AP Budget 2021 Live: సంక్షేమానికే పెద్ద పీట వేసిన ఏపీ ప్రభుత్వం.. 2021-22 వార్షిక బడ్జెట్‌ హైలైట్స్ ఇవే..

Ravi Kiran

|

Updated on: May 20, 2021 | 4:14 PM

AP Assembly Budget session Live updates: ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఒక్క రోజు జరిగే ఈ అసెంబ్లీ సమావేశాల్లో గురువారం నాడు ఆర్ధిక మంత్రి...

AP Budget 2021 Live: సంక్షేమానికే పెద్ద పీట వేసిన ఏపీ ప్రభుత్వం.. 2021-22 వార్షిక బడ్జెట్‌ హైలైట్స్ ఇవే..
Ap Budget 2021 2022

AP Assembly Budget session Live updates: ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఒక్క రోజు జరిగే ఈ అసెంబ్లీ సమావేశాల్లో గురువారం నాడు ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాద్ 2021-22 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. మొత్తం ఈ ఏడాది రాష్ట్ర బడ్జెట్ అంచనా.. రూ.2,29,779.27 కోట్లుగా తెలిపారు. ఈ బడ్జెట్‌లో సంక్షేమానికి పెద్ద పీట వేశారు. అలాగే వెనుకబడిన కులాలకు ఈ బడ్జెట్‌లో 32 శాతం అధిక కేటాయింపులు చేసినట్లు వెల్లడించారు. ఇదిలా ఉంటే వ్యవసాయ బడ్జెట్‌ను మంత్రి కన్నబాబు ప్రవేశపెట్టన్నారు.

బడ్జెట్‌ కేటాయింపులు ఇలా ఉన్నాయి..

  • బీసీ సంక్షేమానికి బడ్జెట్‌లో రూ. 28,237 కోట్లు
  • ఈబీసీ సంక్షేమం కింద, బడ్జెట్‌ రూ.5,478కోట్లు
  • కాపు సంక్షేమం కోసం 3,306 కోట్లు
  • బ్రాహ్మణుల సంక్షేమం కింద రూ.359 కోట్లు
  • ఎస్సీ సబ్‌ప్లాన్‌ కింద రూ. 17403 కోట్లు
  • ఎస్టీ సబ్‌ప్లాన్‌ కింద రూ. 6,131కోట్లు
  • మైనార్టీ యాక్షన్‌ ప్లాన్‌కింద రూ. 3,840.72 కోట్లు
  • మైనార్టీ సబ్‌ప్లాన్‌లో 7శాతం పెరుగుదల, రూ.1756 కోట్లు
  • పిల్లలు, చిన్నారులకోసం బడ్జెట్‌లో రూ. 16,748 కోట్లు
  • మహిళల అభివృద్ధికి రూ. 47,283.21 కోట్లు
  • వ్యవసాయ పథకాలకు కేటాయింపులు 11,210 కోట్లు
  • విద్యా పథకాలకు రూ.24,624 కోట్లు
  • వైద్యం– ఆరోగ్యానికి రూ.13,830 కోట్లు
  • వైఎస్సార్‌ పింఛన్‌ కానుక: రూ.17 వేల కోట్లు
  • వైఎస్సార్‌ రైతు భరోసా: రూ.3,845 కోట్లు
  • జగనన్న విద్యా దీవెన: రూ.2,500 కోట్లు
  • జగనన్న వసతి దీవెన: రూ.2,223.15 కోట్లు
  • వైఎస్సార్‌-పీఎం ఫసల్‌ బీమా: రూ.1802 కోట్లు
  • డ్వాక్రా సంఘాల సున్నా వడ్డీ చెల్లింపులు: రూ.865 కోట్లు
  • వైఎస్సార్‌ జగనన్న చేదోడు: రూ.300 కోట్లు
  • వైఎస్సార్‌ వాహన మిత్ర: రూ.285 కోట్లు
  • వైఎస్సార్‌ నేతన్న నేస్తం: రూ.190 కోట్లు
  • వైఎస్సార్‌ మత్స్యకార భరోసా: రూ.120 కోట్లు
  • ఈబీసీ నేస్తం: రూ.500 కోట్లు
  • వైఎస్సార్‌ ఆసరా: రూ.6,337 కోట్లు
  • అమ్మఒడి: రూ.6,107 కోట్లు
  • వైఎస్సార్‌ చేయూత: రూ.4,455 కోట్లు
  • మత్స్యకారులకు డీజిల్‌ రాయితీ: రూ.50 కోట్లు
  • అగ్రిగోల్డ్‌ బాధితులకు చెల్లింపులు: రూ.200 కోట్లు
  • రైతులకు నష్ట పరిహారం: రూ.20 కోట్లు
  • లా నేస్తం: రూ.16.64 కోట్లు
  • పట్టణ ప్రాంత డ్వాక్రా మహిళలు: రూ.247 కోట్లు
  • రైతులకు సున్నా వడ్డీ చెల్లింపులు: రూ.500 కోట్లు
  • వైఎస్సార్‌ కాపు నేస్తం: రూ.500 కోట్లు
  • రైతు పథకాలు: రూ.11,210.80 కోట్లు

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 20 May 2021 03:39 PM (IST)

    సీఎం జగన్ ప్రసంగం హైలైట్స్..

    పధకాలను పేదల ఇంటికే తీసుకెళ్లి అందిస్తున్నాం

    రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది

    ఏ ఎన్నికలోనైనా ఒకే ఒక జెండా ఎగిరింది

    కుట్రలు పన్ని ఆఫీసులపై రంగులు చేరిపేసారు

    కానీ జనం గుండెల్లో అభిమానాన్ని చెరిపేయలేకపోయారు

    అసెంబ్లీలో అడుగు పెట్టాలంటే ప్రతిపక్షం మొహం చెల్లని పరిస్థితి

    ఈ 23 నెలల కాలంలో రూ. 93,708 కోట్లను అందించాం

    నేరుగా లబ్దిదారులకే అందించాం

    మనం ప్రజలకు సేవకులమన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి

    నేను కూడా అలా గుర్తు పెట్టుకుని పని చేస్తాను

  • 20 May 2021 03:15 PM (IST)

    సీఎం జగన్ ప్రసంగం హైలైట్స్..

    అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి 90 శాతం వాగ్దానాలను అమలు చేసి చూపించామని సీఎం జగన్ అన్నారు. కేవలం 8 వాగ్దానాలు మాత్రమే చేయాల్సినవి ఉన్నాయని పేర్కొన్నారు. నిన్నటి కన్నా ఇవాళ బాగుంటేనే అభివృద్ధి అని అంటారన్న సీఎం.. స్కూల్స్ ను కూడా బాగు చేయడమే అభివృద్ధి అని తెలిపారు.

