Armenia–Azerbaijan: చల్లారని మంటలు.. మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు.. దాడుల్లో 99 మంది సైనికులు మృత్యువాత..

|

Sep 14, 2022 | 11:42 AM

అర్మేనియా, అజర్‌బైజాన్ సరిహద్దులో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. బోర్డర్ లో జరిగిన ఘర్షణలో 99 మంది సైనికులు మరణించారు. అర్‌బైజాన్‌లో భాగమైన నాగోర్నో-కరాబాఖ్‌పై దశాబ్దాలుగా ఇరు దేశాల మధ్య గొడవలు జరుగుతున్నాయి...

Armenia–Azerbaijan: చల్లారని మంటలు.. మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు.. దాడుల్లో 99 మంది సైనికులు మృత్యువాత..
War
Follow us on

అర్మేనియా, అజర్‌బైజాన్ సరిహద్దులో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. బోర్డర్ లో జరిగిన ఘర్షణలో 99 మంది సైనికులు మరణించారు. అర్‌బైజాన్‌లో భాగమైన నాగోర్నో-కరాబాఖ్‌పై దశాబ్దాలుగా ఇరు దేశాల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఆ ప్రాంతం తమదంటే తమదని ఇరుదేశాలు ఘర్షణకు దిగుతున్నాయి. 1994లో అక్కడ వేర్పాటువాద యుద్ధం ముగిసినప్పటి నుంచి ఈ ప్రాంతం అర్మేనియన్ దళాల నియంత్రణలో ఉంది. జూలై 19, 2020 న టర్కీలోని ఇస్తాంబుల్‌లో అజర్‌బైజాన్, అర్మేనియా మధ్య గొడవలు జరిగాయి. కాగా మరోసారి జరిగిన దాడుల్లో 99 మంది సైనికులు ప్రాణాలు కోల్పోవడం ఇరువైపులా దీర్ఘకాల ప్రత్యర్థుల మధ్య మరోసారి ఉద్రిక్తతను లేవనెత్తాయి. ఈ దాడుల్లో ఆర్మేనియాకు చెందిన 49 మంది, అజర్‌బైజాన్ కు చెందిన 50 మంది సైనికులు మృతి చెందారు. ఆర్మేనియా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకారం అర్మేనియన్ భూభాగంలోని అనేక విభాగాల్లో అజర్‌బైజాన్ దళా డ్రోన్ దాడులకు తెగబడ్డాయి.

అజర్‌బైజాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో అర్మేనియా రెచ్చగొట్టే విధంగా ప్రవర్తిస్తోందని, దీనిపై తాము తీవ్రంగా స్పందిస్తున్నట్లు వెల్లడించింది. అజర్‌బైజాన్ సైనిక స్థానాలపై ఆర్మేనియా కాల్పులు జరిపాయని వెల్లడించింది. 2020లో ఆరు వారాల యుద్ధంలో నాగోర్నో-కరాబాఖ్‌ను అజర్‌బైజాన్ తిరిగి స్వాధీనం చేసుకుంది. అప్పట్లో 6,600 మందికి పైగా మరణించారు. ఈ విషయంపై రష్యా కలగజేసుకోవడంతో ఇరుదేశాల మధ్య శాంతి ఒప్పందం కుదిరింది. ఒప్పందం ప్రకారం శాంతి పరిరక్షకులుగా పనిచేయడానికి మాస్కో దాదాపు 2,000 మంది సైనికులను ఈ ప్రాంతానికి పంపింది.

మంగళవారం జరిగిన దాడులపై రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పందించింది. గొడవలు పెద్దవి కాకుండా, ఉద్రిక్తతలు తీవ్రతరం కాకుండా చూసుకోవాలని సూచించింది. ఉద్రిక్తతలను తగ్గించడానికి, సంయమనం పాటించడానికి చర్యలు తీసుకోవాలని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ-జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం