చైనాలోని యాపిల్ ఐఫోన్ ప్లాంట్‌లో ఘర్షణలు చెలరేగాయి. ఆ దేశ ప్రభుత్వం ప్రస్తుతం అమలు చేస్తున్న కోవిడ్ నిబంధనలు, ఆంక్షల పట్ల ఉద్యోగులు మండిపడుతున్నారు. తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్న ఐఫోన్ ప్లాంట్ ఉద్యోగులు బుధవారం ఉదయం ఒక్క సారిగా ఉద్యమించారు. యాజమాన్యంపై ఉద్యోగులంతా కలిసి తిరగబడ్డారు. జెంగ్‌జూ ప్రాంతంలో యాపిల్ ఐఫోన్ల తయారీ కేంద్రం ఫాక్స్‌కాన్ ప్లాంట్ ఉంది. అయితే ప్రస్తుత కాలంలో చైనీయుల దేశంలో కరోనా విజృభించడంతో.. పాలకులు కఠినమైన ఆంక్షలను అమలుచేస్తున్నారు. ఈ క్రమంలోనే యాపిల్ తయారీ ఫ్యాక్టరీ యాజమాన్యం.. తమ వద్ద పనిచేసే ఉద్యోగులు బయటకు వెళ్లకుండా ఉండేందుకు చర్యలు తీసుకున్నారు.
ఫలితంగా ఐఫోన్ ఫ్యాక్టరీ ఉద్యోగులు తమ కుటుంబ సభ్యులను చూసి చాలా రోజులవుతోంది. ఆ కారణంగా అక్కడి ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. కరోనా ఆంక్షలతో మానసిక, శారీరిక చాలా ఒత్తిడికి గురయిన వారు.. బుధవారం తెల్లవారుజామున వందలాది మంది ఒక్కసారిగా తమ విధులను బహిష్కరించారు. అనంతరం బయటకొచ్చి నిరసనకు దిగారు.
1/2 Breaking: Newly recruited #Foxconn workers in #iPhone city in #Zhengzhou, #CCPChina try to break out of Foxconn as they say they are deceived. Foxconn didn’t separate them from older employees who could be #COVID positive, and the contracts they were asked to sign are… pic.twitter.com/FqmRfwZMk7
— Jennifer Zeng 曾錚 (@jenniferzeng97) November 22, 2022
ఈ సందర్భంగా ఫ్యాక్టరీలో సరైన వసతులు కల్పించడం లేదని, జీతాలు కూడా సరిగ్గా ఇవ్వడం లేదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. కోవిడ్‌తో బాధపడుతున్న చాలా మంది ఉద్యోగులు ఈ యూనిట్‌లో ఉన్నప్పటికీ.. వారికి వేరే గదులు కేటాయించడం లేదని వారు ఆరోపించారు. తమను వెంటనే ఇళ్లకు పంపించాలని డిమాండ్ చేశారు. అయితే ఆందోళనకు దిగిన కార్మికులను అక్కడి సెక్యూరిటీ గార్డులు ఆపే ప్రయత్నం చేశారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగి.. కొంత సమయం ఉద్రిక్త వాతావారణం ఏర్పడింది. పరిస్థితిని నియంత్రించేందుకు పోలీసు బలగాలు రంగంలోకి దిగాయి. కాగా ఈ ఘర్షణ కారణంగా ఉద్యోగులలోని చాలా మందికి గాయలయ్యాయని సమాచారం.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..