Pakistan: హిందూ మహిళపై దారుణం.. మతం మారాలని బలవంతం.. మూడు రోజుల పాటు దారుణంగా..

ఆర్థిక సంక్షోభం, దుర్భర పరిస్థితులతో కొట్టుమిట్టాడుతున్న దాయాది దేశంలో దారుణాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తిండి కూడా దొరకని పరిస్థితులు ఏర్పడినా.. నేరాలు మాత్రం యథేచ్ఛగా జరిగిపోతున్నాయి. సరిహద్దులో...

Pakistan: హిందూ మహిళపై దారుణం.. మతం మారాలని బలవంతం.. మూడు రోజుల పాటు దారుణంగా..
Harassment

Updated on: Jan 23, 2023 | 6:40 AM

ఆర్థిక సంక్షోభం, దుర్భర పరిస్థితులతో కొట్టుమిట్టాడుతున్న దాయాది దేశంలో దారుణాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తిండి కూడా దొరకని పరిస్థితులు ఏర్పడినా.. నేరాలు మాత్రం యథేచ్ఛగా జరిగిపోతున్నాయి. సరిహద్దులో నివాసం ఉండే హిందువులపై దారుణాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. తాజాగా.. సింధ్‌ ప్రావిన్స్‌లో ఓ మహిళపై కొందరు వ్యక్తులు అమానవీయానికి పాల్పడ్డారు. ఆమెతో అసభ్యంగా ప్రవర్తించారు. మతం మారాలాని ఒత్తిడి చేశారు. దీనిని ఆమె నిరాకరించడంతో బలవంతంగా ఆమెపై అత్యాచారం చేశాడు. ఈ ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు పట్టించుకోలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఆమె పోలీస్ స్టేషన్ ఎదుట నిరసన చేపట్టినా.. కనీసం ఎలాంటి చర్యలు చేపట్టలేదని ఆందోళన వ్యక్తం చేశారు.

నన్ను ఇస్లాంలోకి మారాలంటూ ఇబ్రహీం మాంగ్రియో, పున్హో మాంగ్రియో, వారి సహచరులు బెదిరించారు. దానికి నేను ఒప్పుకోలేదు. దీంతో వారు నన్ను కిడ్నాప్ చేశారు. మూడు రోజుల పాటు అత్యాచారం చేశారు. చివరికి వారి నుంచి తప్పించుకుని కుటుంబసభ్యులకు విషయం తెలిపాను. వారి సహాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్తే.. కనీసం వాళ్లు పట్టించుకోలేదు.

    – బాధితురాలు

ఇవి కూడా చదవండి

కాగా.. భారత్, పాకిస్తాన్ బార్డర్ లో ఉన్న సింధ్‌ ప్రావిన్స్‌లో నివాసముండే హిందువులపై దాడులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. యువతులు, మహిళల్ని కిడ్నాప్‌లు చేయడం, బలవంతంగా మతమార్పిడలకు పాల్పడటం పెద్ద సమస్యగా మారింది. థార్‌, ఉమర్‌కోట్‌, మిర్‌పుర్‌ఖాస్‌, ఘోట్కి, ఖైరాపూర్‌ వంటి చోట్ల ఈ పరిస్థితి మరీ దారుణంగా ఉంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.