  • 20 May 2021 03:02 PM (IST)

    సీఎం జగన్ ప్రసంగం హైలైట్స్..

    ఏ స్థాయిలో అయినా తప్పులు జరిగిపోయాయి

    ప్రజల మనోధైర్యాన్ని దెబ్బతీయకండి

    ఆడే గుండెను కూడా ఆపేయకండి

    ప్రతిపక్ష పార్టీ విచక్షణకే వదిలేస్తున్నాం

    ఇప్పటికైనా తీరు మార్చుకోండి

    వాళ్లలా నాకు వయసు, అనుభవం ఉండకపోవచ్చు

    కానీ చిత్తశుద్ధితో పని చేస్తున్నాం

  • 20 May 2021 02:59 PM (IST)

    సీఎం జగన్ ప్రసంగం హైలైట్స్..

    ఒకే రోజు 6.25 లక్షల మందికి వ్యాక్సిన్ వేశాం

    ఇదీ మన కెపాసిటీ అని దేశానికీ చూపించాం

    కరోనా సమయంలో అందరూ కలిసి పని చేయాలి

    ఒకరినొకరు ప్రోత్సహించాలి, మద్దతుగా ఉండాలి

    దేశం, ప్రపంచం మనల్ని చూస్తోంది

    60 శాతం మందికి వ్యాక్సిన్ వేస్తేనే బయటపడతాం

    అప్పటి వరకు కరోనాతో సహజీవనం చేయాల్సిందే

  • 20 May 2021 02:58 PM (IST)

    సీఎం జగన్ ప్రసంగం హైలైట్స్..

    తల్లిదండ్రులను కోల్పోయిన వారిని చూస్తే బాధేస్తోంది

    తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు రూ. 10 లక్షలు డిపాజిట్

    కనీసం ఆ డిపాజిట్ పై వడ్డీతోనైనా బ్రతుకుతారు

  • 20 May 2021 02:58 PM (IST)

    సీఎం జగన్ ప్రసంగం హైలైట్స్..

    ఫస్ట్ ప్రయార్టీ 45 ఏళ్లు దాటిన వారు

    అందరికీ ఉచితంగానే వ్యాక్సిన్లు వేయిస్తాం

    బ్లాక్ ఫంగస్ చికిత్స కోసం 17 ఆసుపత్రులు నోటిఫై చేశాం

    ఎంత కష్టపడినా మరణాలను నివారించాలేకపోతున్నాం

  • 20 May 2021 02:57 PM (IST)

    సీఎం జగన్ ప్రసంగం హైలైట్స్..

    గ్లోబల్ టెండర్లకు వెళ్ళిన మొదటి రాష్ట్రం మనదే

    ఖచ్చితంగా వ్యాక్సిన్లు తెస్తాం

    ప్రాణం విలువ తెలుసు కాబట్టే ఆరోగ్యశ్రీకి అత్యంత ప్రాధాన్యం

    నియంత్రణ మొత్తం కేంద్రం చేతుల్లోనే ఉంది

    వాస్తవాలను దాచి కొందరు విమర్శలు చేస్తున్నారు

  • 20 May 2021 02:52 PM (IST)

    కరోనాతో ప్రాణాలు కోల్పోయిన వారికి అసెంబ్లీలో సంతాపం..

    కరోనాతో ప్రాణాలు కోల్పోయిన వారికి అసెంబ్లీలో రెండు నిమిషాల పాటు మౌనం పాటించిన సీఎం వైఎస్ జగన్, సభ్యులు..

  • 20 May 2021 02:47 PM (IST)

    గాలిని కొనే రోజు వస్తుందని ఏనాడు ఊహించలేదు: సీఎం జగన్‌

    కోవిడ్‌ కేర్‌ సెంటర్లలో ఆక్సిజన్‌ కాన్‌సన్‌ట్రేటర్లు ఏర్పాటు చేస్తున్నాము. కరోనా మహమ్మారి నేపథ్యంలో ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నాము. కోవిడ్‌ కేర్‌ సెంటర్లలో 52,451 బెడ్స్‌ అందుబాటులో ఉన్నాయి గాలిని కొనే రోజు వస్తుందని ఏనాడు ఊహించలేదు.

  • 20 May 2021 02:44 PM (IST)

    రాష్ట్రంలో ఆస్పత్రుల రూపు రేఖలు మార్చాము- సీఎం జగన్‌

    నాడు-నేడు కార్యక్రమం ద్వారా రాష్ట్రంలోని ఆస్పత్రుల రూపు రేఖలు మార్చేశాము. త్వరలో టీచింగ్‌-నర్సింగ్‌ కాలేజీలను తీసుకొస్తాం. కోవిడ్‌ చికిత్స కోసం 47,285 బెడ్స్‌ అందుబాటులో ఉన్నాయి.

  • 20 May 2021 02:40 PM (IST)

    ఆరోగ్యశ్రీలోకి బ్లాక్‌ ఫంగర్‌ చికిత్స

    ప్రతి పార్లమెంట్‌ కేంద్రంలో మెడికల్‌ కాలేజీ. ప్రతి మండలానికి రెండు పీహెచ్‌సీల ఏర్పాటు. ఆరోగ్యశ్రీలోకి బ్లాక్‌ఫంగస్‌ చికిత్సను తీసుకువచ్చాము. కరోనా కోసం ఈనెలలో రూ.2,229 కోట్లు ఖర్చు చేశామని సీఎం అన్నారు.

  • 20 May 2021 02:36 PM (IST)

    రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో 150కిపై కోవిడ్‌ పరీక్ష ల్యాబ్‌లు

    కోవిడ్‌ పై సీఎం జగన్‌ మాట్లాడుతూ.. కోవిడ్‌-19 ప్రపంచానికి పెను సవాలుగా మారింది. కోవిడ్‌ పరీక్షలకు ప్రభుత్వ ఆధ్వర్యంలో 150కిపైగా ల్యాబ్‌లు ఉన్నాయి. గతంలో కోవిడ్‌ రిపోర్టులు పుణె నుంచి ఆలస్యంగా వచ్చేవి. వైద్య రంగం రూపురేఖలు మార్చేలా అడుగులు వేస్తున్నాము. కరోనా పరీక్షలు చేయడంలో రాష్ట్రం ముందంజలో ఉంది.

