AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bangladesh PM India Tour: భారత్ లో పర్యటిస్తున్న బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా.. నరేంద్ర మోదీతో ఈఅంశంపై ప్రధానంగా చర్చించే అవకాశం..

బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా నాలుగు రోజుల పర్యటన కోసం భారత్ చేరుకున్నారు. భారత్, బంగ్లాదేశ్ మధ్య స్నేహ బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవడంలో భాగంగా ఆమె తన పర్యటనలో దేశంలోని పలువురు అగ్రనాయకులను కలవనున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము..

Bangladesh PM India Tour: భారత్ లో పర్యటిస్తున్న బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా.. నరేంద్ర మోదీతో ఈఅంశంపై ప్రధానంగా చర్చించే అవకాశం..
Sheikh Hasina
Amarnadh Daneti
|

Updated on: Sep 05, 2022 | 4:27 PM

Share

Bangladesh PM India tour: బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా (Sheikh Hasina) నాలుగు రోజుల పర్యటన కోసం భారత్ చేరుకున్నారు. భారత్, బంగ్లాదేశ్ మధ్య స్నేహ బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవడంలో భాగంగా ఆమె తన పర్యటనలో దేశంలోని పలువురు అగ్రనాయకులను కలవనున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu), ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ తో మర్యాదపూర్వకంగా సమావేశమవుతారు. ఆతర్వాత ప్రధానమంత్రి నరేంద్రమోదీ(Narendra Modi) తో ద్వైపాక్షిక సమావేశంలో పాల్గొంటారు. విదేశాంగ శాఖ మంత్రి సుబ్రమణ్యం జైశంకర్ తో కూడా ఆమె సమావేశమవుతారు.

2019 అక్టోబర్ లో బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా భారత్ లో చివరిగా పర్యటించారు. నాలుగు రోజుల పర్యటనలో భాగంగా చివరి రోజైన గురువారం రాజస్థాన్ లోని అజ్మీర్‌కు వెళ్తారు. అక్కడ సూఫీ సెయింట్ మొయినుద్దీన్ చిస్తీ దర్గాను సందర్శిస్తారు. సోమవారం ఢిల్లీ చేరుకున్న షేక్ హసీనాకు కేంద్ర రైల్వే, టెక్స్ టైల్స్ శాఖ సహాయ మంత్రి దర్మనా జర్దోష్ స్వాగతం పలికారు. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా పర్యటన ద్వారా ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలోపేతమవుతుందని ఆకాంక్షిస్తున్నట్లు విదేశాంగ శాఖ మంత్రి అరిందమ్ బాగ్చి ట్వీట్ చేశారు.

ఇవి కూడా చదవండి

కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ (CII) నిర్వహించే ఓ బిజినెస్ సమ్మిట్ కు బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా హాజరవుతారు. భారత్ లో పర్యటిస్తున్న షేక్ హసీనా బృందంలో ఆదేశ విదేశాంగ మంత్రి ఎకె అబ్దుల్ మోమెన్, వాణిజ్య మంత్రి టిప్పు మున్షీ, రైల్వే మంత్రి ఎండీ నూరుల్ ఇస్లాం సుజన్, ప్రధానమంత్రి ఆర్థిక వ్యవహారాల సలహాదారు మషియుర్ ఎకెఎం రెహమాన్ ఉన్నారు. భద్రత సహకారం, పెట్టుబడులు, మెరుగైన వాణిజ్య సంబంధాలు, విద్యుత్తు, ఇంధన రంగాల్లో పరస్పర సహకారం, ఉమ్మడి నదుల నీటి భాగస్వామ్యం, నీటి వనరుల నిర్వహణ, సరిహద్దు ప్రాంతాల్లో భద్రత నిర్వహణ, మాదకద్రవ్యాల అక్రమ రవాణ నియంత్రణ మొదలైన అంశాలపై ప్రధానమంత్రి నరేంద్రమోదీతో జరిగే ద్వైపాక్షిక సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా బంగ్లాదేశ్ కు తీవ్రమైన సమస్యగా మారిన రోహింగ్యాల విషయంపై కూడా ప్రధానమంత్రి నరేంద్రమోదీతో.. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోదంఇ. ఇటీవల ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. రోహింగ్యాలు తమ దేశంలో అధికంగా ఉన్నారని.. తాము ఎన్నో ఇబ్బందులు పడుతున్నామని.. వారిని తమ స్వస్థలాలకు పంపించేందుకు తమకు ఇతర దేశాల సహకారం అవసరమన్నారు. భారత్ కూడా ఈవిషయంలో అనుకున్నంత సహకారం ఇవ్వలేదని చెప్పారు. ఈదశలో ఈవిషయం కూడా ప్రధాని నరేంద్రమోదీతో జరిగే ద్వైపాక్షిక సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం చూడండి..