ఇంటి మనిషిలా సాకిన పెట్ డాగ్.. అనూహ్యంగా మిస్సింగ్.. క్రిస్టమస్ రోజున అద్భుతం

|

Dec 29, 2024 | 1:30 PM

అల్లారు ముద్దుగా ఫ్లోరిడాలోని ఓ కుటుంబం జర్మన్ షెపర్డ్ జాతికి చెందిన ఓ కుక్కను పెంచుకుంటున్నారు. అయితే డిసెంబర్ 15వ తేదీన ఇంటి నుంచి బయటకు వెళ్లిన వారికి ఆ కుక్క జాడ కనిపించలేదు. అన్ని చోట్ల 10రోజుల పాటు వెతికారు. లాభం లేకపోయింది. తిరిగి రాదు అనుకుంటున్న సందర్భంలో క్రిస్మస్ రోజున ఇంటి డోర్ కాలింగ్ బెల్ నొక్కి తలుపు తడుతూ దూసుకువచ్చింది ఆ కుక్క.

ఇంటి మనిషిలా సాకిన పెట్ డాగ్.. అనూహ్యంగా మిస్సింగ్.. క్రిస్టమస్ రోజున అద్భుతం
Missing Dog
Follow us on

జంతువులలో, కుక్కలంటే మనుషులకు అత్యంత ప్రేమ. ఎవరైనా పెంపుడు కుక్క తప్పిపోయినట్లయితే, వారు దానిని కనుగొనడానికి తమ వంతు ప్రయత్నం చేయడానికి ఇదే కారణం. అసలైన, ఇటీవల ఒక వ్యక్తికి ఇష్టమైన కుక్క ఎక్కడో పోయింది. ఆ తర్వాత దాని గురించి విస్తృతంగా వెతికినా జాడ దొరకలేదు. అయితే పదిరోజుల తర్వాత, హఠాత్తుగా అదే పెంపుడు కుక్క పవిత్ర క్రిస్మస్ పండుగ రోజున కాలింగ్ బెల్ నొక్కి తలుపు తోసుకుంటూ ఇంట్లోకి వచ్చేసింది.

ఫ్లోరిడాలో ఓ కుటుంబం క్రిస్మస్ పండుగ రోజున వారి ప్రియమైన జర్మన్ షెపర్డ్ ఎథీనా తిరిగి రావడంతో వారి ఆనందానికి అవధులు లేకుండాపోయాయి. డిసెంబరు 15న ఎథీనా తన గ్రీన్ కోవ్ స్ప్రింగ్స్ ఇంటి నుండి కనిపించకుండా పోయింది. ఆమె కుటుంబం పెంపుడు కుక్క కనిపించకుండాపోవడంతో బాధలో ఉండిపోయారు. కమెర్ కుటుంబం తమ తప్పిపోయిన కుక్క ఎథీనాను కనుగొనడానికి విస్తృతంగా ప్రయత్నించారు. భౌతికంగా, సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేశారు. వందల సంఖ్యలో కెమెరా ఫుటేజీలను నిశితంగా సమీక్షించారు. డజన్ల కొద్దీ కమ్యూనిటీ సభ్యుల సహాయంతో వారి పరిసర ప్రాంతాలను జల్లడ పట్టారు.

వారం రోజులుగా వెతికిన లాభం లేకపోవడంతో తమ పెంపుడు జంతువుతో తిరిగి కలుస్తారనే ఆశను కుటుంబం దాదాపు కోల్పోయింది. చివరికి క్రిస్మస్ రోజు అద్భుతం జరిగింది. ఎథీనా క్రిస్మస్ ఈవ్‌లో ఆశ్చర్యకరంగా ఇంటికి తిరిగి వచ్చింది. ఇంటి దగ్గరకు వచ్చిన ఎథీనా వచ్చి కాలింగ్ నొక్కుతూ, తలుపు తట్టింది. దీంతో బయటకు వచ్చిన కుటుంబసభ్యులు సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. దాన్ని చూసి భావోద్వేగానికి లోనయ్యారు. ఈ ఘటన మొత్తం ఇంటి డోర్ వద్ద అమర్చిని సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. ఎథీనా, కుటుంబానికి ఇష్టమైన జర్మన్ షెపర్డ్-హస్కీ మిక్స్, క్రిస్మస్ సమయంలో తన కుటుంబంతో తిరిగి కలుసుకున్నందుకు చాలా ఆనందంగా ఉందని కుటుంబసభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. ఇది సెలవుల సీజన్‌ను మరింత ప్రత్యేకంగా గుర్తుండిపోయేలా చేసిందన్నారు. ఇక, ఆ పెంపుడు కుక్క అదృశ్యం కాకుండా నిరోధించడానికి కొత్త సంవత్సరంలో మైక్రోచిప్ చేసి స్పేయింగ్ చేయాలని కుటుంబం యోచిస్తోందట.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..