Ferrari Car: ఇటలీ ఫుట్‌బాల్ ప్లేయర్‌కు షాక్ ఇచ్చిన మెకానిక్.. సూపర్ ఫాస్ట్ కారును సర్వీసింగ్ కోసం పంపిస్తే..
Ferrari Car: ఇటలీ, జెనోవా ఫుట్‌బాల్ ప్లేయర్ ఫెడెరికో మర్చెట్టి తన ఫెరారీ కారును సర్వీసింగ్ కోసం ఇవ్వగా.. కార్ మెకానిక్ షాక్ ఇచ్చాడు.
Ferrari Car: ఇటలీ, జెనోవా ఫుట్‌బాల్ ప్లేయర్ ఫెడెరికో మర్చెట్టి తన ఫెరారీ కారును సర్వీసింగ్ కోసం ఇవ్వగా.. కార్ మెకానిక్ షాక్ ఇచ్చాడు. రూ. 3 కోట్ల విలువైన సూపర్ ఫాస్ట్ కారును ప్రమాదానికి గురిచేశాడు. వివరాల్లోకెళితే.. ఫెడెరికో తన సూపర్ ఫాస్ట్ ఫెరారీ కారును ఫ్రొఫెషనల్ సర్వీసింగ్ కోసం మెకానిక్‌కు ఇచ్చాడు. అయితే మెకానిక్ ఆ కారును సర్వీసింగ్ చేసి తిరిగి ఫెడెరికోకు అందజేయడం కోసం జెనోవా శిక్షణా కేంద్రానికి బయలుదేరాడు. ఆ క్రమంలో ఫెరారీ కారు అదుపు తప్పింది. రోడ్డుపై పార్క్ చేసిన దాదాపు ఐదు కార్లను ఢీకొట్టింది.
ఈ ఘటనలో ఫెడెరికో కారు పూర్తిగా ధ్వంసమైంది. ఈ కారు విలువ భారత కరెన్సీలో దాదాపు రూ. 3 కోట్లు ఉంటుంది. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. కాగా, ఈ కారు ప్రమాదంపై ఫెడెరికో చాలా హుందాగా స్పందించి అందరి ప్రశంసలు అందుకున్నాడు. ‘ఇంత పెద్ద ప్రమాదంలో ఎవరూ గాయపడకపోవడం సంతోషకరం. ఈ విషయంలో దేవుడికి థ్యాంక్స్ చెప్పాలి’ అంటూ ఫెడెరికో ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ కూడా వైరల్ అవుతోంది.
Also read:
Accident Related Tweet:
The Genoa goalkeeper Federico Marchetti left fuming after £300k Ferrari 812 Superfast smashed up by car wash worker while training It also struck five parked cars in the smash
The 812 Superfast is Ferrari’s most powerful sports car ever built. It has a top speed of over 211mph. pic.twitter.com/RgFDhAHLvF
— Lilian Chan (@bestgug) January 12, 2021