Pakistan Political Crisis: షెహబాజ్ షరీఫ్ ముందు ఎన్నో సవాళ్లు.. కలవరపెడుతున్న దేశ ఆర్థిక పరిస్థితి..

| Edited By: Shaik Madar Saheb

Apr 11, 2022 | 8:01 PM

పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు, ఆ దేశ మాజీ ప్రధాన మంత్రి నవాజ్‌ షరీఫ్ తమ్ముడు షెహబాజ్ షరీఫ్ కాబోయే ప్రధాన మంత్రి అని వార్తలు వస్తున్నాయి...

Pakistan Political Crisis: షెహబాజ్ షరీఫ్ ముందు ఎన్నో సవాళ్లు.. కలవరపెడుతున్న దేశ ఆర్థిక పరిస్థితి..
Shehbaz
Follow us on

పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు, ఆ దేశ మాజీ ప్రధాన మంత్రి నవాజ్‌ షరీఫ్ తమ్ముడు షెహబాజ్ షరీఫ్ కాబోయే ప్రధాన మంత్రి అని వార్తలు వస్తున్నాయి. ఇతను ప్రస్తుతం నవాజ్‌ షరీఫ్ స్థాపించిన పాకిస్తాన్ ముస్లిం లీగ్ (N) అధ్యక్షుడిగా ఉన్నాడు. 2018లో పాకిస్తాన్ సుప్రీం కోర్టు షెహబాజ్‌ షరీఫ్‌పై అనర్హత వేటు వేసింది. ఆదివారం ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను తొలగింపు తర్వాత పాకిస్తాన్ తదుపరి ప్రధాని షెహబాజ్‌ అని ప్రచారం జరుగుతుంది. షెహబాజ్ ముగ్గురు తోబుట్టువులలో రెండోవాడు. ఇతను1988లో పంజాబ్ ప్రావిన్షియల్ అసెంబ్లీకి జరిగిన సాధారణ ఎన్నికలలో ఇస్లామీ జంహూరి ఇత్తెహాద్ అభ్యర్థిగా గెలుపొంది రాజకీయ జీవితాన్ని ప్రారంభించాడు. ఆ తర్వాత 1990లో జాతీయ అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. అప్పటి నుంచి షెహబాజ్ రాజకీయ రాణిస్తున్నాడు. షెహబాజ్ పంజాబ్‌ను మూడుసార్లు పాలించాడు. వనరులు అధికంగా ఉన్న ప్రావిన్స్‌లో ఎక్కువ కాలం పనిచేసిన సీఎంగా నిలిచాడు. పాకిస్తాన్‌లోని చాలా స్టీల్‌ కంపెనీలైన ఇత్తెఫాక్ గ్రూప్‌కు ఛైర్మన్‌గా ఉన్నాడు. దక్షిణ కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్, పుల్వామా జిల్లాలకు చెందిన షరీఫ్ కుటుంబం పాకిస్తాన్‌కు వలస వెళ్లాయి. పర్వేజ్ ముషారఫ్ సైనిక తిరుగుబాటు తర్వాత పాక్‌ ప్రధానికి నవాజ్‌ షరీఫ్ ఎన్నికయ్యారు. నవాజ్ షరీఫ్ ప్రభుత్వాన్ని పడగొట్టడంతో అతని కుటుంబాన్ని బహిష్కరించారు. దీంతో వారు సౌదీ అరేబియాకు వెళ్లిపోయారు.

షెహబాజ్ కుటుంబం 2007లో పాకిస్తాన్‌కు తిరిగి వచ్చారు. నవాజ్ 2013 సాధారణ ఎన్నికల్లో తన పార్టీని విజయపథంలో నడిపించారు. అదే సంవత్సరం షెహబాజ్ మూడోసారి పంజాబ్ ప్రావిన్స్ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. పనామా పత్రాల్లో అవినీతి ఆరోపణలు రావడంతో 2017లో సుప్రీంకోర్టు నవాజ్‌ను పదవి నుంచి తొలగించింది. దీంతో నవాజ్‌ షరీఫ్ పార్టీ పగ్గాలను షెహబాజ్ షరీఫ్ అప్పగించారు. ఆ మరుసటి సంవత్సరంలో షెహబాజ్ పంజాబ్ ప్రావిన్స్ ముఖ్యమంత్రి పదవిని కోల్పోయాడు.ఆ తర్వాత నవాజ్ అతని కుమార్తెకు పదేళ్ల జైలు శిక్ష విధించారు. 2018 సార్వత్రిక ఎన్నికలలో మాజీ క్రికెటర్-రాజకీయవేత్త ఇమ్రాన్ ఖాన్ పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ ద్వారా పార్టీని అధికారంలోకి వచ్చారు. షెహబాజ్ ప్రతిపక్ష నాయకుడిగా నామినేట్ అయ్యారు. తన సోదరుడు నవాజ్‌లాగే, ప్రతిపక్ష నాయకుడిగా షాబాజ్ కెరీర్ కూడా అవినీతి ఆరోపణలతో నిండిపోయింది. 2018లో నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో అతనిని అరెస్టు చేసింది. 2019 డిసెంబర్‌లో మనీలాండరింగ్‌కు పాల్పడిన తర్వాత షెహబాజ్, అతని కుమారుడు హమ్జా షరీఫ్‌ల 23 ఆస్తులను బ్యూరో జప్తు చేసింది. గత ఏడాది లాహోర్ కోర్టు ఈ కేసులో అతనికి బెయిల్ మంజూరు చేసింది.

షెహబాజ్ పంజాబ్ ప్రావిన్స్‌లో భారీ మౌలిక సదుపాయాల అభివృద్ధి చేశాడు. అయినప్పటికీ ముఖ్యమంత్రిగా అతని కెరీర్ పోలీసు క్రూరత్వం, ప్రావిన్స్‌లో తీవ్రవాద సెక్టారియన్ గ్రూపులను ప్రోత్సహిస్తున్న ఆరోపణలతో దెబ్బతిన్నది. తన ‘స్వతంత్ర’ విదేశాంగ విధానం కారణంగా వాషింగ్టన్, షరీఫ్ కుటుంబం తన ప్రభుత్వాన్ని పడగొట్టారని మాజీ ప్రధాని ఖాన్ ఆరోపించారు. అయితే ఇప్పుడు యూఎస్‌తో సంబంధాలను సరిదిద్దడం షెహబాజ్‌ ముందు ఉన్న అతి పెద్ద సవాల్. పంజాబ్‌లో ప్రతిష్టాత్మకమైన చైనా-పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్‌లో భాగంగా మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయడంలో చైనా ప్రశంసలు అందుకున్న షెహబాజ్, చితికిపోయిన దేశ ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దే బాధ్యతను తన భుజాలపై వేసుకున్నాడు. అయితే షెహబాజ్ ఆరోగ్య పరిస్థితి దేశాన్ని నడపడంలో అతిపెద్ద అడ్డంకిగా మారింది. అతను 2018లో అపెండిక్యులర్ అడెనోకార్సినోమా, వెన్నుపాము క్యాన్సర్‌తో సహా అనేక వ్యాధులకు చికిత్సలు చేయించుకున్నాడు. పాకిస్థాన్ ప్రధాన మంత్రిని ఈ రోజు ఎన్నుకోనున్నారు.

Read Also. Pak-Chian: ఖాన్ కంటే మెరుగ్గా షాబాజ్ పాలన ఉంటుంది.. పాకిస్తాన్‌పై కన్నేసిన డ్రాగన్ కంట్రీ..