భారీ ఆత్మాహుతి దాడి.. 13 మంది మృతి

ఆప్ఘనిస్తాన్‌లో దారుణం చోటుచేసుకుంది. కారు బాంబుతో జరిపిన ఆత్మాహుతి దాడిలో 13 మంది మరణించారు. మరో 120 మంది గాయపడ్డారు

భారీ ఆత్మాహుతి దాడి.. 13 మంది మృతి
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Oct 19, 2020 | 10:09 AM

Afghanistan Bomb Attack: ఆప్ఘనిస్తాన్‌లో దారుణం చోటుచేసుకుంది. కారు బాంబుతో జరిపిన ఆత్మాహుతి దాడిలో 13 మంది మరణించారు. మరో 120 మంది గాయపడ్డారు. మరణించిన వారిలో సెక్యూరిటీ కూడా ఉన్నట్లు అధికారులు తెలిపారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. పశ్చిమ ఆప్ఘనిస్తాన్‌లోని ఘోర్ ప్రావిన్స్‌లో ఉన్న ప్రావిన్సియల్ పోలీస్ చీఫ్‌ ఆఫీసర్ భవనం వద్ద ఆదివారం ఈ ఘటన జరిగింది. ఆప్ఘన్‌లో తాలిబన్లకు, అక్కడి ప్రభుత్వానికి మధ్య ఖతార్‌లో మొదటి భేటీ జరిగిన సమయంలోనే ఈ దాడి జరగడం గమనర్హం. అయితే దీనికి బాధ్యులమంటూ ఇంతవరకు ఏ సంస్థ ప్రకటించలేదు.

Read More:

దివ్య కేసు: నిలకడగా నాగేంద్ర బాబు ఆరోగ్యం

కరోనా అప్‌డేట్స్‌: ప్రపంచవ్యాప్తంగా 4కోట్లు దాటిన పాజిటివ్ కేసుల సంఖ్య