Foreign Studies: విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? ఏజెంట్లను గుడ్డిగా నమ్మితే మీరు నిండా మునిగినట్టే జాగ్రత్త..

| Edited By: Janardhan Veluru

Mar 16, 2023 | 5:07 PM

ఉన్నత విద్య చదివేందుకు భారత్ నుంచి విదేశాలకు వెళ్తున్న వారి సంఖ్య ఏటా పెరుగుతోంది. ముఖ్యంగా అమెరికా, యూరప్, ఆస్ట్రేలియా, కెనడా దేశాల్లో చదివేందుకు విద్యార్థులు మొగ్గు చూపుతున్నారు.

Foreign Studies: విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? ఏజెంట్లను గుడ్డిగా నమ్మితే మీరు నిండా మునిగినట్టే జాగ్రత్త..
Indian Students
Follow us on

ఉన్నత విద్య చదివేందుకు భారత్ నుంచి విదేశాలకు వెళ్తున్న వారి సంఖ్య ఏటా పెరుగుతోంది. ముఖ్యంగా అమెరికా, యూరప్, ఆస్ట్రేలియా, కెనడా దేశాల్లో చదివేందుకు విద్యార్థులు మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలో కెనడా విద్యాసంస్థల్లో అడ్మిసన్ కోసం ఇచ్చిన ఆఫర్ లెటర్లలో కొన్ని నకిలీవి ఉన్నట్లు అక్కడి అధికారులు గుర్తించారు. దీంతో ఆ విద్యార్థులకు కెనడియన్ బార్డర్ సెక్యూరిటీ ఏజెన్సీ డిపార్టేషన్ లేటర్లు కూడా అందినట్లు సమాచారం. ఇలా దాదాపు 700 మంది భారతీయ విద్యార్థులు కెనడా నుంచి బహిష్కరణ గండాన్ని ఎదుర్కొంటున్నట్లు స్పష్టమవుతోంది.

పంజాబ్ లోని జలంధర్ లో ఉంటున్న బ్రిజేశ్ మిశ్రా అనే వ్యక్తి ఎడ్యూకేషన్ మైగ్రేషన్ సర్వీసెస్ నిర్వహిస్తున్నాడు. కెనడాలోని ప్రముఖ కళాశాలలో అడ్మిషన్ల కోసం ఒక్కో విద్యార్థి వద్ద దాదాపు 16 నుంచి 20 లక్షల వరకు వసూలు చేశాడు.దీంతో వారంతా 2018-19లో అడ్మిషన్‌ పొంది చదువులు కూడా పూర్తిచేశారు. అంతేకాకుండా వారిలో కొందరు ఉద్యోగాలూ సంపాదించి అక్కడే ఉంటున్నారు. ఇంతవరకు బాగానే నడిచింది. కానీ ఇలా వెళ్లిన వారిలో కొందరు కెనడాలో శాశ్వత నివాసం కోసం దరఖాస్తు చేసుకున్నారు. వాటిని పరిశీలించిన సీబీఎస్‌ఏ.. వీసా కోసం ఆ విద్యార్థులు సమర్పించిన దస్త్రాలు నకిలీవని తేల్చేశారు. ఇవన్నీ జలంధర్‌ కేంద్రంగా ఉన్న మిశ్రాకి సంబంధించిన కన్సల్టెన్సీవేనని గుర్తించారు.

2018-2022 మధ్య కాలంలో అక్కడనుంచి సుమారు 700 మంది కెనడాలో చదువులకు ఆఫర్‌ లెటర్లు పొందినట్లు సమాచారం. కెనడాలో ఇటువంటి భారీ మోసం బయటికి రావడం ఇదే మొదటిసారి అని తెలుస్తోంది. అయితే బహిష్కరణను ఎదుర్కొంటున్నవారిలో పంజాబ్ లోని జలంధర్ నుంచి వెళ్లిన వారే ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా కెనడాలో నకీలీ ఆఫర్ లేటర్లకు సంబంధించి తమకు ఇప్పటివరకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పంజాబ్ లోని జలంధర్ పోలీసులు తెలిపారు. నకిలీ ఆఫర్ లెటర్లతో విద్యార్థుల్ని మోసం చేసిన బ్రిజేశ్ మిశ్రాను పట్టుకునేందుకు ప్రయత్నించినప్పటికీ పదే పదే ఆ కార్యాలయం ముసివేసి ఉండటాన్ని గుర్తించామని విద్యార్థుల తల్లిదండ్రులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

 

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..