మరణం తర్వాత ఏమి జరుగుతుందో ఏ మానవులకు తెలుసు. మానవులమైన మనకు మన భవిష్యత్తు గురించి.. అంత ఎందుకు మరుక్షణం ఏమి జరుగుతుందో కూడా తెలియదు. కనుక మనిషి మరణం తర్వాత ప్రపంచాన్ని ఎలా చూడగలరు. మరణించిన తర్వాత అందమైన లేదా వింత ప్రపంచాన్ని చూశామని చెప్పుకునే వ్యక్తులు ప్రపంచంలో కొందరు ఉన్నారన్న సంగతి తెలిసిందే.. తాజాగా ఒక మహిళ ఇంగ్లాండ్ నివాసి తన వాదనతో ప్రజలను ఆలోచింపజేసింది. ఈ మహిళ చెప్పిన విషయాలను విన్న వైద్యులు కూడా అయోమయంలో పడ్డారు. ఒక నెలలో తాను మూడుసార్లు చనిపోయానని మరణించిన తర్వాత తాను ఏసు క్రీస్తును కలిశానని ఆ మహిళ పేర్కొంది .
ప్రముఖ వార్త పత్రిక మిర్రర్ నివేదిక ప్రకారం.. ఆ మహిళ పేరు బెవర్లీ గిల్మర్. వయస్సు 57 సంవత్సరాలు. తనకు 20 ఏళ్ల వయసులో చాలా విచిత్రమైన అనుభవం ఎదురైందని చెప్పింది. తాను బ్రెయిన్ ట్రామా గుండా వెళ్తున్న సమయంలో చనిపోయానని చెప్పింది. అప్పుడు తన ఆత్మ నేరుగా యేసుక్రీస్తు వద్దకు వెళ్లింది. అప్పుడు ఏసు తనతో చాలా విషయాలు మాట్లాడాడని చెప్పింది. ఇది మాత్రమే కాదు, తాను వాల్ట్ డిస్నీని కూడా కలిశానని ఆమె పేర్కొంది. వాల్ట్ డిస్నీ 1966లో మరణించిన ప్రముఖ కార్టూనిస్ట్.
బెవర్లీ ముగ్గురు పిల్లల తల్లి. అయితే తనకు భగవంతుడు అంటే పెద్దగా భక్తి లేదని.. దేవుణ్ణి ఎక్కువగా నమ్మనని బెవర్లీ చెప్పింది. అయినప్పటికీ ఏసు తనను కలవడానికి వస్తూనే ఉంటాడని ఆమె స్వయంగా చెప్పింది. ఆ మహిళ చేసిన ఈ వింత వాదనలో నిజానిజాలు కొంతమేరకు వైద్యులు కనుగొన్నారు. బ్రెయిన్ ట్రామా లేదా బ్రెయిన్ ఇంజురీ వల్ల ఇలాంటి వింత అనుభవాలు ఎదురవుతాయని వైద్యులు భావిస్తున్నారు. అయితే.. తమ వాదనలో నిజం ఉందని నిర్దిష్టంగా ఏమీ చెప్పడం లేదు.
నివేదికల ప్రకారం బెల్జియన్ విశ్వవిద్యాలయానికి చెందిన కొంతమంది పరిశోధకులు ఇప్పుడు బెవర్లీ వింత పరి స్థితిపై పరిశోధనలు చేస్తున్నారు. తాను మరణించిన అనంతరం ప్రపంచాన్ని చూడగలనని, చనిపోయిన వ్యక్తులను చూడగలనని చెబుతున్న మహిళకు ఉన్న సమస్య ఏమిటో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..