Taliban Rule: తాలిబాన్ ప్రభుత్వంలో ఆ మంత్రి మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్..అతనిపై ఎంత రివార్డు ఉందో తెలిస్తే షాక్ అవుతారు..

|

Sep 08, 2021 | 7:02 AM

రెండు దశాబ్దాల తరువాత యుఎస్ మిలిటరీ ఆఫ్ఘనిస్తాన్ నుండి వెళ్లిపోయింది. 20 సంవత్సరాల తరువాత, మరోసారి తాలిబాన్లు అధికారికంగా ప్రభుత్వాన్ని ప్రకటించారు.

Taliban Rule: తాలిబాన్ ప్రభుత్వంలో ఆ మంత్రి మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్..అతనిపై ఎంత రివార్డు ఉందో తెలిస్తే షాక్ అవుతారు..
Taliban Rule Sirajuddin Hakkani
Follow us on

Taliban Rule: రెండు దశాబ్దాల తరువాత యుఎస్ మిలిటరీ ఆఫ్ఘనిస్తాన్ నుండి వెళ్లిపోయింది. 20 సంవత్సరాల తరువాత, మరోసారి తాలిబాన్లు అధికారికంగా ప్రభుత్వాన్ని ప్రకటించారు. తాలిబాన్ ప్రపంచంలో చాలా దేశాలు తీవ్రవాద సంస్థగా ప్రకటించిన ఒక సంస్థ. ఇప్పుడు తాజాగా ఏర్పడిన ప్రభుత్వంలో తాలిబన్లు పేరుమోసిన ఉగ్రవాదులకు మాత్రమే స్థానం కల్పించారు. దీనిలో ఒక పేరు ప్రపంచాన్ని నివ్వెరపరచడమే కాకుండా భయాన్ని కూడా కలిగించేలా చేసింది. ఆ పేరు సిరాజుద్దీన్ హక్కానీ. అతను ఎంత భయంకరమైన ఉగ్రవాది అంటే..అమెరికా అతనిపై 5 మిలియన్ డాలర్ల (భారతీయ కరెన్సీ ప్రకారం సుమారు రూ. 37 కోట్లు) రివార్డును ప్రకటించి ఉంది. ఈ ఒక్క ఉదాహరణ చాలు తాలిబన్ పాలన ఆఫ్ఘనిస్తాన్ లో ఎలా ఉండబోతోందో చెప్పడానికి.

ఇదీ సిరాజుద్దీన్ హక్కానీ ఉగ్రవాద చరిత్ర..

సిరాజుద్దీన్, అతని తండ్రి కూడా 2008 లో కాబూల్‌లోని భారత రాయబార కార్యాలయంపై దాడి చేశారు. ఇందులో 58 మంది మరణించారు. 2011 లో, సంయుక్త జాయింట్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ జనరల్ మైక్ ముల్లెన్, హక్కానీ నెట్‌వర్క్‌ను పాకిస్తాన్ గూఢచార సంస్థ ISI కుడి భుజంగా వర్ణించారు. అదేవిధంగా పాకిస్తాన్ ఏజెంట్‌గా పేర్కొన్నారు.

ఫిదాయీన్ దాడులు హక్కానీ స్పెషాలిటీ. ఫిదాయీన్ దాడుల చరిత్ర అనేక దశాబ్దాల నాటిది. ఇది శ్రీలంకలో అంతర్యుద్ధం సమయంలో ఉద్భవించిందని నమ్ముతారు, కానీ హక్కానీ నెట్‌వర్క్, ముఖ్యంగా సిరాజుద్దీన్ హక్కానీ, ఆఫ్ఘనిస్తాన్‌లో ఫిదాయీన్ లేదా ఆత్మాహుతి దాడులను ప్రారంభించినట్లు భావిస్తున్నారు. ఇప్పటివరకు, ఆఫ్ఘనిస్తాన్‌లో జరిగిన ఈ దాడుల్లో వేలాది మంది అమాయకులు మరణించారు. ఈ దాడుల కింద ఆఫ్ఘనిస్తాన్ మాజీ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్ హత్యకు కూడా సిరాజుద్దీన్ ప్లాన్ చేశాడు. అది విఫలమైంది.

