Watch Video: నయాగరా జలపాతం బ్రిడ్జ్ వద్ద కారులో భారీ పేలుడు.. రాకపోకలకు తీవ్ర అంతరాయం

నయాగరా జలపాతం సమీపంలోని యుఎస్-కెనడా వంతెనపై యుఎస్ ప్రాంతంవైపు ప్రమాదకర సంఘటన చోటు చేసుకుంది. దీంతో అంతర్జాతీయ సరిహద్దును ఇరువైపులా మూసివేశారు అధికారులు. ఈ దృశ్యాలు వివిధ సోషల్ మీడియా వేదికలపై విస్తృతంగా ప్రచారం అవుతోంది. ప్రమాదంలో చెక్ పోస్ట్ అధికారి ఒకరు గాయపడగా.. ఇద్దరు వ్యక్తులు మరణించారు.

Watch Video: నయాగరా జలపాతం బ్రిడ్జ్ వద్ద కారులో భారీ పేలుడు.. రాకపోకలకు తీవ్ర అంతరాయం
Car Crashes At Rainbow Bridge Near Niagara Falls, Near America Canada Border Viral Video

Updated on: Nov 24, 2023 | 2:45 PM

నయాగరా జలపాతం సమీపంలోని యుఎస్-కెనడా వంతెనపై యుఎస్ ప్రాంతంవైపు ప్రమాదకర సంఘటన చోటు చేసుకుంది. దీంతో అంతర్జాతీయ సరిహద్దును ఇరువైపులా మూసివేశారు అధికారులు. ఈ దృశ్యాలు వివిధ సోషల్ మీడియా వేదికలపై విస్తృతంగా ప్రచారం అవుతోంది. ప్రమాదంలో చెక్ పోస్ట్ అధికారి ఒకరు గాయపడగా.. ఇద్దరు వ్యక్తులు మరణించారు. రెయిన్‌బో బ్రిడ్జ్‌పై ప్రమాదానికి గురైన వాహనం గాల్లో ఎగిరిన భయానక దృశ్యాన్ని సీసీటీవీ ఫుటేజీలో రికార్డ్ అయింది. పేలుడు సంభవించే కొన్ని సెకన్ల ముందు.. కారు చెక్‌పాయింట్ వైపు దూసుకెళ్లి గాలిలోకి ఎగురుతున్నట్లు ఈ వీడియోలో కనిపిస్తోంది. క్షణాల వ్యవధిలో కారులో నుంచి నల్లటి పొగలు వెలువడి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

ఈ వంతెన అమెరికా, కెనడాలను కలుపుతుంది. ప్రమాదం జరగడానికి ముందు కారు కెనడా నుండి అమెరికా సరిహద్దుకు 100 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఈ పేలుడు సంభవించిన సమయంలో కొన్ని నివేదికలు ఉగ్రవాద దాడిగా పేర్కొన్నాయి. అయితే, న్యూయార్క్ గవర్నర్ కాథీ హోచుల్ తరువాత మీడియా సమావేశంలో మాట్లాడుతూ, “ఉగ్రవాద దాడికి ఎటువంటి సూచనలు కనిపించలేదు. ఈ ప్రమాదంలో తీవ్రవాద కార్యకలాపాలకు సంబంధించిన ఎలాంటి సంకేతాలు తమ దృష్టికి రాలేదని ప్రాధమిక విచారణలో తేలినట్లు వివరించారు.” దర్యాప్తు సంస్థ అయిన ఎఫ్‌బీఐ.. బఫెలో రెయిన్‌బో బ్రిడ్జ్ సంఘటన స్థలంలో కొన్ని కీలక ఆధారాలను సేకరించింది. సంఘటనా స్థలంలో జరిపిన పరిశోధనలో పేలుడు పదార్థాలు ఉగ్రవాదానికి సంబంధించది కాదని స్పష్టం చేసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..