  • 20 May 2021 02:33 PM (IST)

    ఫోన్‌ చేసిన 20 నిమిషాల్లోనే అంబులెన్స్‌: సీఎం జగన్‌

    ఆరోగ్యశ్రీ కింద 2,400 రకాల వ్యాధులకు చికిత్స అందిస్తున్నాము. ప్రాణం విలువ తెలుసు కాబట్టే ఆరోగ్యశ్రీకి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాము. ఒకేసారి 1180 అంబులెన్స్‌లను ప్రారంభించాము. ఫోన్‌ చేసిన 20 నిమిషాల్లోనే అంబులెన్స్‌లు వస్తున్నాయి అని సీఎం జగన్‌ అన్నారు.

  • 20 May 2021 02:29 PM (IST)

    ఆరోగ్యశ్రీలో ఎన్నో మార్పులు తీసుకువచ్చాము- సీఎం జగన్‌

    ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఒక్క రోజు జరిగే ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాద్ 2021-22 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా జగన్‌ మాట్లాడుతూ.. ఆరోగ్య శ్రీలో చాలా మార్పులు తీసుకువచ్చామన్నారు. ఆరోగ్య శ్రీ ద్వారా పేదలందరికి వైద్యం అందేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.

  • 20 May 2021 02:23 PM (IST)

    వ్యవసాయ బడ్జెట్ హైలైట్స్…

    వైఎస్సార్‌ రైతు భరోసా- రూ. 7,400 కోట్లు

    వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా – రూ. 1802.82 కోట్లు

    వైఎస్సార్‌ సున్నా వడ్డీ పంట రుణాలు – రూ. 500 కోట్లు

    ఉపాధి హామీ పథకం కోసం రూ.8,116.16 కోట్లు

    వైఎస్‌ఆర్‌ జలకళ పథకం కోసం రూ.200 కోట్లు

    వ్యవసాయ పథకాల కోసం రూ.11,210.80 కోట్లు

    వ్యవసాయరంగంలో యాంత్రీకరణకు రూ.739.46 కోట్లు

    రాష్ట్రీయ కృషి వికాస యోజన(RKVY) రూ.583.44 కోట్లు

    ధరల స్థిరీకరణ ఫండ్‌ రూ.500 కోట్లు

  • 20 May 2021 02:23 PM (IST)

    వైఎస్సార్‌ రైతు భరోసా కేంద్రాలు…

    ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఏపీ ప్రభుత్వం 10,544 గ్రామీణ, 234 పట్టణ వైఎస్సార్‌ రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసింది. అలాగే వ్యవసాయ, ఉద్యానవన ఉత్పత్తులలో మార్కెట్‌ జోక్యం కోసం రూ. 3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. 2021-22 ఏడాదికి గానూ ధరల స్థిరీకరణ నిధి భర్తీ కోసమై రూ. 500 కోట్లు కేటాయించింది.

  • 20 May 2021 01:13 PM (IST)

    వ్యవసాయ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన మంత్రి కురసాల కన్నబాబు

    అసెంబ్లీలో వ్యవసాయ బడ్జెట్‌ను ఏపీ మంత్రి కురసాల కన్నబాబు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 1,778 రైతు భరోసా కేంద్రాలను అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు. నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు అందిస్తున్నామని పేర్కొన్నారు. నాణ్యమైన యంత్రాల కొనుగోలుకు 40 శాతం రాయితీ ఇస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. 2021-22 ఏడాదికి గానూ.. వివిధ పథకాల కోసం రూ.31,256.36 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు.

  • 20 May 2021 12:46 PM (IST)

    ఆంధ్రప్రదేశ్‌ బడ్జట్‌ – గత నాలుగు బడ్జెట్ల విశేషాలు…

    2017-18- 1,457.00(గృహనిర్మాణం) (కోట్లలో).

    2018-19- 3,679.53(గృహనిర్మాణం) (కోట్లలో).

    2019-20- 3,617.37(గృహనిర్మాణం) (కోట్లలో).

    2020-21- 6,190(గృహనిర్మాణం) (కోట్లలో).

  • 20 May 2021 12:46 PM (IST)

    ఆంధ్రప్రదేశ్‌ బడ్జట్‌ – గత నాలుగు బడ్జెట్ల విశేషాలు…

    2017-18- 4,274.75(విద్యుత్‌ రంగానికి) (కోట్లలో).

    2018-19- 4,193.30(విద్యుత్‌ రంగానికి) (కోట్లలో).

    2019-20- 6,861.03(విద్యుత్‌ రంగానికి) (కోట్లలో).

    2020-21- 6,984(విద్యుత్‌ రంగానికి) (కోట్లలో).

  • 20 May 2021 12:45 PM (IST)

    ఆంధ్రప్రదేశ్‌ బడ్జట్‌ – గత నాలుగు బడ్జెట్ల విశేషాలు

    2017-18- 2,615 (స్త్రీ,శిశు సంక్షేమానికి) (కోట్లలో)

    2018-19- 3,007.96 (స్త్రీ,శిశు సంక్షేమానికి) (కోట్లలో)

    2019-20- 2,689.36 (స్త్రీ,శిశు సంక్షేమానికి) (కోట్లలో)

    2020-21- 3,456.02 (స్త్రీ,శిశు సంక్షేమానికి) (కోట్లలో)

  • 20 May 2021 12:45 PM (IST)

    ఆంధ్రప్రదేశ్‌ బడ్జట్‌ – గత నాలుగు బడ్జెట్ల విశేషాలు

    2017-18- 840.25 (మైనార్టీ సంక్షేమానికి) (కోట్లలో)

    2018-19- 1,102 (మైనార్టీ సంక్షేమానికి) (కోట్లలో)

    2019-20- 952.47 (మైనార్టీ సంక్షేమానికి) (కోట్లలో)

    2020-21- 2,055.63 (మైనార్టీ సంక్షేమానికి) (కోట్లలో)

  • 20 May 2021 12:44 PM (IST)

    ఆంధ్రప్రదేశ్‌ బడ్జట్‌ – గత నాలుగు బడ్జెట్ల విశేషాలు

    2017-18- 6,213.00 (బీసీ సంక్షేమానికి) (కోట్లలో

    2018-19- 12,200 (బీసీ సంక్షేమానికి) (కోట్లలో)

    2019-20- 15,061.64 (బీసీ సంక్షేమానికి) (కోట్లలో)

    2020-21- 25,331.30 (బీసీ సంక్షేమానికి) (కోట్లలో)

  • 20 May 2021 12:43 PM (IST)

    ఆంధ్రప్రదేశ్‌ బడ్జట్‌ – గత నాలుగు బడ్జెట్ల విశేషాలు

    2017-18- 1,815 (ఎస్టీ సంక్షేమానికి) (కోట్లలో)

