మహిళను లైంగికంగా వేధించిన మాజీ భాగస్వామి.. కట్ చేస్తే బాధిత మహిళకు రూ.9900 కోట్లు

అమెరికాలోని ఓ మహిళపై తన మాజీ భాగస్వామి లైంగిక వేధింపులకు గురిచేసిన సంఘటన చర్చనీయాంశమవుతోంది. అతడ్ని వదలిసిన తర్వాత ఆమె ప్రైవేటు ఫోటోలను ఆన్‌లైన్‌లో పెట్టి అవమానాలకు గురిచేయడం మొదలుపెట్టాడు మాజీభాగస్వామి. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. అయితే అక్కడ న్యాయం జరగకపోవడంతో సివిల్ కోర్టులో కేసు వేసింది. దీనిపై విచారణ జరిపిన ప్రత్యేక న్యాయమూర్తుల బృందం బాధిత మహిళకు 1.2 బిలియన్ డాలర్లు అంటే దాదాపు 9900 కోట్లు చెల్లింటాలని ఆదేశాలు జారీ చేసింది.

మహిళను లైంగికంగా వేధించిన మాజీ భాగస్వామి.. కట్ చేస్తే బాధిత మహిళకు రూ.9900 కోట్లు
Woman

Updated on: Aug 17, 2023 | 5:31 AM

అమెరికాలోని ఓ మహిళపై తన మాజీ భాగస్వామి లైంగిక వేధింపులకు గురిచేసిన సంఘటన చర్చనీయాంశమవుతోంది. అతడ్ని వదలిసిన తర్వాత ఆమె ప్రైవేటు ఫోటోలను ఆన్‌లైన్‌లో పెట్టి అవమానాలకు గురిచేయడం మొదలుపెట్టాడు మాజీభాగస్వామి. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. అయితే అక్కడ న్యాయం జరగకపోవడంతో సివిల్ కోర్టులో కేసు వేసింది. దీనిపై విచారణ జరిపిన ప్రత్యేక న్యాయమూర్తుల బృందం బాధిత మహిళకు 1.2 బిలియన్ డాలర్లు అంటే దాదాపు 9900 కోట్లు చెల్లింటాలని ఆదేశాలు జారీ చేసింది. ఇక వివరాల్లోకి వెళ్తే అమెరికాకి చెందిన ఓ మహిళ.. మార్క్వెస్‌ జమాల్‌ జాక్సన్‌ అనే వ్యక్తితో 2016 నుంచి కలిసి జీవిస్తోంది. షికాగోలో వారు కొంతకాలం గడిపిన అనంతరం అక్టోబర్ 2021లో విడిపోయారు. ఆ తర్వాత ఆమెకు అతడి నుంచి వేధింపులు మొదలయ్యాయి.

మాజీ భాగస్వామిని అవమానించడమే లక్ష్యంగా పెట్టుకున్న జాక్సన్‌.. గతంలో ఆమెతో ఉన్నటువంటి ఫోటోలను శృంగార సైట్లలో పెట్టాడు. అలాగే ఆమె ఇంట్లోని సీసీ కెమెరాలు, మొబైల్, ఈ మెయిల్ నుంచి కూడా వ్యక్తిగత ఫోటోలను సేకరించి.. ఆమెకు తెలియకుండానే సామాజిక మాధ్యమాల్లో నకిలీ ఖాతాలు సృష్టించి అందులో పోస్టు చేశాడు. ఆ ఫోటోల లింకులను సైతం ఆ అమ్మాయి బంధు మిత్రులకు పంపించాడు. వాటిని ఇంటర్నెట్ నుంచి తీసేందుకు ప్రయత్నించినా కూడా మీ జవితం సరిపోదు అంటూ మాజీ భాగస్వామికి మెసేద్‌లు పంపించడం మొదలుపెట్టాడు. అతడి చేష్టలకు విసిగిపోయిన బాధిత మహిళ ఇక చేసేదేమి లేక న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. అతడు తనను మానసిక, లైంగిక వేధింపులకు గురిచేసినట్లు ఆ మహిళ తరఫున లాయర్లు కోర్టులో వాదనలు చేశాడు. నిందితుడు కోర్టుకు రాకున్న కూడా అతడి తరఫు న్యాయవాది మాత్రం హాజరై అతడి వాదనలు వినిపించారు. అయితే ఇరుపక్షాల వాదనలు విన్న జ్యూరీ కీలక నిర్ణయం తీసుకుంది.

ఇవి కూడా చదవండి

ఆ మహిళను మానసికంగా వేధించినందుకు 1600 కోట్ల రూపాయలతో పాటు ఆమె నష్టాన్ని కలిగించేలా చేసినందుకు శిక్షగా మరో 8300 కోట్ల డాలర్లు చెల్లించాలని ఆదేశిస్తూ తీర్పునిచ్చింది. దీనిపై స్పందించిన బాధిత మహిళ.. తనకు జరిగిన వేధింపుల విషయంపై స్థానిక పోలీసులకు ఎన్నోసార్లు ఫిర్యాదు చేసినా కూడా వారి నుంచి సరైన స్పందన రాలేదని చెప్పింది. అందుకోసమే సివిల్ కోర్టును ఆశ్రయించినట్లు తెలిపింది. అయితే అమెరికాలో అనేక రాష్ట్రాల్లో ఉన్నటువంటి చట్టం ప్రకారం ఒక వ్యక్తి అంగీకారం లేకుండా వ్యక్తిగత ఫోటోలు, వీడియోలను ఇంటర్నెట్‌లో పెట్టడం నేర. ఇలాంటి చర్యలను రివెంజ్ పోర్న్‌ అని పిలుస్తారు. అయితే అమెరికాలో ఇలాంటి కేసుల్లో భాగంగా భారీ మొత్తాలను చెల్లించినటువంటి దాఖలాలు కూడా ఎన్నో ఉండటం గమనార్హం.