అమెరికా ఎన్నికలు.. బాబా వంగా చెప్పిందే నిజమవుతుందా..? వెలుగులోకి విస్తుపోయే విషయాలు..
అమెరికా ఎన్నికల్లో చోటుచేసుకున్న అనూహ్య రాజకీయ పరిణామాలు ఇప్పుడు ప్రాచీన భవిష్యవాణులను తెరపైకి తెచ్చాయి. డొనాల్డ్ ట్రంప్‌ను సైతం విస్మయానికి గురిచేసిన ఈ ఫలితాల వెనుక.. బల్గేరియా ప్రవక్త బాబా వంగా, ప్రఖ్యాత జ్యోతిష్యుడు నోస్ట్రాడమస్ చెప్పిన రహస్య జోస్యాలు ఉన్నాయా? 2043 నాటికి ప్రపంచ రాజకీయాల్లో రానున్న పెను మార్పులు, మధ్యప్రాచ్యం కేంద్రంగా ముంచుకొస్తున్న యుద్ధ మేఘాలు, అమెరికా భవితవ్యంపై వాళ్లు ఏం చెప్పారో తెలుసుకుందాం..

అమెరికా మధ్యంతర ఎన్నికల ఫలితాలు ఆ దేశ రాజకీయ ముఖచిత్రాన్ని తీవ్రంగా మార్చేశాయి. ఈ పరిణామాలు మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను దిగ్భ్రాంతికి గురిచేయగా, రాజకీయ పండితులు వీటిపై భిన్నమైన విశ్లేషణలు కొనసాగిస్తున్నారు. అయితే, తాజా రాజకీయ పరిణామాలతో దశాబ్దాల క్రితం ప్రముఖ ప్రవక్తలు చెప్పిన జోస్యాలు మరోసారి తెరపైకి వచ్చి ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. గతంలో అనేక వాస్తవాలను ముందే ఊహించి చెప్పిన బల్గేరియాకు చెందిన ప్రఖ్యాత ప్రవక్త బాబా వంగా.. 2042–2043 నాటికి యూరప్‌తో పాటు అమెరికాలోనూ ముస్లింల ఆధిపత్యం పెరుగుతుందని గతంలో పేర్కొన్నారు. 2043 నాటికి ఐరోపాలోని దాదాపు 44 దేశాల్లో ఇస్లామిక్ పాలన విస్తరిస్తుందని, క్రమంగా ఇది అమెరికా వంటి అగ్రరాజ్యాలకు, ఆపై ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తుందని ఆమె జోస్యాలలో ప్రస్తావించారు.
36 మంది ముస్లింల గెలుపు
ఈ జోస్యాలను కొందరు తాజా అమెరికా మధ్యంతర ఎన్నికలతో ముడిపెడుతున్నారు. ఈ ఎన్నికలలో ఏకంగా 36 మంది ముస్లిం ప్రతినిధులు విజయం సాధించగా, చరిత్రలోనే తొలిసారిగా ఒక ముస్లిం నేత సెనేట్‌కు ఎన్నికయ్యారు. విప్లవాత్మక భావాలు కలిగి, భారతదేశంతోనూ ప్రత్యేక అనుబంధం ఉన్న అబ్దుల్ అల్ సయ్యద్ ఈ ఎన్నికల్లో గెలుపొందడం ఈ పరిణామాలకు బలం చేకూరుస్తోందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
అమెరికా నోస్ట్రాడమస్ జాన్ హాగ్ హెచ్చరికలు
బాబా వంగా పాటు అమెరికా నోస్ట్రాడమస్‌గా గుర్తింపు పొందిన జాన్ హాగ్ జోస్యం కూడా ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. ఆయన విశ్లేషణ ప్రకారం.. పశ్చిమ ఆసియా, మధ్యప్రాచ్యం కేంద్రంగా సుమారు 27 ఏళ్ల పాటు సాగే సుదీర్ఘ యుద్ధం తలెత్తే అవకాశం ఉంది. ఈ పోరులో అమెరికా, ఐరోపా దేశాలు చిక్కుకోవడంతో అమెరికా ప్రపంచ ఆధిపత్యం క్రమంగా క్షీణిస్తుంది. ఈ భారీ ఘర్షణకు 2027–2028 సంవత్సరాల్లోనే పునాది పడుతుందని ఆయన అంచనా వేశారు.
నోస్ట్రాడమస్ లెస్ ప్రొఫెట్స్ ఏం చెబుతోంది?
ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యుడు నోస్ట్రాడమస్ తన రచన లెస్ ప్రొఫెట్స్‌లో సుదూర భవిష్యత్తుపై చేసిన వ్యాఖ్యలు కూడా చర్చనీయాంశంగా మారాయి. ఆయన జోస్యం ప్రకారం.. 2242 – 2243 మధ్య కాలంలో ప్రపంచం పెను ఘర్షణను ఎదుర్కోనుంది. ఈ పోరులో ఇస్లాం, క్రైస్తవ మతాల మధ్య తీవ్ర ఘర్షణ ఏర్పడవచ్చని, ఆధునిక ఆయుధాలతో జరిగే దాడుల వల్ల అమెరికాలోని ప్రముఖ నగరాలు తీవ్రంగా దెబ్బతింటాయని ఆయన తెలిపారు.
బాబా వంగా చెప్పిన ఇతర ప్రధాన అంచనాలు
రాజకీయ మార్పులే కాకుండా, పర్యావరణం మరియు సాంకేతికతపై కూడా బాబా వెంగా కీలక విషయాలను వెల్లడించారు. 2028లో మానవుడు శుక్ర గ్రహం వైపు అంతరిక్ష ప్రయాణాన్ని ప్రారంభించి విజయం సాధిస్తాడు. 2033లో వాతావరణ మార్పులు, ధ్రువాల వద్ద మంచు కరగడం వల్ల సముద్ర మట్టాలు తీవ్రంగా పెరిగి, తీరప్రాంత నగరాలు ముంపునకు గురవుతాయి.
అమెరికా అంతర్గత రాజకీయాల్లో చోటుచేసుకుంటున్న నాయకత్వ మార్పులు, మధ్యప్రాచ్యంలో మారుతున్న భౌగోళిక రాజకీయ పరిస్థితులు ఈ ప్రాచీన జోస్యాలతో సరిపోలుతున్నాయా లేదా ఇవి కేవలం కాకతాళీయాలా అన్న అంశంపై అంతర్జాతీయ వేదికలపై విశ్లేషణలు ముమ్మరమయ్యాయి.
