తీవ్ర విషాదం.. ఇద్దరు వ్యాపార దిగ్గజాల మృతి.. మిగిలిన వారంతా సేఫ్‌.. కుట్ర కోణం దాగి ఉందా?

|

Aug 21, 2024 | 9:04 AM

ఇటీవల మోసం కేసులో నిర్దోషిగా విడుదలైన వ్యాపారవేత్త.. తన భార్య, కుమార్తెతో కలిసి నౌకలో విహారానికి వెళ్లారు. అయితే, విహార యాత్ర విషాదంగా మారిపోయింది. ఈ ఘోర బోటు ప్రమాదంలో ఇద్దరు దిగ్గజ వ్యాపారవేత్తల మృతి చెందారు. మిగిలిన వారంతా సేఫ్‌..

తీవ్ర విషాదం.. ఇద్దరు వ్యాపార దిగ్గజాల మృతి.. మిగిలిన వారంతా సేఫ్‌.. కుట్ర కోణం దాగి ఉందా?
Jonathan Bloomer, Mike Lynch
Follow us on

ఇటీవల మోసం కేసులో నిర్దోషిగా విడుదలైన వ్యాపారవేత్త.. తన భార్య, కుమార్తెతో కలిసి నౌకలో విహారానికి వెళ్లారు. అయితే, విహార యాత్ర విషాదంగా మారిపోయింది. ఈ ఘోర బోటు ప్రమాదంలో ఇద్దరు దిగ్గజ వ్యాపారవేత్తల మృతి చెందారు. మిగిలిన వారంతా సేఫ్‌.. ఇటలీలోని సిసిలీలో జరిగిన ఈ ఘోరం వెనుక కుట్రకోణం ఉందా? అన్న అనుమానాలు రేకెత్తిస్తున్నాయి.

ఇటలీలో తీవ్ర తుఫాను కారణంగా ఓ విలాసవంతమైన నౌక సముద్రంలో మునిగిపోయిందని సమాచారం. సిసిలీ తీర ప్రాంతంలో రాకాసి అల వచ్చి దాడి చేయడంతో నౌకను ముంచేశాయి. ఈ ప్రమాదంలో మోర్గాన్‌ స్టాన్లీ బ్యాంక్‌ ఇంటర్నేషనల్‌ చైర్మన్‌ జోనాథన్‌ బ్లూమర్, అటానమీ కార్పొరేషన్‌ వ్యవస్థాపకుడు మైక్‌ లించ్ సహా పలువురు మృతి చెందారు. ఈ ప్రమాదం నుంచి లించ్‌ భార్యతో పాటు మరో 15 మంది ప్రాణాలతో బయటపడ్డారు.

దాదాపు 56 మీటర్ల పొడవు ఉన్న బయేసియాన్ అనే విలాసవంతమైన నౌక, మొత్తం 22 మందితో ప్రయాణం మొదలుపెట్టింది. వీరిలో బ్రిటన్‌, అమెరికా, కెనడా వాసులు ఉన్నారు. స్థానిక కాలమానం ప్రకారం సోమవారం(ఆగస్ట్ 19) సాయంత్రం 5 గంటల సమయంలో తీవ్రమైన సుడిగాలి కారణంగా పడవ బోల్తా పడింది. ప్రమాదం నుంచి 15 మందిని కాపాడారు. షిప్‌ కుక్‌ మృతదేహాన్ని వెలికి తీశారు. తన సహోద్యోగుల కోసం మైక్‌ లించ్‌ ఈ ట్రిప్‌ ను ప్లాన్‌ చేసినట్టు చెబుతున్నారు. ఇటీవలే అమెరికాలో ఒక మోసం కేసులో బయటపడ్డ లించ్‌.. సముద్ర ప్రమాదం నుంచి తప్పించుకోలేకపోయాడు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న రెస్క్యూ దళాలు.. వెంటనే రంగంలోకి దిగాయి. ఉపరితలం నుంచి 50 అడుగుల లోతులో నౌక ఉన్నట్టు గుర్తించిన డైవర్లు.. లోపలి ఉన్నవారి కోసం గాలించారు.

లించ్‌పై అమెరికా టెక్‌ దిగ్గజం హెచ్‌పీ సాఫ్ట్‌వేర్‌ చౌర్యంపై గతంలో కేసు వేసింది. ఈ కేసులో లించ్‌తోపాటు ఆరోపణలు ఎదుర్కొన్న స్టీఫెన్‌ చాంబర్లైన్‌ కూడా యాదృచ్ఛికంగా ప్రాణాలు కోల్పోయాడు. బోటు ఘటన జరిగిన గంటల వ్యవధిలోనే ఇది జరిగింది. కేంబ్రిడ్జ్‌షైర్‌లో స్టీఫెన్‌ శనివారం జాగింగ్‌ చేస్తుండగా ఓ కారు ఢీకొంది. ఈ ఘటనలో అతడు తీవ్రంగా గాయపడి లైఫ్‌ సపోర్టింగ్‌ వ్యవస్థపై ఆసుపత్రిలో ఉన్నాడు. లించ్‌ మరణించిన గంటల వ్యవధిలోనే అతడు కూడా ప్రాణాలు వదిలాడు. అయితే హెచ్‌పీ సాఫ్ట్‌వేర్‌ చౌర్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు ప్రముఖులు ఒకే సారి ప్రాణాలు కోల్పోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలిది ప్రమాదమా..? కుట్రా..? ఇంకేదైనా కోణం ఉందా..? ఇదే ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..