AMERICA PRESIDENT: నెతన్యాహుకు బైడెన్ ఫోన్.. రాకెట్ దాడులను సమర్థిస్తూనే.. కాల్పుల విరమణ పాటించాలట!

|

May 18, 2021 | 2:56 PM

అనుకున్నట్లుగానే పెద్దన్న రంగంలోకి దిగాడు. మధ్యప్రాచ్యంలో రగులుకొన్న యుద్ధవాతావరణాన్ని చల్లబరిచేందుకు అమెరికా అధ్యక్షుడు బైడెన్ యత్నాలు ప్రారంభించారు. తక్షణం సీజ్ ఫైర్ పాటించేలా ఇరు వర్గాలు సిద్ధం కావాలని ఆకాంక్షించారు...

AMERICA PRESIDENT: నెతన్యాహుకు బైడెన్ ఫోన్.. రాకెట్ దాడులను సమర్థిస్తూనే.. కాల్పుల విరమణ పాటించాలట!
Follow us on

AMERICA PRESIDENT PHONE TO ISRAEL PRIME MINISTER: అనుకున్నట్లుగానే పెద్దన్న రంగంలోకి దిగాడు. మధ్యప్రాచ్యంలో రగులుకొన్న యుద్ధవాతావరణాన్ని చల్లబరిచేందుకు అమెరికా అధ్యక్షుడు బైడెన్ (AMERICAN PRESIDENT BIDEN) యత్నాలు ప్రారంభించారు. తక్షణం సీజ్ ఫైర్ (CEASE FIRE) పాటించేలా ఇరు వర్గాలు సిద్ధం కావాలని ఆకాంక్షించారు. అమెరికా అధ్యక్షుడు మే 17 అర్ధరాత్రి (భారత కాలమానం ప్రకారం మే 18వ తేదీ ఉదయం) ఇజ్రాయిల్ ప్రధాన మంత్రి (ISRAEL PRIME MINISTER) బెంజమిన్ నెతన్యాహూ (BENJAMIN NETANYAHU)కు ఫోన్ చేశారు. కాల్పుల విరమణ ప్రతిపాదనకు తాము మద్దతిస్తున్నట్లు బైడెన్ స్పష్టం చేశారు. ఇజ్రాయిలీ సేనలు (ISRAEL MILITARY) పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్ (PALESTINE TERRORIST GROUP HAMAS) మధ్య కొనసాగుతున్న యుద్ధాన్ని తక్షణం విరమించాలని నెతన్యాహుకు సూచించారు. అయితే…. ఈజిప్టు విషయంలో అమెరికా ఇంట్రెస్టును సైతం బైడెన్ ఇజ్రాయిల్ ప్రధానికి విమరించారని వైట్ హౌజ్ (WHITE HOUSE) ప్రతినిధి వెల్లడించారు. ఈరకంగా నెతన్యూహాకు సూచించడం ద్వారా ఇజ్రాయిల్, పాలస్తీన ఉగ్రవాద సంస్థల మధ్య యుద్ధాన్ని నివారించాలన్న పలువురు ప్రపంచ దేశాల అధినేతల సరసన బైడెన్ నిలిచారని వైట్ హౌజ్ పేర్కొంది.

ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ హమాస్ విచక్షణారహితంగా ఇజ్రాయిల్ పౌర నివాసాలపై రాకెట్ దాడులకు తెగబడడాన్ని అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఖండించారు. ఈ రాకెట్ దాడుల నుంచి రక్షించుకునేందుకు ఇజ్రాయిల్ చేపట్టిన ఎదురు దాడిని బైడెన్ సమర్థించారని వైట్ హౌజ్ ప్రతినిధి వివరించారు. తమ పౌరుల రక్షణ కోసం ఇజ్రాయిల్ తీసుకునే నిర్ణయాన్ని అమెరికా సమర్థిస్తుందన్నారు.

అయితే ఇజ్రాయిల్ దాడులను బహిరంగంగా అమెరికా సమర్థించనప్పటికీ ఇజ్రాయిల్ దాడులకు పరోక్షంగా మద్దతిచ్చింది. కానీ అంతర్జాతీయ సమాజం మాత్రం ఇజ్రాయిల్ ఎదురు దాడిని ఆపేయాలని కోరుతోంది. పలువురు ప్రపంచ దేశాధినేతలు ఎంతగా చెప్పి చూస్తున్నా ఇజ్రాయెల్‌ వెనక్కు తగ్గడం లేదు. గాజాలోని హమాస్‌ నేతలు, స్థావరాలు లక్ష్యంగా ఇజ్రాయెల్‌ సైన్యం వైమానిక దాడులను మరింత ఉధృతం చేసింది. హమాస్‌ నేతలు, సొరంగాలే టార్గెట్‌గా చేసుకుని దాడులు కొనసాగిస్తోంది.15 కిలోమీటర్ల మేర హమాస్‌ సొరంగాలను ధ్వంసం చేయడంతో పాటు 9 మంది హమాస్‌ కమాండర్లకు చెందిన భవనాలను నేలకూల్చామని ఇజ్రాయెల్‌ వెల్లడించింది. హమాస్‌ తన బలగాలను, పరికరాలను ఈ సొరంగాల ద్వారానే ఒక చోటు నుంచి మరో చోటుకు తరలిస్తోంది.

గాజా ప్రాంతంలో విద్యుత్‌ కేంద్రానికి ఇంధన సరఫరా ఆగిపోయింది. ప్రస్తుతం రెండు మూడు రోజులకు సరిపోయే ఇంధనమే ఉందని అధికారులు తెలిపారు. ఇలాగే దాడులు కొనసాగితే పరిస్థితులు దారుణంగా మారే ప్రమాదం ఉందని గాజా మేయర్‌ యాహ్యా సరాజ్‌ ఆందోళన వ్యక్తం చేశారు. గాజా, ఇజ్రాయెల్‌ మధ్య జరుగుతున్న యుద్ధంలో ఇప్పటివరకు దాదాపు 280 మంది పైగా పాలస్తీనియన్లు చనిపోయారు. గాజా దాడుల్లో.. ఇజ్రాయెల్‌కు చెందిన 10 మంది ప్రాణాలు కోల్పోయి ఉంటారని పాలస్తీనా అంటోంది.

ఇదిలావుంటే ఇజ్రాయెల్‌కు తమ పూర్తి స్థాయి మద్దతు ఉంటుందని ఇప్పటికే అగ్రరాజ్యం అమెరికా ప్రకటించింది. పరిస్థితులు సద్దుమణిగేందుకు, అమెరికా తన బాధ్యత నిర్వర్తించాలని, భద్రతా మండలికి మద్దతు ఇవ్వాలని చైనా కోరింది. వారం రోజులుగా కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు పలికేందుకు అంతర్జాతీయ మధ్యవర్తులు శ్రమిస్తున్నారు. ఇరువర్గాల ప్రతినిధులతో చర్చలు జరుపుతున్నారు