ఇంగ్లాండ్‌తో ఓటమి తర్వాత లంకేయుల దిద్దుబాటు చర్యలు… సీనియర్ ఆటగాళ్లతో సాంకేతిక సలహా కమిటీ ఏర్పాటు
శ్రీలంక క్రికెట్ బోర్డ్ సలహా కమిటీని ప్రకటించింది. ఇందులో ఆ దేశ దిగ్గజ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్, మాజీ కెప్టెన్ కుమార సంగక్కరను సలహా కమిటీ సభ్యులుగా తీసుకుంది. సాంకేతిక సలహా కమిటీలో...
Sri Lanka Cricket Board : శ్రీలంక క్రికెట్ బోర్డ్ సలహా కమిటీని ప్రకటించింది. ఇందులో ఆ దేశ దిగ్గజ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్, మాజీ కెప్టెన్ కుమార సంగక్కరను సలహా కమిటీ సభ్యులుగా తీసుకుంది. సాంకేతిక సలహా కమిటీలో నలుగురితో కలిపి ఓ టీమ్ తయారు చేసింది బోర్డు.
శ్రీలంక క్రీడా మంత్రి నమల్ రాజపక్స ఆదేశాల మేరకు బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. మాజీ బ్యాట్స్మన్ అరవింద డి సిల్వాను సలహా కమిటీ అధ్యక్షుడిగా శ్రీలంక క్రికెట్ బోర్డు నియమించింది. మాజీ బ్యాట్స్మన్, ఐసీసీ మ్యాచ్ రిఫరీ రోషన్ మహానమాను కూడా కమిటీలో సభ్యుడిగా చేర్చింది.
సొంత గడ్డపై ఇంగ్లాండ్‌తో రెండు టెస్ట్ సిరీస్లలో ఓటమిపాలైన నేపథ్యంలో సలహా కమిటీ నూతన సభ్యులను నియమించింది. ఇందుకోసం పలుమార్లు క్రీడామంత్రితో చర్చలు జరిపింది. చివరి ఈ నిర్ణయం తీసుకుంది. వీరు రాబోయే రోజుల్లో జట్టు ఎంపికలో తీసుకోవల్సిన జాగ్రత్తలు.. కొత్త ఆటగాళ్ల ఎంపిక వంటి అంశాలు ఈ కమిటీ సభ్యులు ఫోకస్ పెడుతారు.
ఇవి కూడా చదవండి :
ఇంటర్ విద్యార్థులకు గుడ్‌న్యూస్.. మోడల్ పేపర్లలో కీలక మార్పులు.. విడుదల చేసిన తెలంగాణ ఇంటర్ బోర్డ్..! AP Corona Bulletin : ఏపీ కరోనా బులెటిన్ విడుదల.. గత 24 గంటల్లో కొత్త కరోనా కేసులు ఎన్నంటే..! AP Local Body Elections : ఎవరూ మమ్మల్ని నిందించొద్దు.. ఎస్‌ఈసీ నిమ్మగడ్డను కలిసిన ఉద్యోగ సంఘాల నేతలు