ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఒకొక్కసారి ప్రమాదాలు జరుగుతునే ఉన్నాయి. మన తెలివితేటలతో కొన్ని ప్రమాదాలను అరికట్టవచ్చు. అయితే కొన్ని ప్రమాదాలు మన అదుపులో ఉండవు. ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నా ప్రమాదం ఆపలేం. అయితే ఎలాంటి సంఘటనలు అయినా సరే కాలం కలిసి రాకపోతే తీవ్ర గాయాలు అవ్వొచ్చు.. ఒకొక్కసారి ప్రాణాలు కూడా పోగొట్టుకోవచ్చు. అయితే కొంతమంది అదృష్ట వంతులు ఉంటారు. ఎటువంటి భయంకరమైన ప్రమాదం జరిగినా చావు అంచుల వరకూ వెళ్లి.. ఎటువంటి హాని కలగకుండా సేఫ్ గా బయటపడతాడు. ప్రస్తుతం ఆలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన తర్వాత ఎవరైనా సరే అదృష్టం అంటే ఇదే అని అంటారు.
వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఇద్దరు బైక్ రైడర్లు భయంకరమైన ప్రమాదం నుండి తృటిలో తప్పించుకోవడం కనిపించింది. వీడియోలో ఫుడ్ డెలివరీ ఏజెంట్ తన స్కూటర్‌తో రోడ్డు పక్కన నిలబడి ఉండగా.. మరొక డెలివరీ ఏజెంట్ అక్కడికి చేరుకుని, అతను తన స్కూటర్‌ను అదే రోడ్డు పక్కన పార్క్ చేసి ఎక్కడికో వెళ్లడం మొదలు పెట్టాడు. ఇంతలో అక్కడ నిలబడి ఉన్న ఒక పెద్ద చెట్టు అకస్మాత్తుగా వేర్లతో సహా కుప్పకూలి పోయి రోడ్డుపై పడింది. అయితే అదృష్టవశాత్తూ డెలివరీ ఏజెంట్లు ఇద్దరూ ప్రమాదం నుండి బయటపడ్డారు. వారి శరీరంపై చిన్న గీత కూడా పడలేదు. అయితే ఈ ఘటన ఎక్కడ జరిగిందనేది ఇంకా వెల్లడి కానప్పటికీ, ఈ వీడియో మాత్రం జనాన్ని ఆశ్చర్యపడేలా చేసింది.
Definition of LUCK 😳 pic.twitter.com/RMBusP8Foz
— Wolf of X (@tradingMaxiSL) May 2, 2024
ఈ హృదయాన్ని కదిలించే వీడియో @gunsnrosesgirl3 అనే IDతో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయబడింది. కేవలం 15 సెకన్ల ఈ వీడియోను ఇప్పటివరకు 4 మిలియన్ల మంది అంటే 40 లక్షలకు పైగా వీక్షించగా, 33 వేల మందికి పైగా వీడియోను కూడా లైక్ చేశారు.
అదే సమయంలో వీడియో చూసిన తర్వాత ప్రజలు వివిధ రకాల రియాక్షన్లు ఇచ్చారు. ఒక వినియోగదారు ఇలా వ్రాశారు, ‘దేవుడు ఎల్లప్పుడూ దేవుడే. అతను మమ్మల్ని ఆపదలో నేడతాడు.. అదే సమయంలో ఎల్లప్పుడూ మనకు మార్గనిర్దేశం చేస్తాడు.. తద్వారా దానిని అధిగమించగలము అని కామెంట్ చేశారు. అంతేకాదు దేవుడికి కృతజ్ఞతలు చెప్పడానికి ఇలాంటివి సాక్ష్యాలుగా ఉంటాయి’ అని మరొక వినియోగదారు రాశారు. ఇది చాలా దయగల చెట్టు. ఇది ఎవరికీ హాని చేయలేదు.
మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..