తూర్పు లద్దాఖ్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చైనా – భారత్(China – India) సరిహద్దు ప్రాంతమైన పాంగాంగ్ సరస్సుపై డ్రాగన్ దేశం మరో వంతెన నిర్మాణానికి పూనుకుంది. ఇప్పటికే ఒక వంతెన నిర్మించిన చైనా.. ఇప్పుడు మరో వంతెన నిర్మించడం గమనార్హం. ఆ దేశ సైనిక బలగాలను సరిహద్దు ప్రాంతాలకు తరలించే ఉద్దేశ్యంతో ఈ వంతెన నిర్మిస్తోన్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. శాటిలైట్ ఫొటోల సహాయంతో అక్కడ జరుగుతున్న ఘటనను తెలుసుకున్న వారు ఈ విషయాన్ని ధ్రువీకరించారు. 2020 ఆగస్టులో పాంగాంగ్‌ సరస్సు(Pangong Lake) ప్రాంతంలో డ్రాగన్‌ బలగాలు అడ్డుకోవడం వల్ల భారత సైన్యం దక్షిణ తీరంలో అనేక వ్యూహాత్మక శిఖర ప్రాంతాలను కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలోనే చైనా తన సైనిక మౌలిక సదుపాయాలను బలోపేతం చేయటంపై దృష్టి సారించింది. వాస్తవాధీన రేఖకు 20కిలోమీటర్లకుపైగా దూరంలో పాంగాంగ్‌ సరస్సుపై చైనా రెండో వంతెన నిర్మాణం చేపట్టినట్లు తెలుస్తోంది. ఎల్ఏసీ వెంట చైనీస్ కార్యకలాపాలను ట్రాక్ చేసే జియో స్పేషియల్ ఇంటెలిజెన్స్ పరిశోధకుడు డామియన్ సైమన్.. కొత్త వంతెన నిర్మాణం ఉపగ్రహ చిత్రాలను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.

సైమన్‌ ఉపగ్రహచిత్రాల ప్రకారం రెండువైపులా ఒకే సమయంలో సైనిక సన్నద్ధతలో భాగంగా సరిహద్దు ప్రాంతాల్లో భారత్‌ కూడా వంతెనలు, రహదారులు, టన్నెళ్ల నిర్మాణాలు చేపడుతోంది. రెండేళ్ల నుంచి తూర్పు లద్దాఖ్‌లోని పలు ప్రాంతాల్లో ఉద్రిక్తతలు నెలకొన్న వేళ డ్రాగన్‌ చేపడుతున్న రెండో వంతెన నిర్మాణంపై రక్షణ శాఖ స్పందించాల్సి ఉంది.

మరోవైపు.. ఎల్‌ఏసీ వెంట చైనా మౌలిక వసతులను పెంచుకుంటోంది. అరుణాచల్‌ప్రదేశ్‌కు అతీ సమీపాన రోడ్లు, రైలు, వాయు మార్గాలను ఆధునీకరిస్తోంది. 5జీ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే ఎల్‌ఏసీ వెంట కొత్త గ్రామాలను నిర్మించిన చైనా కదలికలను భారత్ ఎప్పటికప్పుడూ గమనిస్తూనే ఉంది. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా దీటుగా సమాధానమివ్వడానికి సిద్ధమవుతోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

ఇవీ చదవండి

AP News: మంగళగిరిలో అదృశ్యమైన యువతి.. కలకం సృష్టిస్తున్న సెల్ఫీ వీడియో.. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే..!

Electrician Love: అబ్భా ప్రేమ ఎంత పనైనా చేయిస్తుంది అంటే ఇదే మరి..! గర్ల్‌ ఫ్రెండ్‌ కోసం ఎలక్ట్రీషియన్ వింత పని..!