ఆశ్చర్యం ! చక్కా జామ్ ఎఫెక్ట్ పడని ఘాజీపూర్ బోర్డర్, గట్టి పోలీసు బందోబస్తు మధ్య అంతా శాంతియుత పరిస్థితి !

శనివారం రైతులు చేపట్టిన చక్కా జామ్ ఆందోళన మూడు రాష్ట్రాలు మినహా మిగిలిన చోట్ల మూడు గంటల పాటు సాగింది. తాము లక్యంగా పెట్టుకున్న..

ఆశ్చర్యం ! చక్కా జామ్ ఎఫెక్ట్ పడని ఘాజీపూర్ బోర్డర్, గట్టి పోలీసు బందోబస్తు మధ్య  అంతా శాంతియుత పరిస్థితి !
Follow us
Umakanth Rao

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Feb 06, 2021 | 7:18 PM

శనివారం రైతులు చేపట్టిన చక్కా జామ్ ఆందోళన మూడు రాష్ట్రాలు మినహా మిగిలిన చోట్ల మూడు గంటల పాటు సాగింది. తాము లక్యంగా పెట్టుకున్న వివిధ రాష్ట్రాల్లో హైవేలను అన్నదాతలు నిర్బంధించారు. వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. అయితే అత్యవసర అంబులెన్స్ వంటివాటికి మాత్రం వారు అనుమతించారు. ఇంత ఆందోళనలోనూ వారి ఆందోళనకు కేంద్ర స్థానంగా ఉన్న ఘాజీపూర్ బోర్డర్ లో  మాత్రం శాంతియుత పరిస్థితి కనిపించింది. ఇందుకు కారణం కనీవినీ ఎరుగని పోలీసు, పారా మిలిటరీ బలగాలను ఇక్కడ ప్రభుత్వం నియమించడమే.. లోగడ గత నెల 26 రిపబ్లిక్ డే నాడు జరిగిన అల్లర్లు, ఘర్షణలను దృష్టిలో ఉంచుకుని శనివారం ఈ బోర్డర్ లో మళ్ళీ అలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా చూసేందుకు ఉదయం నుంచే భారీగా భద్రతా బలగాలను మోహరించారు. కాగా ఢిల్లీలోని ఐ టీ ఓ ప్రాంతంలో నిరసన తెలిపేందుకు యత్నించిన వామపక్ష పార్టీలవారిని పోలీసులు అడ్డుకున్నారు.కొంతమందిని అరెస్టు చేశారు. అక్కడికి ఒక్క ఆందోళనకారుడిని కూడా వారు అనుమతించలేదు.