Kangaroo: వరద నీటిలో రెండు మొసళ్ల దగ్గర కనిపించిన కంగారు పిల్ల, ఆ తర్వాత ఏం జరిగిందంటే

|

Mar 15, 2023 | 1:29 PM

మొసలిని చూస్తేనే కొంతమంది భయపడతారు. అలాంటింది మొసళ్లు తిరుగుతున్న నీటిలో ఉన్న కంగారుని అధికారులు రక్షించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

Kangaroo: వరద నీటిలో రెండు మొసళ్ల దగ్గర కనిపించిన కంగారు పిల్ల, ఆ తర్వాత ఏం జరిగిందంటే
Kangaroo
Follow us on

మొసలిని చూస్తేనే కొంతమంది భయపడతారు. అలాంటింది మొసళ్లు తిరుగుతున్న నీటిలో ఉన్న కంగారుని అధికారులు రక్షించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ఇటీవల ఆస్ట్రేలియాలో వరదలు వచ్చాయి. అనేక ప్రాంతాలు నీటమునిగిపోయాయి. అయితే క్వీన్స్ ల్యాండ్ లోని వరద నీటిలో రెండు మొసల్లు ఉండటాన్ని హెలికాప్టర్ లో వెళ్తున్న ఓ పైలెట్ గమనించాడు. మరో విషయం ఏంటంటే వాటికి దగ్గర్లోనే ఓ కంగారు పిల్ల ఈదుకుంటు ఉంటోంది. వెంటనే అప్రమత్తమైన పైలట్ క్వీన్ ల్యాండ్ పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో అక్కడికి వచ్చిన పోలీస్ అధికారులు బోటులో వెళ్లి ఆ కంగారు పిల్లను రక్షించారు. కంగారు పిల్లను నీటిలో నుంచి సురక్షితంగా బయటకు తీసిన అధికారి దాన్ని ఒడ్డున వదిలిపెట్టారు. దీంతో అది గెంతుకుంటూ ఆనందంగా వెళ్లిపోయింది.

పోలీసు అధికారి ఆ కంగారు పిల్లను కాపాడిన వీడియోపై నెటీజన్లు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఓ ప్రాణిని కాపాడి దానికి మరో జీవితాన్ని ఇచ్చారంటూ పొగుడుతున్నారు. ఇదిలా ఉండగా ఆస్ట్రేలియాలో వచ్చిన వరదలు స్థానికులపై తీవ్ర ప్రభావం చూపింది. దీనిపై అధికారులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అలాగే వరద ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉన్న ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు.

 

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.