AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pakistan: ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్ల పాలకులకు పాకిస్తాన్ ఆహ్వానం.. ప్రపంచ దేశాల్లో అసహనం..

ప్రపంచంలోనే ఒంటరిగా ఉన్న ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్ల పాలనకు మళ్లీ పాకిస్తాన్ మద్దతు పెరుగుతోంది. ఇస్లామిక్ దేశాల సంస్థ (OIC) డిసెంబర్ 19న ఇస్లామాబాద్‌లో సమావేశం కానుంది.

Pakistan: ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్ల పాలకులకు పాకిస్తాన్ ఆహ్వానం.. ప్రపంచ దేశాల్లో అసహనం..
Pakistan Invitation To Afghanistan
KVD Varma
|

Updated on: Dec 14, 2021 | 8:29 PM

Share

Pakistan: ప్రపంచంలోనే ఒంటరిగా ఉన్న ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్ల పాలనకు మళ్లీ పాకిస్తాన్ మద్దతు పెరుగుతోంది. ఇస్లామిక్ దేశాల సంస్థ (OIC) డిసెంబర్ 19న ఇస్లామాబాద్‌లో సమావేశం కానుంది. అందులో చేరాల్సిందిగా ఆఫ్ఘన్ తాలిబన్లను పాకిస్తాన్ ఆహ్వానించింది. మరి దీనిపై మిగిలిన ముస్లిం దేశాలు ఎలా స్పందిస్తాయో చూడాల్సి ఉంది. దీనికి కారణం.. ఇప్పటి వరకు పాకిస్తాన్ సహా ప్రపంచంలోని ఏ దేశం కూడా తాలిబన్ల పాలనను గుర్తించకపోవడమే. కొన్ని దేశాలు ఈ శిఖరాగ్ర సమావేశానికి దూరంగా ఉండవచ్చు లేదా తాలిబాన్లకు ఇచ్చిన ఆహ్వానాన్ని పాకిస్తాన్ ఉపసంహరించుకునే అవకాశం కూడా ఉంది.

ఆఫ్ఘన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ, ఆఫ్ఘన్ ఆర్థిక వ్యవస్థ, బ్యాంకింగ్ వ్యవస్థ.. ఇతర దేశాలతో సంబంధాల ప్రకారం, ఆఫ్ఘనిస్తాన్ ఆర్థిక వ్యవస్థ సంరక్షణ ఈ శిఖరాగ్ర సమావేశంలో పెద్ద సమస్య కావచ్చు. అన్ని దేశాలు.. ఇతర సంస్థలు ఈ అంశాలను సమ్మిట్‌లో పరిగణించాలని కోరుకుంటున్నాయి. అందుకే ఈ సమావేశానికి హాజరు కావాల్సిందిగా ఆఫ్ఘనిస్తాన్ ‌కు పాకిస్తాన్ ఆహ్వానం పంపింది. ఓఐసీలో ఉన్న ముస్లిం దేశాలతో పాటు అమెరికా, రష్యా, బ్రిటన్, యూరోపియన్ యూనియన్, ప్రపంచ బ్యాంకులను కూడా ఈ సదస్సుకు పిలిచినట్లు సమాచారం. కొన్ని మానవ హక్కుల సంస్థలు కూడా ఇందులో పాల్గొనవచ్చు. అయితే ఈ ఆహ్వానంపై ఇప్పటి వరకు ఏ దేశం ఏమీ చెప్పలేదు.

నేషనల్ సాలిడారిటీ మూవ్‌మెంట్ అధ్యక్షుడు సయ్యద్ ఇషాక్ గిలానీ తాలిబాన్‌లను ఆహ్వానించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆఫ్ఘనిస్తాన్ ‌లో తాలిబన్ల పాలనను గుర్తించేందుకు ప్రపంచంలోని అనేక ముస్లిం దేశాలు సిద్ధంగా లేవని అన్నారు. ఆఫ్ఘనిస్తాన్ ‌తో చాలా దేశాలకు సత్సంబంధాలు కూడా లేవు. ఆగస్టు 15న కాబూల్‌ను స్వాధీనం చేసుకోవడంతో తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్ ‌ను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. మౌలానా హసన్ అఖుంద్ దాని నాయకుడు. అతను 2001 నుండి ఐక్యరాజ్యసమితి నిషేధిత జాబితాలో ఉన్నాడు.

పాకిస్తాన్ ఇబ్బందుల్లో పడవచ్చు.. ఆఫ్ఘనిస్తాన్‌లోని తాలిబాన్ పాలన అధికారంలోకి వచ్చి 100 రోజులకు పైగా అయ్యింది. ఇప్పటి వరకు ఏ దేశమూ తాలిబన్ ప్రభుత్వాన్ని గుర్తించలేదు. తాలిబాన్ పాలన మహిళలు.. మానవ హక్కులపై తన వాగ్దానాలను నెరవేర్చాలని.. దీనికి సాక్ష్యాలను అందించాలని చాలా దేశాలు కోరుకుంటున్నాయి. తాలిబన్లు ఇంతవరకు దీన్ని చేయలేకపోయారు. తాలిబన్ల పాలనను గుర్తించాలని పాకిస్తాన్ నిరంతరం ప్రపంచ దేశాలను వేడుకుంటూ వస్తోంది. చాలా మంది పాకిస్తాన్ ప్రయత్నాలను అనుమానంగా చూస్తున్నారు. ఆఫ్ఘన్ తాలిబాన్‌లను OICకి ఆహ్వానించడం ద్వారా, పాకిస్తాన్ మరోసారి ప్రపంచానికి వ్యతిరేకంగా మారవచ్చని నిపుణులు భావిస్తున్నారు.

ఇవి కూడా చదవండి: Success Story: ఒక్క మహిళ.. వెయ్యిరూపాయల పెట్టుబడి.. ఏడేళ్ళు.. కోట్లాది రూపాయల సంపాదన.. ఎలా అంటారా..ఇదిగో ఇలా..!

Chardham Road Project: సైనికుల కోసం ఇది తప్పనిసరి.. చార్‌ధామ్ రోడ్ ప్రాజెక్టుకు సుప్రీం కోర్టు ఆమోదం..