    2018-19- 2,129 (ఎస్టీ సంక్షేమానికి) (కోట్లలో)

    2019-20- 2,153 (ఎస్టీ సంక్షేమానికి) (కోట్లలో)

    2020-21- 2,847 (ఎస్టీ సంక్షేమానికి) (కోట్లలో)

  • 20 May 2021 12:43 PM (IST)

    ఆంధ్రప్రదేశ్‌ బడ్జట్‌ – గత నాలుగు బడ్జెట్ల విశేషాలు

    2017-18 – 9,847.13 (ఎస్సీ సంక్షేమానికి) (కోట్లలో)

    2018-19 – 11,228 (ఎస్సీ సంక్షేమానికి) (కోట్లలో)

    2019-20 – 15,000.85 (ఎస్సీ సంక్షేమానికి) (కోట్లలో)

    2020-21 – 15,735.68 (ఎస్సీ సంక్షేమానికి) (కోట్లలో)

  • 20 May 2021 12:12 PM (IST)

    ఆంధ్రప్రదేశ్‌ బడ్జట్‌ – గత నాలుగు బడ్జెట్ల విశేషాలు

    2017-18- 7,020(ఆరోగ్య రంగానికి కేటాయింపులు) (కోట్లలో)

    2018-19 -8,463 (ఆరోగ్య రంగానికి కేటాయింపులు) (కోట్లలో)

    2019-20 -11,399 (ఆరోగ్య రంగానికి కేటాయింపులు) (కోట్లలో)

    2020-21 – 11,419 (ఆరోగ్య రంగానికి కేటాయింపులు) (కోట్లలో)

  • 20 May 2021 12:11 PM (IST)

    ఆంధ్రప్రదేశ్‌ బడ్జట్‌ – గత నాలుగు బడ్జెట్ల విశేషాలు

    2017-18- 20,384(విద్యకు కేటాయింపులు) (కోట్లలో)

    2018-19- 24,185(విద్యకు కేటాయింపులు) (కోట్లలో)

    2019-20 – 32,772(విద్యకు కేటాయింపులు) (కోట్లలో)

    2020-21- 25,738(విద్యకు కేటాయింపులు) (కోట్లలో)

  • 20 May 2021 12:10 PM (IST)

    ఆంధ్రప్రదేశ్‌ బడ్జట్‌ – గత నాలుగు బడ్జెట్ల విశేషాలు

    2017-18- 8,877.16(సాగునీటిపారుదల రంగానికి) (కోట్లలో)

    2018-19 – 13,991.00(సాగునీటిపారుదల రంగానికి) (కోట్లలో)

    2019-20 – 13,139.04(సాగునీటిపారుదల రంగానికి) (కోట్లలో)

    2020-21- 11,805(సాగునీటిపారుదల రంగానికి) (కోట్లలో)

  • 20 May 2021 12:10 PM (IST)

    ఆంధ్రప్రదేశ్‌ బడ్జట్‌ – గత నాలుగు బడ్జెట్ల విశేషాలు

    2017-18 – 9,090.91(వ్వవసాయం-కేటాయింపులు) (కోట్లలో)

    2018-19- 19,070.36(వ్వవసాయం-కేటాయింపులు) (కోట్లలో)

    2019-20 – 28,866.23(వ్వవసాయం-కేటాయింపులు) (కోట్లలో)

    2020-21- 29159.97(వ్వవసాయం-కేటాయింపులు) (కోట్లలో)

  • 20 May 2021 12:09 PM (IST)

    ఆంధ్రప్రదేశ్‌ బడ్జట్‌ – గత నాలుగు బడ్జెట్ల విశేషాలు

    2017-18 – 2,23,705.95(రాష్ట్ర అప్పులు (కోట్లలో))

    2018-19 – 2,57,509.87(రాష్ట్ర అప్పులు (కోట్లలో))

    2019-20 – 3,02,202.70(రాష్ట్ర అప్పులు (కోట్లలో))

    2020-21 – 3,48,998.11(రాష్ట్ర అప్పులు (కోట్లలో))

  • 20 May 2021 12:01 PM (IST)

    ఆంధ్రప్రదేశ్‌ బడ్జట్‌ – గత నాలుగు బడ్జెట్ల విశేషాలు…

    2017-18 – 16,151.68(రెవెన్యూ లోటు)\

    2018-19  – 13,898.59(రెవెన్యూ లోటు)

    2019-20  – 26,646.92(రెవెన్యూ లోటు)

    2020-21 – 18,434.14(రెవెన్యూ లోటు)

  • 20 May 2021 12:00 PM (IST)

    ఆంధ్రప్రదేశ్‌ బడ్జట్‌ – గత నాలుగు బడ్జెట్ల విశేషాలు…

    2017-18 – 1,56,999.40( ప్రతిపాదిత బడ్జెట్‌),  1,05,062.09(రెవెన్యూ ఆదాయం), 1,21,213.77( రెవెన్యూ ఖర్చు)

    2018-19  – 1,91,063.61(ప్రతిపాదిత బడ్జెట్‌), 1,14,684.14((రెవెన్యూ ఆదాయం), 1,26,339.05(రెవెన్యూ ఖర్చు)

    2019-20 – 2,27,974.99(ప్రతిపాదిత బడ్జెట్‌), 1,78,697.41((రెవెన్యూ ఆదాయం), 1,80,475.94(రెవెన్యూ ఖర్చు)

    2020-21 – 2,24,789.18(ప్రతిపాదిత బడ్జెట్‌), 1,61,958.50((రెవెన్యూ ఆదాయం), 1,80,392.64(రెవెన్యూ ఖర్చు)

  • 20 May 2021 11:52 AM (IST)

    2021-22 వార్షిక బడ్జెట్‌ లైవ్ అప్డేట్స్…

    పురపాలక, పట్టణాభివృద్ధి శాఖకు రూ. 8,727 కోట్లు.

    గత ఏడాదితో పోలిస్తే 7.2శాతం అధికం.

