Britain-Bird Flu: మొదటిసారిగా మనిషికి బర్ద్ ఫ్లూ.. వ్యాధి వ్యాపించకుండా 20 బాతులను చంపేసిన అధికారులు

|

Jan 07, 2022 | 3:20 PM

Britain-Bird Flu: గ్రేట్ బ్రిటన్ లో ఓ వైపు కరోనా వైరస్ కల్లోలం సృష్టిస్తుండగా.. తాజాగా మానవుల్లో ఫస్ట్ బర్ద్ ఫ్లూ కేసు నమోదైంది. దేశంలో తొలిసారిగా ఈ వ్యాధి బారిన పడిన వ్యక్తికి పక్షులంటే.. ముఖ్యంగా బాతులాంటే..

Britain-Bird Flu: మొదటిసారిగా మనిషికి బర్ద్ ఫ్లూ.. వ్యాధి వ్యాపించకుండా 20 బాతులను చంపేసిన అధికారులు
Britain First Man Catch Dea
Follow us on

Britain-Bird Flu: గ్రేట్ బ్రిటన్ లో ఓ వైపు కరోనా వైరస్ కల్లోలం సృష్టిస్తుండగా.. తాజాగా మానవుల్లో ఫస్ట్ బర్ద్ ఫ్లూ కేసు నమోదైంది. దేశంలో తొలిసారిగా ఈ వ్యాధి బారిన పడిన వ్యక్తికి పక్షులంటే.. ముఖ్యంగా బాతులాంటే అమితమైన ప్రేమ. అందుకే బాతులను తన ఇంట్లో పెంచుతున్నాడు. అయితే ఈ అంటువ్యాధి వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి అతని పెంపుడు 20 బాతులు చంపబడ్డాయి. డెవాన్ లో నివసిస్తున్న 79 ఏళ్ల అలాన్ గోస్లింగ్ తన ఇంట్లో సుమారు  160 బాతులను పెంచుతున్నాడు. ఈ  క్రమంలో అతనికి బర్డ్ ఫ్లూ సోకింది. గోస్లింగ్ రైల్వేలో పని చేసేవాడు. ఇప్పుడు దేశంలో H5N1 సోకిన మొదటి వ్యక్తి అని అధికారులు చెప్పారు.

ప్రపంచవ్యాప్తంగా బర్ద్ ఫ్లూ సోకిన వ్యక్తుల్లో.. సగం మంది మరణించారు. ఈ వ్యాధి 1990లలో వెలుగులోకి వచ్చింది. అప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో భారీగా కేసులు నమోదయ్యాయి.

ప్రస్తుతం గోస్లింగ్ ఆరోగ్యంగా ఉన్నాడని.. సెల్ఫ్ క్వారంటైన్ లో ఉండి చికిత్స తీసుకుంటున్నాడని అధికారులు తెలిపారు. UK బర్డ్ ఫ్లూ కేసు నమోదు అయిన తర్వాత అతని ఇంట్లో  ఉన్న బాతులకు పరీక్షలు నిర్వహించారు.  20 బాతులు బర్ద్ ఫ్లూ బారినపడినట్లు నిర్ధారణ అయింది. దీంతో వాటిని చంపేశారు. అంతేకాదు గోస్లింగ్‌కు ఆరోగ్యంగానే ఉన్నాడని… ఆసుపత్రిలో చికిత్స చేయవలసిన అవసరం లేదని అధికారులు చెప్పారు. అంతేకాదు గోస్లింగ్ నుంచి ఈ బర్ద్ ఫ్లూ మరెవరికి వ్యాపించినట్లు ఆధారాలు లేవని చెప్పారు.

ఇదే విషయంపై గోస్లింగ్ మాట్లాడుతూ.. తనకు గత రెండు వారాలు పీడకల వంటిదని చెప్పారు.  నేను శారీరకంగా బాగానే ఉన్నాను.. కానీ మానసికంగా అలసిపోయినట్లు చెప్పారు. 1990లో తాను రిటైర్ అయినప్పటి నుంచి పక్షులే తనతో పాటు నివసిస్తున్నాయని.. గత 20 ఏళ్లగా తనతో జీవిస్తున్నాయని చెప్పారు. అందువల్ల..ఆ బాతులను చంపడం నాకు చాలా బాధకలిగించిందని చెప్పారు గోస్లింగ్ . ఆ బాతులో నా కుటుంబం, నా జీవితం అన్నారు. పక్షులను చంపడాన్ని గోస్లింగ్ ఖండించారు.

ఇక మరోవైపు అధికారులు గోస్లింగ్‌తో పరిచయం ఉన్న ప్రతి ఒక్కరినీ గుర్తించి ఆరోగ్య పరీక్షలు నిర్వహించినట్లు వైద్య  అధికారులు తెలిపారు.  H5N1 వ్యాప్తి UKలో ఇప్పటివరకు నమోదైన అతిపెద్ద  సంక్షోభం..  బర్డ్ ఫ్లూ బారిన పడడంతో రెండు మిలియన్ల కోళ్లను చంపేశారు.

Also Read:  కుటుంబంలో సుఖసంతోషాలు లేవా.. అయితే పితృదేవతలను ఇలా పూజించండి..