గ్లోబల్ వార్మింగ్, క్లైమేట్ ఛేంజ్..రోజురోజుకీ మానవాళి మనుగడకే సవాల్ విసురుతున్నాయి. ఉష్ణోగ్రతలకు అంటార్కిటికాలో మంచు కొండలు కరిగిపోతున్నాయి. ఉన్న సరస్సులు సైతం కళ్ళముందే కనుమరుగవుతున్నాయి. తాజాగా మంచుతో కప్పి ఉన్న ఓ పెద్ద సరస్సు కేవలం మూడు రోజుల్లో కనిపించకుండా పోవడం వాతావరణ శాస్త్రజ్ఞులను కలవరానికి గురి చేస్తోంది. డేంజరస్ ట్రెండ్స్ ఆఫ్ క్లైమేట్ ఛేంజ్ అండ్ గ్లోబల్ వార్మింగ్ అని వారు హెచ్చరిస్తున్నారు. 2019 లో తూర్పు అంటార్కిటికాలో ‘అమెరీ ఐస్ షెల్ఫ్’ అనే సరస్సు మాయం కావడం శాటిలైట్ ఇమేజ్ లలోనే చూస్తే ఇప్పుడు ప్రత్యక్షంగా ఈ లేక్ మటుమాయమైంది. ఇందులోని 21 బిలియన్ నుంచి 26 బిలియన్ క్యూబిక్ అడుగుల నీరు సముద్రంలోకి ప్రవహించింది. నీటిపైభాగాన గల ఘనీభవించిన మంచు ఫలకలు ఒక్కసారిగా కుప్ప కూలిపోవడంతో నీరంతా సముద్రం పాలైంది. దీంతో సముద్రపు నీటి మట్టం పెరుగుతోందని వీరు తెలిపారు. రానున్న మరికొన్ని దశాబ్దాల్లో ఈ విధమైన మార్పులు మరిన్ని జరిగి పర్యావరణానికి ముప్పు పెరగవచ్చునని రీసెర్చర్లు భయపడుతున్నారు. తమ ఆందోళలను వీరు జియోఫిజికల్ రీసెర్చ్ లెటర్స్ అనే జర్నల్ లో వ్యక్తం చేశారు.
ప్రపంచ దేశాలు ఓ వైపు క్లైమేట్ ఛేంజ్ గురించి గొంతు చించుకుంటున్నా పటిష్టమైన కార్యాచరణకు పూనుకోవడం లేదని.జరిగే నష్టం జరుగుతూనే ఉందని టాస్మేనియా యూనివర్సిటీ గ్లేజియాలజిస్ట్ రోలాండ్ వార్నర్ పేర్కొన్నారు. వాతావరణ మార్పులపై ఇప్పటికైనా సమగ్ర అధ్యయనం జరగాలని ఆయన సూచిస్తున్నారు. అంతర్జాతీయ వేదికల్లో ఈ అంశంపై విస్తృత చర్చలు జరగాలన్నది ఆయన అభిప్రాయం.
మరిన్ని ఇక్కడ చూడండి : ఆదర్శ వివాహం..అత్తమామల కన్యాదానం..తెలంగాణ అబ్బాయి, నేపాల్ అమ్మాయికి పెళ్లి..(వీడియో).: Nepal marriage Viral video.
News Watch Video: మోడీ ఎన్నికల కేబినెట్,మరిన్ని వార్తా కధనాల సమాహారం (వీడియో).