    2021–22లో నీటిపారుదల శాఖకు రూ. 13,237.78 కోట్లు

    గత ఏడాదితో పోలిస్తే రూ. 12.13 శాతం ఎక్కువ

  • 20 May 2021 11:51 AM (IST)

    2021-22 వార్షిక బడ్జెట్‌ లైవ్ అప్డేట్స్…

    వైయస్సార్‌ బీమాకు రూ. 372.12 కోట్లు

    అర్చకులకు అన్సెంటివ్‌లకు రూ.120 కోట్లు

    ఇమామ్స్, మౌజంలకు ఇన్సెంటివ్‌లకు రూ.80 కోట్లు

    పాస్టర్లకు ఇన్సింటివ్‌లకు రూ. 40 కోట్లు

    ల్యాండ్‌ రీ సర్వేకోసం రూ. 206.97 కోట్లు

  • 20 May 2021 11:51 AM (IST)

    2021-22 వార్షిక బడ్జెట్‌ లైవ్ అప్డేట్స్…

    రోడ్లు భవనాల శాఖకు 2021–22 సంవత్సరంలో రూ. 7,594.6 కోట్లు

    ఎనర్జీ రంగానికి రూ. 6,637 కోట్లు

    వైయస్సార్‌ సంపూర్ణ పోషణకు రూ.1,556.39 కోట్లు

    వైయస్సార్‌ సంపూర్ణ పోషణ ప్లస్‌కు రూ. 243.61 కోట్లు

    దిశకు రూ. 33.75 కోట్లు

    అంగన్‌వాడీల్లో నాడు – నేడు కార్యక్రమాలకోసం రూ. 278 కోట్లు

  • 20 May 2021 11:50 AM (IST)

    హౌసింగ్‌ కోసం, మౌలిక సదుపాయాకోసం మొత్తంగా రూ. 5,661 కోట్లు

    పరిశ్రమలకు ఇన్సెంటివ్‌లకోసం రూ.1000 కోట్లు

    వైయస్సార్‌ ఎలక్ట్రానిక్‌ మాన్యుఫాక్చరింగ్‌ కోసం రూ. 200 కోట్లు

    కడప స్టీల్‌ప్లాంట్‌ కోసం రూ. 250 కోట్లు

    ఏపీఐఐసీకి రూ. 200 కోట్లు

    ఎంఎస్‌ఎంఈల్లో మౌలిక సదుపాయాల కల్పనకు రూ. 60.93 కోట్లు

    పారిశ్రామిక మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూ. 3,673.34 కోట్లు

  • 20 May 2021 11:48 AM (IST)

    2021-22 వార్షిక బడ్జెట్‌ లైవ్ అప్డేట్స్…

    ఆరోగ్య రంగానికి రూ.13,840.44 కోట్లు

    ఆరోగ్యశ్రీ, మందుల కొనుగోలుకు రూ.2,248.94 కోట్లు

    ఆస్పత్రుల్లో నాడు-నేడు కార్యక్రమానికి రూ.1535 కోట్లు

    కోవిడ్‌పై పోరాటానికి రూ.1000 కోట్లు

    ఏపీవీవీపీ ఆస్పత్రుల్లో శానిటేషన్‌కు రూ.100 కోట్లు

    శ్రీకాకుళం జిల్లా పలాస ఆస్పత్రికి రూ.50 కోట్లు

  • 20 May 2021 11:46 AM (IST)

    2021-22 వార్షిక బడ్జెట్‌ లైవ్ అప్డేట్స్…

    స్కూళ్లలో నాడు-నేడుకు రూ.3,500 కోట్లు

    జగనన్న గోరుముద్ద కోసం రూ.1200 కోట్లు

    జగనన్న విద్యాకానుకు కోసం రూ.750 కోట్లు

    ఉన్నత విద్య కోసం రూ.1973 కోట్లు

  • 20 May 2021 11:46 AM (IST)

    2021-22 వార్షిక బడ్జెట్‌ లైవ్ అప్డేట్స్…

    వైఎస్‌ఆర్‌ టెస్టింగ్‌ ల్యాబ్‌లకు రూ.85.57 కోట్లు

    వైఎస్‌ఆర్‌ ఉచిత పంటల బీమాకు రూ.1802.82 కోట్లు

    వ్యవసాయరంగంలో యాంత్రీకరణకు రూ.739.46 కోట్లు

    వైఎస్‌ఆర్‌ పశువుల నష్టపరిహారానికి రూ.50 కోట్లు

    విద్యా రంగానికి రూ.24,624.22 కోట్లు

  • 20 May 2021 11:45 AM (IST)

    2021-22 వార్షిక బడ్జెట్‌ లైవ్ అప్డేట్స్…

    వైఎస్‌ఆర్‌ ఆసరా కోసం రూ.6,337 కోట్లు

    అమ్మఒడి పథకం కోసం రూ.6,107 కోట్లు

    వైఎస్‌ఆర్‌ చేయూత కోసం రూ.4,455 కోట్లు

    రైతు పథకాల కోసం రూ.11,210.80 కోట్లు

  • 20 May 2021 11:42 AM (IST)

    2021-22 వార్షిక బడ్జెట్‌ లైవ్ అప్డేట్స్…

    అగ్రిగోల్డ్‌ బాధితులకు చెల్లింపుల కోసం రూ.200 కోట్లు

    రైతులకు ఎక్స్‌గ్రేషియా కోసం రూ.20 కోట్లు

    లా నేస్తం కోసం రూ.16.64 కోట్లు

    ఈబీసీ నేస్తం కోసం రూ.500 కోట్లు

  • 20 May 2021 11:41 AM (IST)

    2021-22 వార్షిక బడ్జెట్‌ లైవ్ అప్డేట్స్…

    రైతులకు సున్నా వడ్డీ చెల్లింపులకు రూ.500 కోట్లు

    వైఎస్‌ఆర్‌ కాపు నేస్తం కోసం రూ.500 కోట్లు

    వైఎస్‌ఆర్‌ జగనన్న చేదోడు పథకానికి రూ.300 కోట్లు

    వైఎస్‌ఆర్‌ వాహన మిత్ర కోసం రూ.285 కోట్లు

    వైఎస్‌ఆర్‌ నేతన్న నేస్తం కోసం రూ.190 కోట్లు

    వైఎస్‌ఆర్‌ మత్స్యకార భరోసా కోసం రూ.120 కోట్లు

    మత్స్యకారులకు డీజిల్‌ సబ్సిడీ కోసం రూ.50 కోట్లు

  • 20 May 2021 11:24 AM (IST)

    2021-22 వార్షిక బడ్జెట్‌ లైవ్ అప్డేట్స్…

    వైఎస్సార్ పెన్షన్ కానుక రూ. 17 వేల కోట్లు

    వైఎస్సార్ రైతు భరోసా రూ. 3,845 కోట్లు

    జగనన్న విద్యాదీవెనకు రూ. 2500 కోట్లు

    జగనన్న వసతి దీవెనకు రూ. 2,223 కోట్లు

    వైఎస్‌ఆర్‌-పీఎం ఫసల్‌ బీమా యోజనకు రూ.1802 కోట్లు

    డ్వాక్రా సంఘాల సున్నా వడ్డీ చెల్లింపులకు రూ.865 కోట్లు

    పట్టణ ప్రాంత డ్వాక్రా మహిళలకు రూ.247 కోట్లు

  • 20 May 2021 11:19 AM (IST)

