పెరుగుతున్న ‘విదేశీ సపోర్ట్’, ఇండియాలో రైతుల ఆందోళనకు హాలీవుడ్ నటి సుసాన్ మద్దతు
భారత్ లో అన్నదాతల ఆందోళనకు మద్దతు తెలుపుతున్న విదేశీ సెలబ్రిటీల్లో మరొకరు చేరారు. హాలీవుడ్ నటి సుసాన్ శారండోన్.. ఈ లిస్టులో చేరింది..
భారత్ లో అన్నదాతల ఆందోళనకు మద్దతు తెలుపుతున్న విదేశీ సెలబ్రిటీల్లో మరొకరు చేరారు. హాలీవుడ్ నటి సుసాన్ శారండోన్.. ఈ లిస్టులో చేరింది. న్యూయార్క్ టైమ్స్ లో ప్రచురితమైన ఓ న్యూస్ స్టోరీని ఆమె పోస్ట్ చేస్తూ.. ఇండియాలో రైతుల ఆందోళనకు తను సంఘీభావం తెలుపుతున్నానని ట్వీట్ చేసింది. ఇదివరకే…. క్లైమేట్ చేంజ్ యాక్టివిస్ట్ గ్రెటా థన్ బెర్గ్, పాప్ సింగర్ రిహానా, అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ మేనకోడలు, లాయర్ మీనా హారిస్, యాక్టర్ అమందా సెర్ని, సింగర్స్ జైసీన్, డాక్టర్ జ్యుస్, మాజీ ఎడల్ట్ స్టార్ మియా ఖలీఫా తదితరులు కూడా తమ సపోర్ట్ ప్రకటించారు. అయితే ఈ ట్వీట్లను చేసేముందు ఇలాంటివారు వాస్తవాలను తెలుసుకోవాలని భారత ప్రభుత్వం పేర్కొంది. ఇవి బాధ్యతారాహిత్యమని, ఇండియాను టార్గెట్ చేసే ఈ విధమైన ప్రచారాలు విఫలమవుతాయని తెలిపింది. కొద్దిమంది రైతుల నిరసన పై వీరు స్పందించడం ఏమిటని విదేశాంగ మంత్రి జైశంకర్ ప్రశ్నించారు.
అయినా ఇది భారత అంతర్గత వ్యవహారమని ఆయన అన్నారు. ఇతర దేశాల్లో జరిగే ఆందోళనల్లో భారత్ ఇలాగే జోక్యం చేసుకుంటుందా అని కూడా ఆయన అన్నారు. ఈ ట్వీట్ల వెనుక అదృశ్య శక్తుల హస్తం ఉండవచ్చునని ప్రభుత్వం అనుమానిస్తోంది.
Standing in solidarity with the #FarmersProtest in India. Read about who they are and why they’re protesting below. https://t.co/yWtEkqQynF
— Susan Sarandon (@SusanSarandon) February 5, 2021
Read More:
సర్పంచ్ కావాలంటే శివుని కటాక్షం ఉండాల్సిందే … ఆ గ్రామంలో శివాలయం నిర్మించిన వారికే సర్పంచ్ పదవి..
ఆ బ్యాంకుల్లోని ఖాతాదారులకు గమనిక.. ఇవే లాస్ట్ డేట్‌లు.. లేదంటే ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్స్ బంద్.!
ఇంగ్లాండ్‌తో ఓటమి తర్వాత లంకేయుల దిద్దుబాటు చర్యలు… సీనియర్ ఆటగాళ్లతో సాంకేతిక సలహా కమిటీ ఏర్పాటు