Afghanistan Crisis: ఆఫ్గనిస్తాన్ పూర్తిగా తాలిబన్ల పరిపాలన కిందకు వచ్చింది. అయితే తాలిబన్లు ప్రపంచానికి చెబుతుంది వేరు.. స్థానికంగా వారు ప్రవర్తిస్తున్న తీరు వేరు అని పలు సంఘటనల ద్వారా తెలుస్తోంది. తాలిబన్లు చేస్తున్న అకృత్యాలకు ఆడ, మగ, చిన్న, పెద్ద అనే తేడా లేదు.. అందరూ బాధితులుగా మారిపోయారు. ఇక తాలిబాన్లు కోపంతో శిక్షించినా.. సంతోషంతో సంబరాలు జరుపుకున్నా మారణకాండ తప్పదా అనిపించేలా .. సాక్ష్యంగా తాజాగా సంఘటన నిలుస్తుంది.
అఫ్ఘాన్ స్థానిక మీడియా కథనం ప్రకారం.. శుక్రవారం రాత్రి తాలిబన్లు పంజ్‌షీర్ ప్రాంతాన్ని చేజిక్కించుకున్నారు. దీంతో పూర్తి స్థాయిలో ఆఫ్ఘనిస్తాన్ పూర్తిగా తాలిబన్ల చేతికి చిక్కినట్లు అయ్యింది. దీంతో తాలిబన్ల గర్వం నషాళానికి అంటింది.. సంబరాలను చేసుకుంటూ.. తుపాకీలతో గన్ ఫైర్ చేస్తూ.. తమ సంతోషాన్ని వ్యక్త పరిచారు. తాలిబన్ల సంబరాల ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ఫొటోలు, వీడియోలు హల్ చల్ చేస్తున్నాయి.
తాలిబన్ల సంబరాలు హద్దులు మీరి చేసుకోవడంతో.. తుపాకుల దాటికి అమాయకులైన 17మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోగా దాదాపు 41మంది వరకూ గాయాలపాలైయ్యారు. ప్రస్తుతం బాధితులు కాబూల్ లోని ఎమర్జెన్సీ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. క్షతగాత్రులను ననగర్హార్ ప్రాంతం నుంచి కాబుల్ ఆస్పత్రికి తరలించామని అధికారులు వెల్లడించారు.
అయితే తాలిబన్లకు తమ ప్రాంతంపై అధికారం చేజిక్కింది అన్న వార్తలు నిజం ల;లేదని సోషల్ మీడియా ద్వారా పంజ్‌షీర్ బలగాల నాయకుడైన అహ్మద్ మసూద్ చెప్పారు. అంతేకాదు తన ప్రాణమున్నంత తాలిబాన్లకు పంజ్‌షీర్ దక్కదని.. ట్వీట్ చేశారు. ఇదే విషయం పై పంజ్‌షీర్ ప్రాంతానికి చెందిన మరో నాయకుడు అమృల్లా సాలెహ్ కూడా స్పందించారు. తాలిబన్లకు ఇంకా పంజ్‌షీర్ దక్కలేదని.. వారు చెబుతున్న మాటలు అబద్ధమని చెప్పారు. తమ కమాండర్లతో పాటు, నేతలు కూడా సహకరిస్తున్నారని.. తమకు ప్రస్తుతం క్లిష్టమైన పరిస్థితి ఉందని.. అయితే దానిని అందరం కలిసి ఎదుర్కొంటామని చెప్పారు.
Also Read: మనదేశంలోనే కాదు.. ప్రపంచంలో ఏయే దేశాల్లో గణేషుడి విగ్రహాలు ఏయే రూపాల్లో ఉన్నాయి.. ఎలా పూజిస్తారంటే..