    2021-22 వార్షిక బడ్జెట్‌ లైవ్ అప్డేట్స్…

    బీసీ కులాలకు రూ. 28,237 కోట్లు

    ఈబీసీ సంక్షేమానికి రూ. 5,478 కోట్లు

    కాపు సంక్షేమం కోసం రూ. 3,306 కోట్లు

    బ్రాహ్మణుల సంక్షేమానికి రూ. 359 కోట్లు

    ఎస్సీ సబ్ ప్లాన్ కోసం రూ. 17,403 కోట్లు

    ఎస్టీ సబ్ ప్లాన్ కోసం రూ. 6,131 కోట్లు

    మైనారిటీ యాక్షన్ ప్లాన్ కింద రూ. 3840 కోట్లు

    మైనార్టీ సబ్ ప్లాన్ కోసం రూ. 1756 కోట్లు

    మహిళా సంక్షేమానికి రూ. 47,283 కోట్లు

    వ్యవసాయానికి రూ. 11,210 కోట్లు

    విద్యారంగానికి రూ. 24,624 కోట్లు

    వైద్యం, ఆరోగ్యానికి రూ. 13,830 కోట్లు

    చిన్నారుల కోసం రూ.16,748 కోట్లు

  • 20 May 2021 11:11 AM (IST)

    ఏపీ బడ్జెట్‌ను ప్రవేశపెడుతోన్న మంత్రి బుగ్గన..

    2021-22 వార్షిక బడ్జెట్‌ని ప్రవేశపెడుతున్న ఆర్ధిక మంత్రి

    వరుసగా మూడోసారి బడ్జెట్ ప్రవేశపెడుతోన్న బుగ్గన

    ఈ ఏడాది వార్షిక బడ్జెట్ అంచనా రూ. 2,29,779.27 కోట్లు

    గత బడ్జెట్ అంచనా రూ. 2,24,789.18 కోట్లు

    వెనుకబడిన కులాలకు బడ్జెట్ లో 32 శాతం అధిక కేటాయింపులు

  • 20 May 2021 10:58 AM (IST)

    కాసేపట్లో ప్రభుత్వం 2021-22 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది.

    బీఏసీ సమావేశం అనంతరం తిరిగి అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశం ప్రారంభమైంది. సభలో పలువురికి సంతాప తీర్మానాలు చేశారు. పలువురు మాజీ ఎమ్మెల్యేల మృతిపట్ల అసెంబ్లీ సంతాపం తెలిపింది. కాసేపట్లో ప్రభుత్వం 2021-22 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. అసెంబ్లీలో బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌, వ్యవసాయ బడ్జెట్‌ను మంత్రి కన్నబాబు ప్రవేశపెట్టనున్నారు.

  • 20 May 2021 10:57 AM (IST)

    ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశం..

    ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశం తిరిగి ప్రారంభమైంది. కాసేపట్లో ఆర్ధిక బడ్జెట్‌ను మంత్రి బుగ్గన ప్రవేశపెట్టనున్నారు

  • 20 May 2021 10:51 AM (IST)

    ప్రభుత్వ పధకాలపై గవర్నర్ ప్రసంగం..

    ఇక ప్ర‌భుత్వ సంక్షేమ ప‌థ‌కాల గురించి చెబుతూ.. జ‌గ‌నన్న విద్యా కానుక కోసం రూ. 4879.30 కోట్లు, జగనన్న వసతి దీవెనకు రూ.1049 కోట్లు కేటాయించామన్నారు. నాడు నేడు కార్య‌క్ర‌మంలో ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల రూపుమార్చుతున్నామ‌న్నారు.

    స్కూళ్ల ఆధునికీకరణకు రూ.3,948 కోట్లు, విద్యాశాఖకు అన్ని పథకాల కింద రూ.25,714 కోట్లు, జగనన్న అమ్మఒడి కింద రూ.13,022 కోట్లు, జగనన్న గోరుముద్ద కింద 36.88 లక్షల మందికి రూ.1600 కోట్లు ఇచ్చామన్నారు. ఇరిగేషన్‌ కింద 14 ప్రాజెక్టులు పూర్తి చేశాం.

    వైఎస్సార్‌ రైతు భరోసా, పీఎం కిసాన్‌ కింద 2019-20 ఏడాదికి 52.38 లక్షలమంది రైతులకు 17030 కోట్లు కేటాయించామన్నారు. అటు వైఎస్సార్‌ నేతన్న నేస్తం కోసం 390.74 కోట్లు కేటాయించి నేతన్నలకు 81,783 మంది లబ్ధి చేకుర్చామని గవర్నర్‌ తెలిపారు.

  • 20 May 2021 10:48 AM (IST)

    ముగిసిన ఏపీ బీఏసీ సమావేశం..

    స్పీకర్ తమ్మినేని సీతారామ్ అధ్యక్షతన నిర్వహించిన ఏపీ బీఏసీ సమావేశం ముగిసింది. అసెంబ్లీ సమావేశాలను ఒక్క రోజు మాత్రమే నిర్వహించాలని నిర్ణయించారు. అసెంబ్లీలో మంత్రి బుగ్గన ఆర్ధిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన తర్వాత సీఎం జగన్ ప్రసంగించనున్నారు.

  • 20 May 2021 10:43 AM (IST)

    కరోనాపై పోరాటంలో.. దేశానికే ఏపీ ఆదర్శంగా నిలిచింది: గవర్నర్

    ఉభయ సభలను ఉద్దేశించి వర్చువల్ విధానంలో గవర్నర్ బిశ్వభుషణ్ హరిచందన్ ప్రసంగం ముగిసింది. కరోనాపై పోరాటంలో ఏపీ.. దేశానికే ఆదర్శంగా నిలిచిందని ఆయన అన్నారు. దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోందని.. సెకండ్ వేవ్ లో మరణాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. సెకండ్ వేవ్ ప్రభావం ఏపీలోనూ ఉందన్న గవర్నర్.. కరోనాపై పోరాడుతున్న ఫ్రంట్ లైన్ వర్కర్లకు సెల్యూట్ చేశారు. క‌రోనా బాధితుల‌కు ఆక్సిజ‌న్ కొర‌త లేకుండా ఇత‌ర దేశాల నుంచి క్ర‌యోజనిక్ ఆక్సిజ‌న్ తెప్పించామ‌న్నారు. కోవిడ్ కార‌ణంగా ఆదాయం త‌గ్గినా త‌మ ప్ర‌భుత్వం సంక్షేమ‌ ప‌థ‌కాల‌ను కొన‌సాగిస్తుంద‌ని చెప్పుకొచ్చారు. కోవిడ్ చికిత్స కోసం ప్ర‌తీ ప్రైవేటు ఆసుప‌త్రిలో ఆరోగ్య‌శ్రీ ప‌రిధిలోకి తీసుకొచ్చామ‌న్నారు.

