Accident: ఇకపై రోడ్డు ప్రమాద ఫోటోలు, వీడియోలు తీస్తే రూ. కోటి వరకు జరిమానా.. ఎక్కడో తెలుసా.?

|

Mar 04, 2022 | 6:30 AM

Accident: ఏమంటూ స్మార్ట్‌ఫోన్‌ల (Smartphones) వినియోగం పెరిగిందో ప్రతీ ఒక్కరూ చిన్న సైజ్‌ న్యూస్‌ రిపోర్టర్‌ల మారిపోయారు. ఏ చిన్న సంఘటన జరిగినా సరే వెంటనే జేబులోని స్మార్ట్‌ ఫోన్‌ను తీసి చిత్రీకరిస్తున్నారు...

Accident: ఇకపై రోడ్డు ప్రమాద ఫోటోలు, వీడియోలు తీస్తే రూ. కోటి వరకు జరిమానా.. ఎక్కడో తెలుసా.?
Uae New Law
Follow us on

Accident: ఏమంటూ స్మార్ట్‌ఫోన్‌ల (Smartphones) వినియోగం పెరిగిందో ప్రతీ ఒక్కరూ చిన్న సైజ్‌ న్యూస్‌ రిపోర్టర్‌ల మారిపోయారు. ఏ చిన్న సంఘటన జరిగినా సరే వెంటనే జేబులోని స్మార్ట్‌ ఫోన్‌ను తీసి చిత్రీకరిస్తున్నారు. తీసిన ఫోటోలను సోషల్‌ మీడియాలో (Social Media) పోస్ట్‌ చేస్తున్నారు. మరీ ముఖ్యంగా రోడ్డుపై ప్రమాదం జరిగింది మొదలు, రోడ్డు మీద ప్రాణాలతో కొట్టుమిట్టాడుతోన్న వ్యక్తిని గాలికి వదిలేసి స్మార్ట్‌ ఫోన్‌లో వీడియో తీయడమే తమ ప్రథమ కర్తవ్యం అన్నట్లు ప్రవర్తిస్తున్నారు. అయితే ఇకపై ఇలా ప్రమాదాలను చిత్రీకరించడం నేరంగా భావిస్తామని చెబుతోంది యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (UAE) ప్రభుత్వం. ఈ విషయమై కీలక నిర్ణయం తీసుకుంది.

ఇందులో భాగంగా ప్రమాదానికి సంబంధించిన వీడియోలను చిత్రీకరిస్తే కఠినంగా శిక్షించేందుకు వీలుగా సైబర్‌ క్రైమ్‌ చట్టాన్ని యూఏఈ సవరించింది. ఈ చట్టం ప్రకారం రోడ్డు ప్రమాదానికి సంబంధించి ఫోటోలు, వీడియోలు చిత్రీకరిస్తే ఆరు నెలలు జైలు లేదా రూ. 31 లక్షల నుంచి రూ. కోటి వరకు జరిమానా కొన్ని సందర్భాల్లో రెండింటిని విధిస్తామని యూఏఈ పేర్కొంది. రోడ్డు ప్రమాద బాధితుల గోప్యతకు భంగం వాటిల్లకుండా ఉండేందుకే ఈ చట్టాన్ని తీసుకొచ్చామని యూఏఈ పేర్కొంది.

సవరించిన ఈ చట్టాన్ని జనవరి 2, 2022 నుంచి అమల్లోకి తీసుకొచ్చారు. అయితే దీని నుంచి సాక్ష్యాల సేకరణలో అధికారులకు మినహాయింపు ఉంటుందని తెలిపారు. దీంతోపాటు అనుమతి లేకుండా ఇతరుల ఫొటోలు, వీడియోలు తీయడం, మార్ఫింగ్‌ చేయడానికి కూడా తీవ్ర నేరంగా పరిగణిస్తూ చట్టాలను యూఏఈ కఠినతరం చేసింది. ఈ నిబంధనలను ఉల్లంఘించిన వారికి ఏడాది జైలు శిక్షతో పాటు రూ. 10 నుంచి రూ. 20 లక్షల వరకు జరిమానా విధించేలా చట్టాల్లో మార్పులు చేశారు.

Also Read: Viral Video: బైక్ రైడర్ అవతారమెత్తిన ముఖ్యమంతి.. రెడ్ జాకెట్, సన్‌ గ్గాసెస్‌తో రచ్చ.. వైరల్‌ అవుతున్న వీడియో..

Sai Pallavi : స్టేజ్ ఏదైనా క్రేజ్ మాత్రం ఈ అమ్మడిదే.. రౌడీ బేబీ రోజు రోజుకు పెరుగుతున్న ఫాలోయింగ్..

BEL Jobs 2022: భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌లో సీనియర్‌ ఇంజనీర్‌ ఉద్యోగాలు.. నెలకు లక్షకు పైగా జీతంతో..