ఇజ్రాయెల్‌లోని హైఫా పోర్ట్‌కు ఎలాంటి నష్టం జరగలేదు.. అదానీ గ్రూప్ కీలక ప్రకటన!
ఇరాన్ బాలిస్టిక్ క్షిపణి దాడిలో ఇజ్రాయెల్‌లోని అదానీ గ్రూప్ హైఫా ఓడరేవు దెబ్బతిన్నట్లు వస్తున్న వార్తలు అదానీ గ్రూప్ ఖండించింది. ఈ ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని ఆదాని గ్రూప్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ జుగేషిందర్ రోబీ సింగ్ ఆదివారం విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపారు. అయితే తాజాగా ఇజ్రాయెల్ ఇరాన్‌పై దాడి చేయగా దానికి ప్రతీకారంగా ఇరాన్ ఇజ్రాయెల్‌లోని హైఫా ఓడరేవు సమీపంలోని దాడులకు పాల్పడింది. దీంతో ఈ హైఫా ఓడరేవు దెబ్బతిన్నట్టు వార్తలు వచ్చాయి.

గత కొన్ని రోజులుగా ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధ వాతావరణంతో పచ్చిమాసిలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో రెండు దేశాలు పరస్పరం ప్రతీకార దాడులు చేసుకుంటున్నారు. అయితే ఈ వారం మొదట్లో ఇజ్రాయెల్ ఇరాన్‌లోని టెల్ అవీవ్, ఇతర లక్ష్యాలను టార్గెట్‌గా చేసుకొని దాడులకు పాల్పడింది. ఈ దాడులకు ప్రతీకారంగా శనివారం రాత్రి ఇరాన్ ఇజ్రాయెల్‌లోని హైఫా ఓడరేవు సమీపంలోని చమురు శుద్ధి కర్మాగారాన్ని లక్ష్యంగా చేసుకొని దాడులు చేసింది. అయితే ఇరాన్ నుంచి వచ్చిన కొన్ని క్షిపణులు, ష్రాప్నెల్ ఓడరేవులోని కెమికల్ టెర్మినల్, శుద్ధి కర్మాగారంపై పడ్డాయని, కానీ ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని విషయం తెలిసిన రెండు వర్గాలు తెలిపాయి.
ఇరాన్ బాలిస్టిక్ క్షిపణి దాడి హైఫా ఓడరేవు కార్యకలాపాలకు ఎటువంటి నష్టం కలిగించలేదని, అక్కడ ఎలాంటి ప్రాణ నష్టం కూడా జరగలేదని వారు పేర్కొన్నారు హైఫా ఓడరేవు సాధారణంగా పనిచేస్తుందని, ఆదివారం ఎనిమిది నౌకలు కార్యకాలాపాలను కొనసాగిస్తున్నాయని వారు తెలిపారు. ఓడరేవులో దాదాపు 700 మంది ఉద్యోగులు ప్రస్తుతం పిచేస్తున్నట్టు తెలిపారు.
False. https://t.co/ZuvzY5Uvj5
— Jugeshinder Robbie Singh (@jugeshinder) June 15, 2025
ఇజ్రాయెల్‌టో ఉన్న. హైఫా ఓడరేవు ఒక ముఖ్యమైన సముద్ర కేంద్రంగా పనిచేస్తుంది, ఇది ఇజ్రాయెల్ దిగుమతుల్లో 30 శాతానికి పైగా నిర్వహిస్తుంది. ఈ హైఫా పోర్టులో అదానీ పోర్ట్స్‌కు 70 శాతం వాటా ఉంది, దీనిని 2023లో ఇజ్రాయెల్‌కు చెందిన గాడోట్ గ్రూప్‌తో భాగస్వామ్యంతో $1.2 బిలియన్లకు అదానీ గ్రూప్స్ కొనుగోలు చేసింది. వ్యూహాత్మకంగా ఉత్తర ఇజ్రాయెల్‌లో ఉన్న ఈ పోర్టు అదానీ పోర్ట్స్ వార్షిక కార్గో పరిమాణంలో దాదాపు 3 శాతం వాటాను అందిస్తుంది. అంతే కాకుండా ఇది ఇజ్రాయెల్ దిగుమతులు, ఎగుమతులకు చాలా ముఖ్యమైనది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..