  • 20 May 2021 10:18 AM (IST)

    ప్రారంభమైన ఏపీ బీఏసీ సమావేశం..

    స్పీకర్ తమ్మినేని సీతారామ్ అధ్యక్షతన బీఏసీ సమావేశం ప్రారంభమైంది. బీఏసీ సమావేశానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరయ్యారు. సాధారణంగా ప్రతిపక్షం కూడా బీఏసీ సమావేశానికి హాజరు కావాల్సి ఉండగా.. టీడీపీ ఈసారి అసెంబ్లీ సమావేశాలను బాయ్‌కాట్ చేయడం వల్ల కేవలం అధికార పార్టీకి సంబంధించిన సభ్యులు మాత్రమే బీఏసీ సమావేశానికి హాజరయ్యారు.

  • 20 May 2021 10:12 AM (IST)

    కాసేపట్లో ఏపీ బడ్జెట్ ప్రవేశపెట్టనున్న బుగ్గన..

    ఉదయం 11 గంటలకు మంత్రి బుగ్గన అసెంబ్లీలో ఆర్ధిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. వ్యవసాయ బడ్జెట్‌ను మంత్రి కన్నబాబు ప్రవేశపెడతారు. శాసన మండలిలో బడ్జెట్‌ను హోంమంత్రి సుచరిత ప్రవేశపెట్టనున్నారు. అలాగే వ్యవసాయ బడ్జెట్‌ను ధర్మాన కృష్ణదాస్‌ ప్రవేశపెట్టనున్నారు.

  • 20 May 2021 10:09 AM (IST)

    కరోనాపై పోరులో దేశానికే.. ఏపీ ఆదర్శం: గవర్నర్

    ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ బిశ్వభుషణ్ హరిచందన్ వర్చువల్ విధానంలో ప్రసంగించారు. కరోనాపై పోరాటంలో దేశానికే ఏపీ ఆదర్శంగా నిలిచిందన్నారు గవర్నర్.

  • 20 May 2021 09:49 AM (IST)

    పూర్తి క‌రోనా నిబంధ‌న‌ల న‌డుమ ముగిసిన క్యాబినేట్ భేటీ..

    అసెంబ్లీ స‌మావేశాల‌కు ముందు ఏపీ క్యాబినేట్ సమావేశ‌మై బ‌డ్జెట్‌కు ఆమోదం తెలిపిన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో క‌రోనా వైర‌స్ ప్ర‌మాదం పొంచి ఉన్న నేపథ్యంలో మంత్రులు పూర్తిగా క‌రోనా నిబంధ‌న‌ల‌ను పాటిస్తూ స‌మావేశానికి హాజ‌ర‌య్యారు. మాస్కులు ధ‌రించి.. సోష‌ల్ పాటిస్తూ స‌మావేశాల్లో పాల్గొన్నారు.

    Ap Cabinate 1

    Ap Cabinate 1

    Ap Cabinate

    Ap Cabinate

  • 20 May 2021 09:20 AM (IST)

    కొన‌సాగుతోన్న గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగం..

    గ‌వ‌ర్న‌ర్ భిశ్వ‌భూష‌ణ్ హ‌రించంద‌న్ ప్ర‌సంగం కొన‌సాగుతోంది. ఈ క్ర‌మంలో ఏపీ ప్ర‌భుత్వం క‌రోనా క‌ట్ట‌డికి తీసుకుంటున్న చ‌ర్య‌లు గురించి గ‌వ‌ర్న‌ర్ మాట్లాడుతూ.. క‌రోనా బాధితుల‌కు ఆక్సిజ‌న్ కొర‌త లేకుండా ఇత‌ర దేశాల నుంచి క్ర‌యోజనిక్ ఆక్సిజ‌న్ తెప్పించామ‌న్నారు. కోవిడ్ కార‌ణంగా ఆదాయం త‌గ్గినా త‌మ ప్ర‌భుత్వం సంక్షేమ‌ ప‌థ‌కాల‌ను కొన‌సాగిస్తుంద‌ని చెప్పుకొచ్చారు. కోవిడ్ చికిత్స కోసం ప్ర‌తీ ప్రైవేటు ఆసుప‌త్రిలో ఆరోగ్య‌శ్రీ ప‌రిధిలోకి తీసుకొచ్చామ‌న్నారు. ఇక ప్ర‌భుత్వ సంక్షేమ ప‌థ‌కాల గురించి చెపుతూ.. జ‌గ‌నన్న విద్యా కానుక కింద 47 ల‌క్ష‌ల మందికి విద్యాకానుక అంద‌జేసిన‌ట్లు తెలిపారు. నాడు నేడు కార్య‌క్ర‌మంలో ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల రూపుమార్చుతున్నామ‌న్నారు.

  • 20 May 2021 09:10 AM (IST)

    మొద‌లైన ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. ఉభ‌య స‌భ‌ల‌ను ఉద్దేశిస్తూ మాట్లాడుతోన్న గ‌వ‌ర్న‌ర్‌..

    ఏపీ బ‌డ్జెట్ స‌మావేశాలు ప్రారంభ‌మ‌య్యాయి. క‌రోనా నేప‌థ్యంలో గ‌వ‌ర్న‌ర్ భిశ్వ‌భూష‌న్ హ‌రిచంద‌న్ వ‌ర్చువ‌ల్ విధానంలో ఉభ‌య స‌భ‌ల‌ను ఉద్దేశిస్తూ మాట్లాడుతున్నారు. ఈన ఏప‌థ్యంగా గ‌వ‌ర్న‌ర్ మాట్లాడుతూ.. కోవిడ్‌పై పోరాడున్న ఫ్రంట్ లైన్ వారియ‌ర్ల‌కు సెల్యూట్ తెలిపారు. దేశవ్యాప్తంగా ఫిబ్ర‌వ‌రి నుంచి కోవిడ్ సెకండ్ వేవ్ ఉధృతంగా ఉంద‌న్న గ‌వ‌ర్న‌ర్‌, క‌రోనా నియంత్ర‌ణలో ఏపీ దేశానికే ఆద‌ర్శంగా నిలించిద‌ని చెప్పుకొచ్చారు.

  • 20 May 2021 09:01 AM (IST)

    బ‌డ్జెట్ స‌మావేశాల్లో ప్ర‌వేశ‌పెట్ట‌నున్న ఏడు బిల్లులు..

