Sheikh Hasina: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు బిగుస్తున్న ఉచ్చు.. అరెస్ట్ వారెంట్ జారీ

|

Oct 18, 2024 | 7:11 AM

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాపై అరెస్టు వారెంట్ జారీ అయింది. బంగ్లాదేశ్‌కు చెందిన ఇంటర్నేషనల్ క్రైమ్స్‌ ట్రైబ్యునల్‌ వారెంట్ జారీ చేసింది.

Sheikh Hasina: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు బిగుస్తున్న ఉచ్చు.. అరెస్ట్ వారెంట్ జారీ
Sheikh Hasina
Follow us on

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాపై అరెస్టు వారెంట్ జారీ అయింది. బంగ్లాదేశ్‌కు చెందిన ఇంటర్నేషనల్ క్రైమ్స్‌ ట్రైబ్యునల్‌ వారెంట్ జారీ చేసింది. బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్లపై విద్యార్థుల నిరసనలు హింసాత్మకంగా మారాయి. విధిలేని పరిస్థితుల్లో ప్రధానిగా ఉన్న షేక్‌హసీనా పదవి నుంచి వైదొలిగారు. బంగ్లాదేశ్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో హసీనా భారతదేశంలో ఆశ్రయం పొందుతున్నారు.

జులై 15 నుంచి ఆగస్టు 5 వరకు జరిగిన మారణహోమం, ఇతర నేరాల ఆరోపణలపై హసీనాపై ఐసీటీకి 60కి పైగా కంప్లయింట్స్‌ వచ్చాయి. వాటిపై ట్రైబ్యునల్‌ దర్యాప్తు చేస్తోంది. భారత్‌లో ఆశ్రయం పొందుతున్న ఆమెను బంగ్లాదేశ్‌కు రప్పిస్తామని, ఆమెపై అరెస్టు వారెంట్లు జారీ చేస్తామని ఐసీటీ నూతన ప్రాసిక్యూటర్‌ గతంలో పేర్కొన్నారు. హసీనాను బంగ్లాదేశ్‌కు రప్పించడానికి యూనస్‌ ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తుందని ఆ దేశ విదేశీ వ్యవహారాల శాఖ తెలిపింది. హసీనాను చట్టబద్ధంగా తమ దేశానికి అప్పగించాలంటూ బంగ్లాదేశ్‌ నేషనలిస్ట్‌ పార్టీ భారత ప్రభుత్వాన్ని కోరింది.

తాజాగా షేక్‌ హసీనాపై ఇంటర్నేషనల్ క్రైమ్స్‌ ట్రైబ్యునల్‌ అరెస్టు వారెంట్ జారీ అయింది. నవంబరు 18లోగా తమ ముందు హాజరుకావాలని ఆదేశించింది. హసీనాతో పాటు ఆమె హయాంలో ఎంపీలకు జారీ చేసిన దౌత్య పాస్‌పోర్టులను రద్దు చేసినట్లు బంగ్లాదేశ్‌ హోం మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..