brazil president fined for violating covid-19 restrictions…కోవిడ్ రూల్స్ పాటించనందుకు బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బొల్సనారో కు జరిమానా, కేసు నమోదు…
బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బొల్సనారో కోవిడ్ రూల్స్ పాటించలేదంటూ అక్కడి ఓ రాష్ట్ర గవర్నర్ ఆయనకు జరిమానా విధించారు. పైగా ఆరోగ్య శాఖ అధికారులు ఆయనపై కేసు కూడా నమోదు చేశారు. మారన్హావో అనే రాష్ట్ర గవర్నర్ ఫ్లావియో డినో ...
బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బొల్సనారో కోవిడ్ రూల్స్ పాటించలేదంటూ అక్కడి ఓ రాష్ట్ర గవర్నర్ ఆయనకు జరిమానా విధించారు. పైగా ఆరోగ్య శాఖ అధికారులు ఆయనపై కేసు కూడా నమోదు చేశారు. మారన్హావో అనే రాష్ట్ర గవర్నర్ ఫ్లావియో డినో …ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎలాంటి శానిటరీ సేఫ్టీ చర్యలు చేపట్టకుండా ఓ ఈవెంట్ (కార్యక్రమాన్ని) ని నిర్వహించినందుకు ఇలా ఈ చర్య తీసుకున్నామని, చట్టమన్నది అందరికీ సమానమేనని ఆయన అన్నారు.ఈయన లెఫ్టిస్ట్ కూడా.. మితవాద జైర్ బొల్సనారో అంటే ఈ గవర్నర్ కు పడనట్టు కనిపిస్తోంది. మా రాష్ట్రంలో వందమందికి మించి ఏ సభ లేదా కార్యక్రమం నిర్వహించినా అది కోవిద్ రూల్స్ ని ఉల్లంఘించినట్టే అని ఆయన పేర్కొన్నారు. పైగా ఫేస్ మాస్క్ తప్పనిసరి అన్నారు. అటు ఈ జరిమానా వ్యవహారంపై బొల్సనారో కార్యాలయం 15 రోజుల్లోగా అప్పీలు చేయాల్సి ఉంటుంది. ఆ తరువాత ఎంత ఫైన్ చెల్లించాలన్నది నిర్ణయిస్తారు. డినో వ్యాఖ్యలపై స్పందించేందుకు ఈ కార్యాలయం నిరాకరించినప్పటికీ.. డినోను బొల్సనారో ఓ ‘నియంత’ గా ఆరోపించారు. ఆయనను ‘ఛుబ్బీ డిక్టేటర్’ అని దుయ్యబట్టారు.
మారన్ హావో రాష్ట్ర రాజధాని సావో లూయిస్ కి సుమారు 500 కి.మీ. దూరంలో ఉన్న ఓ గ్రామానికి బ్రెజిల్ అధ్యక్షుడు రూరల్ ప్రాపర్టీ టైటిల్స్ ని అప్పగించారు. ఆ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి ఫేస్ మాస్క్ ధరించకుండానే హాజరయ్యారు. కోవిద్ రూల్స్ ని తీవ్రంగా వ్యతిరేకించే ఈయన వీటిని విధిస్తున్న గవర్నర్లను డిక్టేటర్లుగా విమర్శించారు. బ్రెజిల్ లో కోవిద్ కేసులు ఎక్కువగా ఉన్న విషయం గమనార్హం.
మరిన్ని చదవండి ఇక్కడ : sonu sood video : పాన్ ఇండియా మూవీ హీరోగా సోను భాయ్..క్రిష్ దర్శకత్వంలో రియల్ హీరో టూ రీల్ హీరో
వావ్ కాంబినేషన్ సాయి పల్లవి సరసన డేవిడ్ వార్నర్.. వైరల్ అవుతున్న వీడియో ..:David Warner dance video.