Candyologist Job Notification: కూటి కోసం కోటి విద్యలు అన్నారు పెద్దలు. అవును ఈ ప్రపంచంలో ఎక్కువ మంది మనుషులు కష్టపడేది.. తిండి కోసమే.. అందుకనే రోజంతా కష్టపడి డబ్బులు సంపాదిస్తారు. అయితే వీరిలో కొందరు భిన్నంగా తమ వృత్తిని ఎంచుకుంటారు. డబ్బులను సంపాదించడం కోసం తింటారు.. కూర్చున్న చోట నుంచి కదలకుండా, రుచి చూసే ఉద్యోగాలు కూడా ప్రస్తుతం అనేకం ఉన్నాయి. టి, కాఫీ రుచికి సంబంధించిన ఉద్యోగాలు ఇటీవల కాలంలో బాగా పాపులర్ అయ్యాయి. ఇలాంటి ఉద్యోగాలే మరికొన్ని కూడా ఉన్నాయి. తింటూ డబ్బు సంపాదించే అవకాశాన్ని కలిపిస్తున్నాయి.
కెనడాకు చెందిన క్యాండీ ఫన్ హౌస్ అనే సంస్థ క్యాండీలను, చాక్లెట్లను తయారు చేస్తుంది. వీటిని రుచి చూసి అత్యుత్తమ రుచి ఏంటో చెప్పాలి. ఈ ఉద్యోగానికి సెలక్ట్ అయ్యిన ఉద్యోగులకు గంటకు 30 కెనడియన్ డాలర్లు అంటే దాదాపుగా రూ.1700 ఇస్తుంది. మరెందుకు ఆలస్యం మీరుకూడా “క్యాండి ఫన్‌హౌస్” క్యాండీల తయారీ కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి. క్యాండీ, చాక్లెట్ టేస్ట్ టెస్టర్ జాబ్స్‌కు దరాఖాస్తు చేసుకోండి. ఫిబ్రవరి 15వ తేదీ దరఖాస్తుల స్వీకరణకు చివరి తేది.
ఈ లోపు మీరు మీ దరఖాస్తును పంపించేయండి. సదరు కంపెనీ తాము తయారు చేసే పదార్ధాలను రుచి చూసే ఉద్యోగుల కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తోంది. గంటకు 30 కెనడియన్ డాలర్లు అంటే మన కరెన్సీ లో దాదాపు రూ. 1700 ఇస్తామంటోంది. ఉద్యోగానికి ఎంపికైన వారు చేయాల్సిందల్లా ఆ కంపెనీ తయారు చేసే క్యాండీలు, చాక్లెట్లను రుచి చూసి ఎలా ఉన్నాయో చెప్పాలి అంతే.
Also Read: ప్రపంచంలో కొనసాగుతున్న కరోనా కల్లోలం… పదికోట్లకు చేరువులో బాధితుల సంఖ్య, 21 లక్షలు దాటిన మరణాలు