AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sandwich: మోడల్ కొంపముంచిన ‘శాండ్‌విచ్’.. రూ. 1.43 లక్షల ఫైన్.. జరిగిందేంటో తెలిస్తే షాక్..!

Sandwich: ఆస్ట్రేలియన్ మోడల్‌కు శాండ్‌విచ్ పెద్ద నష్టమే తెచ్చిపెట్టింది. తనవెంట శాండ్‌విడ్ తెచ్చుకోవడం వలన రూ. 1.43 లక్షల ఫైన్ చెల్లించాల్సి వచ్చింది.

Sandwich: మోడల్ కొంపముంచిన ‘శాండ్‌విచ్’.. రూ. 1.43 లక్షల ఫైన్.. జరిగిందేంటో తెలిస్తే షాక్..!
Subway Sandwich
Shiva Prajapati
|

Updated on: Jul 24, 2022 | 6:27 AM

Share

Sandwich: ఆస్ట్రేలియన్ మోడల్‌కు శాండ్‌విచ్ పెద్ద నష్టమే తెచ్చిపెట్టింది. తనవెంట శాండ్‌విడ్ తెచ్చుకోవడం వలన రూ. 1.43 లక్షల ఫైన్ చెల్లించాల్సి వచ్చింది. ఇంతకీ ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.. ప్రయాణాల సమయంలో సహజంగా ఆకలి వేస్తుంటుంది. దూర ప్రయాణం అయితే చెప్పనక్కర్లేదు. విమాన ప్రయాణాలు చేసే వారి కోసం విమానాశ్రయాల్లో అనేక ఆహారాలు అందుబాటులో ఉంటాయి. ఆకలేసిన వారు తింటారు. లేదంటూ ఊరుకుంటారు. ఒక మోడల్‌కు ఆకలేసి శాండ్‌విచ్ తీసుకుంటే.. అదికాస్తా రూ. 1.43 లక్షల జరిమానాకు కారణమైంది.

ఆస్ట్రేలియాకు చెందిన మోడల్ జెస్సికా లీ.. యూరప్ నుంచి ఆస్ట్రేలియాకు విమానంలో వస్తోంది. 11 గంటల సుధీర్ఘమైన ప్రయాణం. దాంతోపాటు ఆమెకు విపరీతంగా ఆకేస్తుంది. విమానం సింగపూర్‌లో ఛేంజ్ అవ్వాల్సి ఉండగా.. అక్కడ దిగి సబ్‌వే శాండ్‌విచ్ కొనుక్కుంది. అది దాపు ఒక ఫీట్ పొడవుతో ఉంటుంది. హాఫ్ ఫీట్ శాండ్‌విచ్‌ను తినేసిన లీ.. మిగతా సగాన్ని విమానంలో తినొచ్చని భావించింది. బ్యాగ్‌లో పెట్టుకుని విమానం ఎక్కేసింది. విమానంలోనూ ఆ శాండ్‌విచ్‌ను తినలేదు. అలాగే ఆస్ట్రేలియా ఏయిర్‌పోర్టుకు వచ్చింది. అప్పుడు అనుకోని ట్విస్ట్ ఎదురైంది. సాధారణంగా విమానంలో ప్రయాణించే ప్యాసింజర్స్ తమ వెంట ఉండే ప్రతీ వస్తువుకు సంబంధించి ఇన్ఫర్మేషన్ చెప్పాల్సి ఉంటుంది. కానీ లీ మాత్రం తన శాండ్ విచ్ గురించి పేర్కొనలేదు. పైగా ఇది అదనంగా కనిపించడంతో కస్టమ్స్ అధికారులు అడ్డగించారు. సమాచారం తెలుపకుండా శాండ్‌విచ్ పట్టుకొచ్చినందుకు గానూ లీ రూ. 1.43 లక్షల జరిమానా విధించారు.

ఇదే విషయాన్ని చెబుతూ జెస్సికా లీ.. సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసింది. ఎవరూ తనలా చేయొద్దని సూచించింది. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..