Justin Trudeau: భారత్‌కు కెనడా భారీ సాయం .. ప్రకటించిన ఆ దేశ ప్రధాని .. ఎంతంటే..!

|

Apr 28, 2021 | 7:01 PM

Justin Trudeau: భారత్‌లో కరోనా మహహ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. రోజురోజుకు లక్షల్లో పాజిటివ్‌ కేసులు, వేలల్లో మరణాలు సంభవిస్తున్నాయి. దీంతో భారత్‌లో పరిస్థితి దారుణంగా...

Justin Trudeau: భారత్‌కు కెనడా భారీ సాయం ..  ప్రకటించిన ఆ దేశ ప్రధాని .. ఎంతంటే..!
Follow us on

Justin Trudeau: భారత్‌లో కరోనా మహహ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. రోజురోజుకు లక్షల్లో పాజిటివ్‌ కేసులు, వేలల్లో మరణాలు సంభవిస్తున్నాయి. దీంతో భారత్‌లో పరిస్థితి దారుణంగా తయారైంది. గత సంవత్సరం కంటే ఈ ఏడాది కరోనా తీవ్రంగా వ్యాప్తి చెందుతోంది. ఆక్సిజన్‌ కొతర కూడా తీవ్రంగా ఉంది. దీంతో పలు దేశాలు భారత్‌ను ఆర్థికంగా ఆదుకుంటున్నాయి. తాజాగా కెనడా ప్రధానమంత్రి జస్టిన్‌ ట్రుడో బుధవారం ట్వీట్‌ చేశారు. ‘భారత్‌ ఇప్పుడు విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటుంది. అంబులెన్స్‌లు, పర్సనల్ ఎక్విప్‌మెంట్ కొనుగోలు చేసేందుకు రెడ్ క్రాస్ సంస్థ ద్వారా 60 కోట్ల రూపాయలను అందిస్తున్నాం. భారత్‌కు కావాల్సిన ఔషధాలను కూడా ఇవ్వడానికి మేం సిద్ధంగా ఉన్నాం’ అని పేర్కొన్నారు. ఇలా పలు దేశాలు భారత్‌కు సాయం చేసేందుకు ముందుకు వస్తున్నాయి.

కాగా, సోమవారం తగ్గినట్లే తగ్గిన కేసులు.. మళ్లీ రికార్డు స్థాయిలో పెరిగాయి. మరణాల సంఖ్య కూడా మొదటిసారి 3 వేల మార్క్ దాటింది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 3,60,960 కరోనా కేసులు నమోదు కాగా, 3293 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,79,97,267 (1.79 కోట్లు) కు చేరగా, మరణాల సంఖ్య 2,01,187 కి చేరింది. కరోనా నుంచి 2,61,162 మంది బాధితులు కోలుకోగా, వీరితో కలిపి మొత్తం కోలుకున్న వారి సంఖ్య 1,48,17,371కి చేరుకుంది. ప్రస్తుతం దేశంలో 29,78,709 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కాగా.. నిన్న దేశవ్యాప్తంగా 17,23,912 కరోనా నిర్థారణ పరీక్షలు చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ  వెల్లడించింది. వీటితో కలిపి ఏప్రిల్ 27 వరకు మొత్తం 28,27,03,789 కరోనా పరీక్షలు చేసినట్లు వెల్లడించింది.