ఫ్యామిలీకి సర్‌ప్రైజ్‌ ఇద్దామనుకొని.. ఉద్యోగం ఊడగొట్టుకున్న పైలట్‌.. అసలు ఏం చేశాడంటే!

తాను విమానం ఎలా నడుపుతానో చూపించి ఫ్యామిలీని సర్‌ప్రైజ్‌ చేద్దామనుకున్న ఒక పైలెట్‌ చిక్కుల్లో పడ్డాడు. విమానం ప్రయాణిస్తున్న సమయంలో కాక్‌పిట్ డోర్‌ను తెరిచి ఉంచి విమానాన్ని నడిపాడు. దీంతో ఉగ్రవాద నిరోధక చట్టాలను ఉల్లంఘించాడనే ఆరోపణలపై బ్రిటిష్ ఎయిర్‌వేస్ యాజమాన్యం అతన్ను సస్పెండ్ చేసింది.

ఫ్యామిలీకి సర్‌ప్రైజ్‌ ఇద్దామనుకొని.. ఉద్యోగం ఊడగొట్టుకున్న పైలట్‌.. అసలు ఏం చేశాడంటే!
British Airways Suspends Pi

Updated on: Aug 16, 2025 | 4:51 PM

తాను విమానం ఎలా నడుపుతానో చూపించి ఫ్యామిలీని సర్‌ప్రైజ్‌ చేద్దామనుకున్న ఒక పైలెట్‌ ఏకంగా తన ఉద్యోగాన్నే కోల్పోయాడు.వివరాల్లోకి వెళితే.. లండన్‌లోని హీత్రూ ఎయిర్‌పోర్టు నుంచి న్యూయార్క్ వెళ్తున్న బ్రిటీష్‌ ఎయిర్‌లైన్స్‌ విమానంలో ఓ పైలట్ కాక్‌పిట్ డోర్‌ను మూయకుండానే విమానాన్ని నడిపాడు. అయితే అదే విమానంలో తన కుటుంబ సభ్యులు ప్రయాణిస్తుండగా.. తాను విమానాన్ని ఎలా నడుపుతానో వారికి చూపించాలనే ఉద్దేశంతోనే పలైట్‌ ఇలా చేసినట్లు తెలుస్తోంది.

ఇది కూడా చదవండి: మీ ఆఫీస్ ల్యాప్‌టాప్‌లో WhatsApp వెబ్ వాడుతున్నారా?.. ఇది తెలుసుకోండి!

అయితే, విమానం ప్రయాణంలో ఉండగా కాక్‌పిట్ డోర్ తెరిచి ఉండటాన్ని గమనించిన సదురు సిబ్బంది, ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. దీంతో విమానం న్యూయార్క్‌ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయిన వెంటనే, వారు స్థానిక అధికారులకు ఫిర్యాదు చేశారు. పైలట్‌ కాక్‌పిడ్‌ డోర్‌ క్లోజ్ చేయకుండానే విమానాన్ని నడిపినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: రోడ్లపై ఉండే మైలురాళ్లకు వేర్వేరు కలర్స్ ఎందుకు ఉంటాయో తెలుసా?

2011, సెప్టెంబర్‌లో జరిగిన ఉగ్రదాడుల తర్వాత విమానయాన భద్రతా నిబంధనలలో కీలక మార్పులు తీసుకువచ్చారు. అందులో భాగంగానే ప్రయాణ సమయంలో కాక్‌పిట్ డోర్‌ను క్లోజ్‌ చేయడం తప్పనిసరి చేశారు. ఇలా చేయడం నేరమని.. ఈ నిబంధనను ఉల్లంఘిస్తే పైలట్‌లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే పైలెట్‌ చేసింది నేరంగా పరిగణించిన బ్రిటిష్ ఎయిర్‌వేస్ యాజమాన్యం, అతడిని సస్పెండ్ ఆదేశాలు జారీ చేసింది.

ఇది కూడా చదవండి: మీ ఫోన్‌లో ఈ ఐదు సంకేతాలు కనిపిస్తే.. ఇక దాని పనైపోయినట్టే!

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.