Afghan Crisis: ఆఫ్గాన్‌లో తాలిబన్ల రాజ్యంతో భారత్‌కు నష్టమే.. పాకిస్తాన్ పాలక పార్టీ నేత వ్యాఖ్యలే సంకేతం..

కాశ్మీర్ ఆక్రమణలో పాకిస్థాన్ కు సహాయ పడతామని తాలిబన్లు హామీ ఇచ్చారని పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పాకిస్తాన్ తెహ్రీక్=ఏ-ఇన్సాఫ్ నేత నీలం ఇర్షాద్ షేక్ తెలిపారు. తాలిబన్లతో తమ దేశ మిలిటరీకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని ఆమె చెప్పారు.

Afghan Crisis: ఆఫ్గాన్‌లో తాలిబన్ల రాజ్యంతో భారత్‌కు నష్టమే.. పాకిస్తాన్ పాలక పార్టీ నేత వ్యాఖ్యలే సంకేతం..
Talibans

Edited By:

Updated on: Aug 25, 2021 | 7:48 PM

కాశ్మీర్ ఆక్రమణలో పాకిస్థాన్ కు సహాయ పడతామని తాలిబన్లు హామీ ఇచ్చారని పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పాకిస్తాన్ తెహ్రీక్=ఏ-ఇన్సాఫ్ నేత నీలం ఇర్షాద్ షేక్ తెలిపారు. తాలిబన్లతో తమ దేశ మిలిటరీకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని ఆమె చెప్పారు. లైవ్ గా జరిగిన ఓ టీవీ షోలో ఆమె మాట్లాడుతూ..తాలిబన్ల హామీని తాము నమ్ముతున్నామని చెప్పారు. తాలిబన్లు అన్యాయానికి గురైనవారని ఆమె వాపోయింది. వారికే ఎక్కువగా నష్టం జరిగిందని వ్యాఖ్యానించింది. నీలం ఇర్షాద్ షేక్ చేసిన వ్యాఖ్యల తాలూకు వీడియో క్లిప్ ను పాక్ జర్నలిస్టు, అమెరికాకు మాజీ రాయబారి హుసేన్ హకానీ రీట్వీట్ చేయగా దాన్ని ఏఎన్ఐ సర్క్యులేట్ చేసింది. తాలిబన్లను పాకిస్థాన్, ఆ దేశంలోని ఐఎస్ఐ ప్రోత్సహిస్తున్నాయని ఆఫ్ఘన్ నేతలు ఆరోపిస్తున్న నేపథ్యంలో ఈమె చేసిన వ్యాఖ్యాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఆఫ్ఘన్ లో ప్రస్తుత పరిస్థితికి తాలిబన్లే కారణమని ఆఫ్ఘన్ తొలి మహిళా మేయర్ జరీఫా గఫారీ విమర్శించింది. 26 ఏళ్ళ వయస్సులోనే వర్దాక్ ప్రావిన్స్ రాజధాని మైదాన్ షహర్ కి మేయర్ గా ఎన్నికైన ఆమె.. కాబూల్ నగరాన్ని తాలిబన్లు ఆక్రమించుకోగానే జర్మనీ పారిపోయింది.

తాను, తన భర్త ఇంట్లోనే ఉన్నామని, తాలిబన్లు వచ్చి తనను టార్గెట్ చేయాలని ఆమె తొలుత సవాల్ చేసిన సంగతి తెలిసిందే. దేశంలో ఆడపిల్లల విద్యకు కృషి చేయాలన్నది తన లక్ష్యం కాగా తాలిబన్లు అధికారంలోకి వచ్చి ఈ లక్ష్యాన్ని నీరు గార్చారని ఆమె ఆరోపించింది. ఎప్పటికైనా మళ్ళీ ఆఫ్ఘన్లు అధికారాన్ని కైవసం చేసుకుంటారన్న విశ్వాసాన్ని ఆమె వ్యక్తం చేసింది. ఇలా ఉండగా కాబూల్ ఎయిర్ పోర్టులో పరిస్థితి ఇంకా ఉద్రిక్తంగానే ఉంది. ఈ దేశాన్ని ఎంత త్వరగా వీడితే అంత మంచిదని ఆఫ్ఘన్లు, ఇతర విదేశీయులు ఇక్కడ గుమికూడుతున్నారు.

మరిన్ని ఇక్కడ చూడండి: ప్రైవేటీకరణతోనే ఇండియా ముందుకెళ్తుందా.? Big News Big Debate Live Video.

తరుముకొస్తున్నథర్డ్ వేవ్..! హెచ్చరిస్తున్నా కేంద్ర ఆరోగ్య శాఖ..: Third Wave Of Coronavirus Live Video.

తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల…: TS EAMCET Result 2021 Live Video.

కన్నింగ్ లేడీ.. హనీట్రాప్ కేసులో కీలకం.. ముగ్గురి పేర్లతో ఒకే యువతి మోసం..:Honeytrap Case Video.