బంగ్లాదేశ్ క్రమంగా చైనాకు దగ్గరవుతోందా ? ఆ విషయంలో కీలక నిర్ణయం, ఇండియా కాదంటే ఇక డ్రాగన్ కంట్రీయే దిక్కయిందా ?

| Edited By: Phani CH

May 20, 2021 | 12:02 PM

ఇండియాకు పొరుగునున్న బంగ్లాదేశ్ క్రమంగా చైనాకు దగ్గరవుతున్నట్టు కనిపిస్తోంది. చైనా నుంచి కోవిద్ వ్యాక్సిన్లను కొనుగోలు చేయాలన్న ప్రతిపాదనను బంగ్లా ప్రభుత్వం ఆమోదించింది.

బంగ్లాదేశ్ క్రమంగా చైనాకు దగ్గరవుతోందా ? ఆ విషయంలో కీలక నిర్ణయం, ఇండియా కాదంటే ఇక డ్రాగన్ కంట్రీయే దిక్కయిందా ?
Bangladesh Approves Purchas
Follow us on

ఇండియాకు పొరుగునున్న బంగ్లాదేశ్ క్రమంగా చైనాకు దగ్గరవుతున్నట్టు కనిపిస్తోంది. చైనా నుంచి కోవిద్ వ్యాక్సిన్లను కొనుగోలు చేయాలన్న ప్రతిపాదనను బంగ్లా ప్రభుత్వం ఆమోదించింది. దేశంలో పెరుగుతున్న కోవిడ్ కేసులను అదుపు చేసేందుకు ఈ చర్య తప్పనిసరని ఆర్ధిక వ్యవహారాలపై గల బంగ్లా కేబినెట్ నిర్ణయించిందని అధికార వర్గాలు తెలిపాయి., డ్రాగన్ కంట్రీ నుంచి సైనోఫామ్ వ్యాక్సిన్ కొనుగోలుకు ఈ కేబినెట్ సమావేశంలో గ్రీన్ సిగ్నల్ లభించిందని సీనియర్ కేబినెట్ డివిజన్ అధికారి షాహిదా అఖ్తర్ తెలిపారు. చైనా డొనేట్ చేసిన తొలి దోషులను బంగ్లాదేశ్ లో చైనా రాయబారి లీ జమింగ్ ఇటీవల బంగ్లా విదేశాంగ మంత్రి అబ్దుల్ మెమన్ కు అందజేశారు. అయినా మరిన్ని డోసులు అవసరమవుతాయని బంగ్లా అధికారులు అంచనా వేయడంతో కేబినెట్ ఈ నిర్ణయం తీసుకుంది. సైనోఫామ్ టీకామందును వచ్చేవారం నుంచి దేశ ప్రజలకు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇండియాలో వ్యాక్సిన్ కొరత దృష్ట్యా ఈ పొరుగు దేశానికి టీకామందును భారత ప్రభుత్వం గత ఏప్రిల్ 26 నుంచి నిలిపివేసింది. దీంతో అక్కడి ప్రభుత్వం చైనామీద ఆధారపడక తప్పలేదు.

ఇప్పటివరకు 5.82 మంది మిలియన్ల మంది ఈ దేశంలో తొలి డోసు వ్యాక్సిన్ తీసుకున్నారు. నిన్న బంగ్లాదేశ్ లో 1608 కొత్త కోవిద్ కేసులు నమోదయ్యాయి. 37 మంది రోగులు మరణించారు. దీంతో ఇప్పటివరకు 12,248 మంది రోగులు మరణించినట్టు అధికారవర్గాలు తెలిపాయి. కోవిద్ కేసుల సంఖ్య 783,737 కి పెరిగినట్టు ఈ వర్గాలు వివరించాయి. అటు పాకిస్థాన్ కూడా చైనా నుంచి సైనోఫామ్ వ్యాక్సిన్ తెప్పించుకుంటోంది.

 

మరిన్ని ఇక్కడ చూడండి: AP Assembly Budget 2021 Live: ఏపీ బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్న బుగ్గన… హైలైట్స్ ఇవే..

మార్స్ ఉపరితలం నుంచి మొట్ట మొదటిసారి చైనా రోవర్ ఝురాంగ్ పంపిన తొలి చిత్రాలు ఇవే..