Talibans: హింస మానితే అధికారంలో భాగస్వామ్యం.. తాలిబన్లకు ఆఫ్ఘన్ ప్రభుత్వం ఆఫర్..?

| Edited By: Phani CH

Aug 12, 2021 | 6:01 PM

తాలిబన్లు హింసకు స్వస్తి చెప్పిన పక్షంలో అధికారంలో భాగస్వామ్యం కల్పిస్తామని ఆఫ్ఘన్ ప్రభుత్వం ప్రకటించినట్టు తెలుస్తోంది. దేశంలో పోరు మానివేస్తే ఇందుకు బదులుగా అధికారంలో మీకు 'వాటా' ఇస్తామని ఖతార్ లో ఆఫ్ఘన్ ప్రతినిధి ప్రకటించినట్టు ఏ ఎఫ్ పీ వార్తాసంస్థ వెల్లడించింది.

Talibans: హింస మానితే అధికారంలో భాగస్వామ్యం.. తాలిబన్లకు ఆఫ్ఘన్ ప్రభుత్వం ఆఫర్..?
Talibans
Follow us on

తాలిబన్లు హింసకు స్వస్తి చెప్పిన పక్షంలో అధికారంలో భాగస్వామ్యం కల్పిస్తామని ఆఫ్ఘన్ ప్రభుత్వం ప్రకటించినట్టు తెలుస్తోంది. దేశంలో పోరు మానివేస్తే ఇందుకు బదులుగా అధికారంలో మీకు ‘వాటా’ ఇస్తామని ఖతార్ లో ఆఫ్ఘన్ ప్రతినిధి ప్రకటించినట్టు ఏ ఎఫ్ పీ వార్తాసంస్థ వెల్లడించింది. ఈ మేరకు ఓ ప్రతిపాదనను మధ్యవర్తిగా ఉన్న ఖతార్ కి సమర్పించినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. కాగా కాబూల్ సమీపంలో గజినీ ప్రొవిన్షియల్ రాజధానిని తాలిబన్లు గురువారం స్వాధీనం చేసుకున్నారు. దీంతో ఇప్పటివరకు 10 రాజధానులు వీరి వశమయ్యాయి. ఇలా ఉండగా ఆఫ్ఘన్ లో పరిస్థితి దిగజారుతోందని, అక్కడి పరిణామాలను నిశితంగా గమనిస్తున్నామని విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాఘ్చి అన్నారు. కాబూల్ లోని భారతీయులను ఇండియాకు వెళ్లిపోవాలని అక్కడి భారత రాయబార కార్యాలయం అడ్వైజరీని జారీ చేసిందని ఆయన చెప్పారు అటు-. కుందుజ్ విమానాశ్రయంలో నిన్న ఆఫ్ఘన్ దళాలు తాలీబన్లకు లొంగిపోయినట్టు స్థానిక నేతలు వెల్లడించారు.

ఇలా ఉండగా ఆఫ్ఘన్ నుంచి సెప్టెంబరు 11 నాటికి తమ దేశ బలగాలు తిరిగి తమ దేశానికి వచేస్తాయంటూ అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ ప్రకటించిన అనంతరం ఆఫ్ఘన్ లో తాలిబన్ల దూకుడు మరింత పెరిగింది. ఆఫ్ఘన్ ఉత్తర ప్రాంతంలోని కుందుజ్ నగరాన్ని వారు పూర్తిగా స్వాధీనం చేసుకోవడంతో ఇక వారికీ తిరుగు లేదని భావిస్తున్నారు. ఇక్కడి జైలు నుంచి వారు.. ఖైదీలుగా ఉన్న అనేకమంది తాలిబన్లను విడిపించారు.

 

మరిన్ని ఇక్కడ చూడండి: Puri Jagannath Temple: ఇవాళ తెరుచుకున్న పూరీ జగన్నాథుడి ఆలయం.. భక్తులకు అనుమతి ఎప్పటి నుంచి అంటే..?

హిందూ మహిళలకు ముస్లిములు మెహెందీ పెట్టరాదంటూ యూపీలో ‘క్రాంతిసేన’ ఉద్యమం