Bentley Mulsanne: లండన్‌లో చోరీ చేసిన లగ్జరీ కారు.. కరాచీలో ప్రత్యక్షం.. తీగ లాగితే పోలీసుల ఫ్యూజులు ఔట్..!

|

Sep 04, 2022 | 9:58 PM

Bentley Mulsanne: అత్యంత విలాసవంతమైన కారు.. బిలియనీర్స్‌ మాత్రమే మాత్రమే ఉపయోగించే కారు.. దాదాపు రూ. 2.30 కోట్ల లక్షల విలువజేసే..

Bentley Mulsanne: లండన్‌లో చోరీ చేసిన లగ్జరీ కారు.. కరాచీలో ప్రత్యక్షం.. తీగ లాగితే పోలీసుల ఫ్యూజులు ఔట్..!
Bentley Mulsanne
Follow us on

Bentley Mulsanne: అత్యంత విలాసవంతమైన కారు.. బిలియనీర్స్‌ మాత్రమే మాత్రమే ఉపయోగించే కారు.. దాదాపు రూ. 2.30 కోట్ల లక్షల విలువజేసే ఆ బెంట్లీ కారు కొద్ది వారాల క్రితం లండన్‌లోని ధనికుడి ఇంటి మాయమైపోయింది. ఆయన వెంటనే అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. లండన్‌ క్రైమ్‌ పోలీసులు విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. చివరకు ఆ కారు పాకిస్తాన్‌లోని కరాచీలో ఉన్నట్లు గుర్తించారు.. ఆ కారు ఎక్కడ ఉందో కూడా సరిగ్గా పాయింట్‌ఔట్‌ చేశారు. పాకిస్తాన్‌ కస్టమ్స్‌ ఎన్స్‌పోర్స్‌మెంట్‌ విభాగానికి లండన్‌ పోలీసులు ఈ సమాచారం అందించారు.

కరాచీలో సంపన్నులు నివసించే డిఫెన్స్‌ హౌసింగ్‌ అథారిటీ కాలనీలో బెంట్లీ కారును గమనించారు. ఓ సంపన్నుడి ఇంట్లో ఈ కారు ఉంది. ఆ కారుకు పాకిస్తాన్‌ రిజిస్ట్రేషన్‌ నెంబర్‌ ప్లేట్‌ బిగించినా, ఆది నకిలీదని గుర్తించారు అధికారులు. లండన్‌ పోలీసులు ఇచ్చిన ఛాసిస్‌ నెంబర్‌ మ్యాచ్‌ అయింది. ఆ ఇంటి యజమాని సరైన పత్రాలును చూపించలేకపోవడంతో కారును స్వాధీనం చేసుకున్నారు.. కారు కొన్న వ్యక్తిని, అమ్మిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే తతంగం వెనుక ఉన్న అసలు సూత్రధాని ఇంకా దొరకలేదు. అతని కోసం గాలిస్తున్నారు.

యూరోప్‌కు చెందన ఓ దౌత్యవేత్త పత్రాలను ఉపయోగించుకొని కారును లండన్‌ నుంచి పాకిస్తాన్‌కు తరలించినట్లు పోలీసుల విచారణలో తేలింది. కాగా అక్రమ పద్దతిలో కారు తీసుకురావడంతో తాను పన్ను కోల్పోయమంటున్న పాకిస్తాన్‌ అధికారులు బెంట్లీ కారుకు 300 మిలియన్స్‌ రూపాయల ఫైన్‌ వేశారు.. ఈ కారులో అత్యాధునిక ట్రాకింగ్‌ సిస్టమ్‌ ఉంది. కారు దొంగలకు ఈ విషయం తెలియదు. ట్రాకింగ్‌ వ్యవస్థను వారు ఆఫ్‌ చేయకపోవడంతో లండన్‌ పోలీసులు చాలా సులువుగా అది ఎక్కడ ఉందో గుర్తించేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..