సిరాజుద్దీన్ తండ్రి.. హక్కానీ నెట్‌వర్క్ వ్యవస్థాపకుడు జలాలుద్దీన్ హక్కానీ 2013 లేదా 2015 మధ్య హత్య చేయబడ్డారు. కానీ, సిరాజుద్దీన్ 2001 నుండి హక్కానీ నెట్‌వర్క్ నాయకుడు. సిరాజుద్దీన్ పాకిస్థాన్‌లోని వజీరిస్తాన్‌లో నివసిస్తున్నారు.

హక్కానీ నెట్‌వర్క్ ఇదీ..

హక్కానీ నెట్ వర్క్ గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. 1980 లో, సోవియట్ దళాలు ఆఫ్ఘనిస్తాన్‌ను ఆక్రమించాయి. అమెరికా దీనిని అవమానంగా భావించింది. పాకిస్తాన్‌తో కలిసి, స్థానిక గిరిజనులకు ఆయుధాలు, డబ్బు ఇచ్చారు. వాటిలో హక్కానీ నెట్‌వర్క్ కూడా ఉంది. దీని తరువాత తాలిబాన్ ఏర్పడింది. అమెరికా ఈ సమూహాల నుండి దూరం పాటించడం ప్రారంభించింది. కానీ, పాకిస్తాన్ వారిని పోషించడం కొనసాగించింది. పాకిస్తానీ ISI.. ఆఫ్ఘనిస్తాన్, US రెండింటికి వ్యతిరేకంగా హక్కానీ నెట్‌వర్క్‌ను ఉపయోగించింది. ఈ ఏజెన్సీ కూడా డబ్బు తీసుకొని దాడులు చేస్తుంది. పాకిస్థాన్‌పై ఒత్తిడి చేయడం ద్వారా హక్కానీ నెట్‌వర్క్‌ను తొలగించలేకపోవడం అమెరికా వైఫల్యంగా చెప్పవచ్చు.

తాలిబాన్, హక్కానీ నెట్‌వర్క్:

తాలిబాన్ అనేది ఏ ఒక్క సంస్థ పేరు కాదని చాలా మందికి తెలీదు. ఇందులో అనేక వర్గాలు, అనేక వంశాలు ఉన్నాయి. హక్కానీ నెట్‌వర్క్‌ను కూడా వీటిలో ఒకటిగా పరిగణించవచ్చు. ఆఫ్ఘన్ తాలిబాన్ వేరు, పాకిస్థాన్ తాలిబాన్ వేరు. ఒక విషయం మాత్రమే సాధారణమైనది. ఇవన్నీ షరియత్ ప్రకారం పాలించాలనుకునే ఫండమెంటలిస్ట్ అదేవిధంగా టెర్రరిస్ట్ సంస్థలు.

తాలిబాన్, హక్కానీ నెట్‌వర్క్ వారి సౌలభ్యం ప్రకారం ఒకదానికొకటి ఉపయోగిస్తాయి. హక్కానీ నెట్‌వర్క్ ఆఫ్ఘన్ తాలిబాన్ అధికారంలోకి రావడానికి సహాయపడింది. దాని ఫలితం ముందు ముందు కనిపిస్తుంది. దాని నాయకుడు ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ హోం మంత్రిగా ఉంటారు. మరో మాటలో చెప్పాలంటే, తాలిబాన్ హక్కానీ నెట్‌వర్క్ వేరు. అయితే ఇవి రెండూ విడివిడిగా..కలివిడిగా ఉండే ఉగ్రవాద సంస్థలు అనేది స్పష్టం.

హక్కానీ నెట్‌వర్క్ ఇలా చేసింది..

2001: సిరాజుద్దీన్ హక్కానీ నెట్‌వర్క్ చీఫ్ అయ్యారు
2008: భారత రాయబార కార్యాలయంపై దాడి, 58 మంది మరణించారు
2012: హక్కానీ నెట్‌వర్క్‌ను అమెరికా నిషేధించింది
2014: పెషావర్ పాఠశాలపై దాడి, 200 మంది పిల్లలు మరణించారు
2017: కాబూల్‌లో దాడి, 150 మందికి పైగా మరణించారు

Also Read: Afghanistan Crisis:ఆఫ్ఘనిస్తాన్ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తాలిబన్.. ఇది తాత్కాలికమే!

Afghanistan Pakistan: అఫ్గాన్‌లో కొత్త కుట్రలకు తెరలేపిన పాకిస్తాన్.. ఆ పథకం పారిందా? ఉగ్రవాదుల జన్మస్థలమే..!