Afghan-Taliban: ఆఫ్ఘన్‌లో తాలిబన్ల కిల్లర్‌ సిరీస్‌ షురూ.. ప్రభుత్వ వ్యతిరేకులపై ఉక్కుపాదం.. మహిళలను ఏంచేస్తున్నారంటే!

ఆఫ్ఘన్‌లో తాలిబన్ల అరాచకం కొనసాగుతూనే ఉంది. తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన మరుసటి రోజే తమ నిజస్వరూపాన్ని బయటపెట్టున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలపై తాలిబన్లు నిషేధం విధించారు.

Afghan-Taliban: ఆఫ్ఘన్‌లో తాలిబన్ల కిల్లర్‌ సిరీస్‌ షురూ.. ప్రభుత్వ వ్యతిరేకులపై ఉక్కుపాదం.. మహిళలను ఏంచేస్తున్నారంటే!
Taliban

Afghanistan Crisis: ఆఫ్ఘన్‌లో తాలిబన్ల అరాచకం కొనసాగుతూనే ఉంది. తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన మరుసటి రోజే తమ నిజస్వరూపాన్ని బయటపెట్టున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలపై తాలిబన్లు నిషేధం విధించారు. అంతేకాదు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్న వాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తాజాగా ప్రభుత్వంలో ప్రాతినిధ్యం కల్పించాలని ఆందోళన చేపట్టిన మహిళలపై ఉక్కుపాదం మోపారు తాలిబన్లు. నడివీథిలో చితకబాదారు. బెల్టుతో కొడుతూ శిక్షించారు. మరోవైపు, తాలిబన్ల ప్రభుత్వాన్ని ప్రపంచదేశాలు గుర్తించవద్దని నార్తర్న్‌ అలయెన్స్‌ విజ్ఞప్తి చేసింది. తాము కూడా త్వరలోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నారు నార్తర్న్‌ అలయెన్స్‌ ప్రతినిధులు.

అఫ్గానిస్తాన్‌ను పూర్తిగా హస్తగతం చేసుకున్న తాలిబన్లు.. ప్రధానమంత్రిగా ముల్లా మొహమ్మద్‌ హసన్‌ అఖుంద్‌ పరిపాలన మొదలు పెట్టారు. మంత్రివర్గాన్ని కూడా ఏర్పాటుచేశారు. ఇక, మహిళల విషయంలో మరోసారి తాలిబన్ల అకృత్యం బయటపడింది. మహిళలు పిల్లలను కనడానికి మాత్రమే ఉన్నారని , కేబినెట్‌లో ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్లకు చోటు ఉండదని స్పష్టం చేశారు. తమను ఎదురించిన మహిళలను, ఆందోళనకారులను ఉక్కుపాదంతో అణచివేస్తున్నారు తాలిబన్లు. పైగా తాలిబన్లకు వ్యతిరేకంగా బుధవారం మహిళలు నిరసన చేపట్టారు. మంత్రివర్గంలో మహిళ అంశంతో పాటు నిన్న జరిగిన మహిళల ప్రదర్శనపై తాలిబన్ల ప్రతినిధి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మహిళలపై అతడు సంచలన వ్యాఖ్యలు చేశారు.

‘మంత్రులుగా మహిళలు పనికి రారు.. వాళ్లు కేవలం జన్మనివ్వడానికే పరిమితం’ అని పేర్కొన్నాడు. తాలిబన్ల అధికార ప్రతినిధి సయ్యద్‌ జెక్రుల్లా హషిమి ఓ టీవీ ఛానల్‌‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విధంగంగా స్పందించారు. ‘మహిళలు మంత్రులు కాలేరు. ఆమె మెడపై ఏమైనా వస్తువు పెడితే వారు మోయలేరు. మంత్రివర్గంలో మంత్రులు తప్పనిసరి కాదు’ అని పేర్కొన్నాడు. ఈ సందర్భంగా నిన్న మహిళల నిరసన ప్రదర్శనపై అతడు స్పందిస్తూ ‘ఆ నలుగురు మహిళల నిరసన అఫ్గానిస్తాన్‌ మొత్తం మహిళలు ప్రాతినిథ్యం వహించినట్టుగా భావించొద్దు’ తేల్చి చెప్పారు. మరోసారి మహిళలపై తమకు ఉన్న అభిప్రాయాన్ని బాహాటంగానే వెళ్లగక్కారు.

మరోవైపు, ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్ల కిల్లర్‌ సిరీస్‌ కొనసాగుతోంది. అమెరికాపై సెప్టెంబర్‌ 11 దాడులు జరిగిన రోజే అధికార దినోత్సవంగా నిర్వహించాలన్న ఆలోచనలో ఉన్నారు తాలిబన్లు. సెప్టెంబర్‌ 11వ తేదీన భారీగా విజయోత్సవాలు నిర్వహించాలని డిసైడ్‌ అయ్యారు. అలా చేసి అమెరికాకు ఓ సవాల్‌ విసిరే ఆలోచనతో తాలిబన్ల కొత్త ప్రభుత్వం ఉన్నట్టు కన్పిస్తోంది. చనిపోయిన వాళ్ల మీద కూడా తమ కసి తీర్చుకుంటున్నారు ఈ ముష్కరులు . పంజ్‌షేర్‌ సింహం అహ్మద్‌షా మసూద్‌ సమాధిని ధ్వంసం చేసి తమ ఉన్మాదాన్ని చాటుకున్నారు. సెప్టెంబర్ 9 తేదీని అహ్మద్‌షా మసూద్‌ వర్ధంతిగా జరుపుకుంటారు పంజ్‌షేర్‌ ప్రజలు . సోవియట్‌ సేనలతో పాటు తాలిబన్లను ఎదురించిన మొనగాడి సమాధిని ధ్వంసం చేసి తమ రాక్షసప్రవృత్తిని బయటపెట్టుకున్నారు.

అయితే, అహ్మద్‌షా మసూద్ సమాధిని రిపేర్‌ చేస్తామని తాలిబన్ల బడా నేత ఒకరు స్థానికులకు హామీ ఇచ్చారు. చేసిందంతా చేసి ఇప్పుడు కపట నాటకాలు ఆడుతున్నారు. పంజ్‌షేర్‌ వ్యాలీకి సంబంధించి నార్తర్న్‌ అలయెన్స్‌ మరో కీలక ప్రకటన విడుదల చేసింది. 60 శాతం భూభాగం ఇంకా తమ ఆధీనం లోనే ఉందని , ప్రధాని రహదారి మినహా పర్వత ప్రాంతాలు తమ ఆధీనం లోనే ఉన్నాయని తెలిపారు. అంతేకాదు తమ టాప్‌ కమాండర్లు సజీవంగా ఉన్నారని వీడియో విడుదల చేశారు. పంజ్‌షేర్‌ వ్యాలీలో పనికిరాని విమానాలతో ఏం చేసుకోవాలో తాలిబన్లకు అర్ధం కావడం లేదు. ఆ విమానం రెక్కలకు తాడు కట్టి ఊయలలో ఊగుతున్నారు.

Read Also.. Lung Cancer: పొగతాగకపోయిన ఊపిరితిత్తుల కేన్సర్ వచ్చే అవకాశాలు.. అప్రమత్తంగా ఉండాలన్తున్న శాస్త్రవేత్తలు

Click on your DTH Provider to Add TV9 Telugu