    కరోనా విప‌త్క‌ర ప‌రిస్థితుల నేపథ్యంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం బ‌డ్జెట్ స‌మావేశాల‌ను ఒక‌రోజుకే ప‌రిమితం చేసిన విష‌యం తెలిసిందే. దీంతో ఈ రోజే కీల‌క‌మైన ఏడు బిల్లుల‌ను ప్ర‌వేశ‌పెట్ట‌నుంది. పుర‌పాల‌క బిల్లుతో పాటు మ‌రికొన్ని ముఖ్య‌మైన వాటిని ఈరోజు అసెంబ్లీలో ప్ర‌వేశ‌పెట్ట‌నున్నారు. అసెంబ్లీ స‌మావేశాలు సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు కొన‌సాగ‌నున్న‌ట్లు తెలుస్తోంది.

  • 20 May 2021 08:31 AM (IST)

    సీఎం జ‌గ‌న్ అధ్య‌క్ష‌త‌న మొదలైన ఏపీ క్యాబినేట్ స‌మావేశం.. మరికాసేప‌ట్లో..

    ఏపీ బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ పెట్ట‌నున్న నేప‌థ్యంలో ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అధ్య‌క్ష‌త‌న ఏపీ క్యాబినేట్ స‌మావేశం ప్రారంభ‌మైంది. ఈ నేప‌థ్యంలో ఏపీ క్యాబినేట్ బ‌డ్జెట్ 2021-2022కు ఆమోదం తెల‌ప‌నుంది.

  • 20 May 2021 06:55 AM (IST)

    వ్య‌వ‌సాయానికి పెద్ద పీట వేయ‌నున్న ఏపీ ప్ర‌భుత్వం..

    ఏపీ ప్ర‌భుత్వం వ్య‌వ‌సాయ రంగానికి పెద్ద పీట వేయ‌నున్న‌ట్లు స‌మాచారం. ఇందులో భాగంగానే.. వ్యవసాయ అనుంబంధ రంగాలన్నింటికీ కలిపి ఈ బడ్జెట్‌లో 29 వేల కోట్ల రూపాయల నుంచి 30 వేల కోట్ల రూపాయల కేటయింపులు ఉండ‌వ‌చ్చ‌ని స‌మాచారం.

  • 20 May 2021 06:52 AM (IST)

    పెన్ష‌న్ రూ. 250 పెంపు.. ఇందులో భాగంగా..

    జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఎన్నిక‌లో హామీలో ఇచ్చిన‌ట్లు పెన్ష‌న్‌ను క్ర‌మంగా రూ. 3000కు పెంచుకుంటూ పోతామ‌న్న దాంట్లో భాగంగానే వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి నుంచి పెన్ష‌న్‌ను మ‌రో రూ. 250 పెంచ‌నున్నారు. వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక కింద సామాజిక పెన్షన్‌ను వచ్చే జనవరి నుంచి రూ.2,250 నుంచి రూ.2,500కు పెంచనున్నారు. ఇందులో భాగంగానే 2021-2022 బడ్జెట్‌లో రూ.18,000 కోట్లు కేటాయింపులు చేయనున్నారు.

  • 20 May 2021 06:44 AM (IST)

    ఆ రాష్ట్రాల బాట‌లో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌..

    ఏపీ ప్ర‌భుత్వం తొలిసారి జెండర్‌ బేస్డ్‌ బడ్జెట్‌ను ప్రవేశపెడుతోంది. ఇందులో భాగంగా మహిళలకు, పిల్లలకు ప్రత్యేక ప్రాధాన్య‌త ఇవ్వ‌నుంది. ఇప్పటికే రాజస్థాన్‌, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, కర్నాటక, ఒడిశా, కేరళ, అసోం, బీహార్‌, ఛత్తీస్‌గడ్‌, త్రిపుర, నాగలాండ్‌, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాలు జెండర్‌ బేస్డ్‌ బడ్జెట్‌‌ను ప్రవేశపెట్టాయి. ఇప్పుడు అదే బాటలో ఏపీ నడుస్తోంది.

  • 20 May 2021 06:43 AM (IST)

    వీటిపై 20 శాతం కోత పెట్ట‌నున్నారు..

    క‌రోనా నేప‌థ్యంలో రాష్ట్ర ఆదాయం త‌గ్గ‌డంతో.. ప్రణాళికేతర వ్యయం, కార్యాలయాల నిర్వహణ, వాహనాల ఖర్చులపై కోత పడనుంది. వీటికి సంబంధించి 2020-21 బడ్జెట్‌లో దాదాపు అన్నింటిలోనూ 20శాతం వరకు కోత పెట్టారు. కార్యాలయాల అద్దె చెల్లింపులు భారమయ్యాయి. కొత్తగా వాహనాలు కొనవద్దని నిర్దేశించారు. కన్సల్టెంట్లు, పొరుగుసేవల సిబ్బంది నియామకంపై నియంత్రణ పెట్టారు. రేపటి బడ్జెట్‌లోనూ వీటన్నింటిపైనా ప్రభావం ఉంటుందని తెలుస్తోంది.

  • 20 May 2021 06:40 AM (IST)

    ఉద‌యం 9 గంట‌ల‌కు మొద‌లు కానున్న స‌మావేశాలు..

    ఏపీ అసెంబ్లీ స‌మావేశాలు ఉద‌యం 9 గంట‌ల‌కు ప్రారంభం కానున్నాయి. క‌రోనా నేప‌థ్యంలో ఉభ‌య స‌భ‌ల‌ను ఉద్దేశించి గ‌వ‌ర్నర్ బిశ్వభూష‌న్ హ‌రిచందన్ వ‌ర్చ్యూవ‌ల్ ప‌ద్దతిలో ప్ర‌సంగించ‌నున్నారు. ఈ ప్రసంగం తర్వాత 2021-22 ఆర్ధిక బ‌డ్జెట్‌ను ప్రవేశపెడతారు. ఇప్పటికే 3 నెల‌ల కాలానికి 70వేల 983.11 కోట్ల అంచనాతో ఓటాన్ అకౌంట్‌ను అర్డినెన్స్ రూపంలో ఆమోదించారు. మిగిలిన 9 నెల‌ల కాలానికి పూర్తి స్థాయి ఆర్ధిక బడ్జెట్‌ ఇది. క‌రోనా కార‌ణంగా ఒక్కరోజే అసెంబ్లీ స‌మావేశాలు నిర్వహించాల‌ని సర్కార్ నిర్ణయించిన విష‌యం తెలిసిందే.

Published On - May 20,2021 3:39 PM

Follow us
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?