Ancient toilet‌: 2700 నాటి పురాతన టాయిలెట్‌.. ఎలా ఉందో చూస్తే షాక్ అవుతారు..

|

Oct 07, 2021 | 10:05 AM

Ancient toilet‌: జెరూసలేంలో 2,700 సంవత్సరాల నాటి పురాతన టాయిలెట్‌ను కనుగొన్నారు ఇజ్రాయెల్ పురావస్తు శాస్త్రవేత్తలు . ప్రపంచంలో అత్యంత పురాతనమైన

Ancient toilet‌: 2700 నాటి పురాతన టాయిలెట్‌.. ఎలా ఉందో చూస్తే షాక్ అవుతారు..
Toilet
Follow us on

Ancient toilet‌: జెరూసలేంలో 2,700 సంవత్సరాల నాటి పురాతన టాయిలెట్‌ను కనుగొన్నారు ఇజ్రాయెల్ పురావస్తు శాస్త్రవేత్తలు . ప్రపంచంలో అత్యంత పురాతనమైన నగరాలలో జెరూసలేం ఒకటి. అయితే ఈ అతి పురాతనమైన టాయిలెట్‌ ఫొటోలను ఇజ్రాయెల్ యాంటిక్విటీస్ అథారిటీ విడుదల చేసింది. దీని ద్వారా పవిత్ర నగరమైన జెరూసలేంలో 2,700 సంవత్సరాల క్రితం కూడా ప్రైవేటు బాత్‌రూమ్‌లు ఉండేవని తేలింది. ఆ టాయిలెట్‌ కింద లోతైన సెప్టిక్‌ ట్యాంక్‌ కూడా ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

పురాతన కాలంలో టాయిలెట్ క్యూబికల్ నిర్మించడం చాలా అరుదైన విషయమని ఇజ్రాయెల్ యాంటిక్విటీస్ అథారిటీ అధికారి తెలిపారు. అప్పట్లో ధనవంతులు మాత్రమే ఇలాంటి మరుగుదొడ్లను వాడేవారని చెప్పారు. టాయిలెట్‌ కింద ఉన్న సెప్టిక్ ట్యాంకులో వారికి కొన్ని జంతువుల ఎముకలు, కొన్ని వస్తువులు లభించాయి. వాటి ఆధారంగా ఆ సమయంలో నివశించిన వ్యక్తుల జీవనశైలి ఎలా ఉండేది, ఆ కాలంలో ఎలాంటి వ్యాధులు ఉండేవి లాంటి వివరాలను తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు శాస్త్రవేత్తలు. జెరూసలేంలోని అర్మోన్ హనాట్జీవ్ అనే ప్రాంతంలో ఉన్న ఒక పెద్ద ఎస్టేట్లో ఈ టాయిలెట్‌ను కనుగొన్నారు. కాగా ఈ టాయిలెట్ సెట్‌ను అధికారులు పురావస్తు సదస్సులో ప్రజల సందర్శన కోసం ఉంచనున్నారు, అయితే అది వీక్షించడానికి మాత్రమే సుమా!

Also read:

Ancient toilet‌: 2700 నాటి పురాతన టాయిలెట్‌.. ఎలా ఉందో చూస్తే షాక్ అవుతారు..

Viral Video: ఏడేళ్ల చిన్నారికి ప్రపంచ శాంతి ఫొటో అవార్డు.. వీడియో

Cruise Drugs Case: ఆర్యన్ ఖాన్‌కు జైలా.. బెయిలా? తేలేది ఈరోజే.. డ్రగ్స్ కేసులో రాజకీయ ట్విస్ట్!