Bill Gates: మరో రెండు ప్రమాదాలు పొంచి ఉన్నాయంటున్న మైక్రో సాఫ్ట్ అధినేత.. సంచలన వ్యాఖ్యలు చేసిన బిల్‌గేట్స్..
Bill Gates Warns Of Two More Disasters: ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారి గురించి ముందే ఊహించి మైక్రోఫాస్ట్ అధినేత బిల్‌గేట్స్ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. కరోనా...
Bill Gates Warns Of Two More Disasters: ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారి గురించి ముందే ఊహించి మైక్రోఫాస్ట్ అధినేత బిల్‌గేట్స్ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. కరోనా వ్యాప్తి తీవ్ర స్థాయిలో ఉన్నప్పుడు గతంలో బిల్‌గేట్స్ మాట్లాడిన ఓ వీడియో నెట్టింట్లో తెగ వైరల్‌గా మారింది. ఇదిలా ఉంటే తాజాగా బిల్‌గేట్స్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో వాతావరణ మార్పు, జీవియుధ ఉగ్రవాదం పెను విపత్తులుగా మారనున్నాయని చెప్పారు. ఈ రెండు ప్రపంచాన్ని అతలాకుతం చేస్తాయని హెచ్చరించారు. వీటిని ఎదుర్కొవడానికి ప్రస్తుతం మనిషి సిద్ధంగా లేడని తెలిపారు. ప్రాణాంతక వైరస్‌లను కృత్రిమంగా ల్యాబ్‌లో సృష్టించగలిగే ఈ రోజుల్లో ప్రపంచానికి వీటి నుంచి సమస్యలు తప్పవని గేట్స్ తెలిపారు. వీటి కారణంగా కరోనా వైరస్ బలి తీసుకున్న వారికంటే ఎక్కువగా మరణాలు సంభవించే అవకాశాలున్నాయని ఆయన తెలిపారు. అంతేకాకుండా వాతావరణంలో జరుగుతోన్న మార్పులు, కర్భన ఉద్గారాల విడుదల ఇప్పుడున్న విధంగానే కొనసాగితే.. భూతాపం మరింత పెరిగి అనేక జీవజాతుల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందని గేట్స్ హెచ్చరించారు.
Also Read: పెరుగుతున్న ‘విదేశీ సపోర్ట్’, ఇండియాలో రైతుల ఆందోళనకు హాలీవుడ్ నటి సుసాన్ మద్దతు