Blast near Kabul Airport: ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్ మరోసారి పేలుళ్లతో దద్దరిల్లింది. కాబూల్‌లో వరుస పేలుళ్లలో వణికిపోతున్నారు జనం. ఎయిర్‌పోర్ట్‌లో పేలుళ్ల ఘటనను మరవకముందే మరో పేలుడు జరిగింది. తాజా పేలుళ్లలో పెద్ద సంఖ్యలో జనం తీవ్రంగా గాయపడ్డారు. మూడు రోజుల్లో రెండోసారి కాబూల్‌లో బాంబు పేలుళ్లు జరిగాయి. అయితే, తాజా పేలుళ్లలో ఎవరి హస్తముందన్న విషయంపై క్లారిటీ రావడం లేదు. తాజా పేలుళ్లకు రాకెట్లను ఉపయోగించినట్టు ప్రత్యక్షసాక్షులు వెల్లడించారు. అమెరికా సైనికులను టార్గెట్ చేస్తూ మరోసారి పేలుళ్లు జరిగాయని అనుమానిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Missile strike on a house near Kabul Airport, nature of the strike unclear pic.twitter.com/wFdhCkHSwn
— ELINT News (@ELINTNews) August 29, 2021
ఆఫ్ఘనిస్థాన్‌లోని కాబూల్ విమానాశ్రయం సమీపంలో భారీ పేలుడు సంభవించింది. ఖవాజా బుఘ్రా ప్రాంతంలో పేలుడు సంభవించింది. ఆ ప్రాంతం మొత్తం పొగ దుప్పటి కమ్ముకుంది. అయితే, అక్కడ ఉన్న వ్యక్తులు భారీ శబ్దాలకు భయాందోళనలకు గురయ్యారు. అంతకుముందు శనివారం, యునైటెడ్ స్టేట్స్ అధ్యక్షుడు జో బిడెన్ ఆఫ్ఘనిస్తాన్‌లోని కాబూల్ విమానాశ్రయంలో రెండు రోజుల కంటే తక్కువ సమయంలో ఉగ్రవాద దాడి జరిగే అవకాశం ఉందని హెచ్చరించారు. అతను అంచనా వేసినట్లుగానే దాడి జరిగడం గమనార్హం.
Read Also… Afghanistan Crisis: మరోసారి పేలుళ్లతో దద్దరిల్లిన ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్.. అమెరికా సైనికులే టార్గెట్‌గా రాకెట్లతో దాడి