Russia Ukraine War: ఉక్రెయిన్‌లోని భారతీయ విద్యార్థులకు ఊరట.. సుమీ నుంచి తరలింపు ప్రారంభం..

|

Mar 08, 2022 | 9:15 PM

ఉక్రెయిన్‌లోని సుమీ నగరంలో చిక్కుకుపోయిన భారత విద్యార్థులకు భారీ ఊరట లభించింది. వీరందరూ సుమీ నుంచి బస్సులలో బయల్దేరారు. ఈ విషయాన్ని విద్యార్థులను సమన్వయం చేస్తున్న..

Russia Ukraine War: ఉక్రెయిన్‌లోని భారతీయ విద్యార్థులకు ఊరట.. సుమీ నుంచి తరలింపు ప్రారంభం..
Indian Students Sumy
Follow us on

ఉక్రెయిన్‌లోని సుమీ(Sumy) నగరంలో చిక్కుకుపోయిన భారత విద్యార్థులకు భారీ ఊరట లభించింది. వీరందరూ సుమీ నుంచి బస్సులలో బయల్దేరారు. ఈ విషయాన్ని విద్యార్థులను సమన్వయం చేస్తున్న అన్షద్ అలీ అనే వ్యక్తి వెల్లడించారు. అతను చేసిన ప్రకటనను కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురీ(Hardeep Singh Puri) ధ్రువీకరించారు. సుమీలో చిక్కుకుపోయిన విద్యార్థులు పోల్టావాకు వెళ్తున్నట్లు వెల్లడించారు. కంట్రోల్ రూమ్​ నుంచి సోమవారం రాత్రి అందిన సమాచారం ప్రకారం 694 మంది విద్యార్థులు సుమీలో ఉన్నట్లు వెల్లడిచారు. వీరంతా బస్సుల్లో బయలుదేరారని తెలిపారు. అక్కడి నుంచి పశ్చిమ ఉక్రెయిన్‌కు రైళ్లలో ఎక్కుతారని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ  విద్యార్థులను ఇంటికి తీసుకెళ్లడానికి ఆపరేషన్ గంగాలో భాగంగా విమానాలు సిద్ధం చేసినట్లుగా తెలిపారు. భారతీయ విద్యార్థుల వీడియోను కూడా ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఇప్పటివరకు భారత్ 17,100 మంది పౌరులను స్వదేశానికి తీసుకొచ్చింది.

పౌరుల తరలింపు అంశానికి భారత్ అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది భారత ప్రభుత్వం. ఈ విషయంపైనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. సోమవారం ఉక్రెయిన్, రష్యా దేశాధినేతలతో మాట్లాడిన సంగతి తెలిసిందే. భారతీయుల తరలింపునకు సహకరించాలని కోరారు ప్రధాని మోడీ. ఈ నేపథ్యంలోనే తాజా పరిణామాలు చోటు చేసుకోవడం గమనార్హం.

ఇవి కూడా చదవండి: Russia Ukraine War Live: ఒకవైపు కాల్పుల విరమణ..మరోవైపు దాడులు.. సుమీ నగరంపై విరుచుకుపడ్డ రష్యా