చిన్నారి ఏడుపు ఆపడం లేదని పాల సీసాతో మద్యం పట్టించిన తల్లి.. ఇంతకన్నా దారుణం ఉంటుందా..?

| Edited By: TV9 Telugu

Aug 11, 2023 | 6:43 PM

ఇటీవల సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఓ వీడియోలో.. ఓ జింక పిల్లపై మొసలి దాడికి యత్నించగా, ఆ తల్లి జింక తన ప్రాణాలను అడ్డువేసి బిడ్డను కాపాడుకుంది.బిడ్డ ప్రమాదంలో ఉందని పసిగట్టిన ఆ తల్లి జింక బిడ్డకు, మొసలికి మధ్య తన శరీరాన్ని అడ్డుపెట్టింది. అలా.. మొసలికి ఆహారంగా మారిపోయింది. తన ప్రాణ త్యాగంతో తన బిడ్డను రక్షించుకుంది తల్లి జింక. ఇలా తల్లి చేసే త్యాగాలను వర్ణించేందుకు మాటలు సరిపోవు. 

చిన్నారి ఏడుపు ఆపడం లేదని పాల సీసాతో మద్యం పట్టించిన తల్లి.. ఇంతకన్నా దారుణం ఉంటుందా..?
Mother Fills Milk Bottle
Follow us on

ఒక తల్లి.. తన బిడ్డల కోసం ప్రాణాలకు తెగించి పోరాడుతుంది. ఆఖరుకు సింహం, మొసలితో కూడా పోరాడుతుంది. అయితే, ఇక్కడ జరిగిన ఘటన మాత్రం తల్లి తనానికే మచ్చ తెచ్చేలా ఉంది. తల్లి వాత్సల్యాన్ని మర్చిపోయిన ఓ తల్లి చేసిన పనికి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఆగ్రహంతో ఆ తల్లిపై మండిపడుతున్నారు. పసికందుపై కనికరం లేని తల్లి.. తన నెలన్నర పాపకు పాల సీసాలో మద్యం పోసి పట్టించింది. ఈ విషయం సోషల్ మీడియా వేదికగా తీవ్ర దుమారం రేపుతోంది.దీనిపై ప్రజలు తీవ్రంగా మండిపడుతున్నారు. ఈ తల్లిని జైలులో పెట్టాలని కొందరు వినియోగదారులు మండిపడుతున్నారు. ఇది కలియుగం ఇలాంటి తల్లులే ఉంటారంటూ మరికొందరు విమర్శిస్తున్నారు. అయితే, ఈ దారుణ ఘటన అమెరికాలోని కాలిఫోర్నియాలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

అమెరికాలోని కాలిఫోర్నియాలో శాన్ బెర్నార్డినో శాన్ బెర్నార్డినో కౌంటీ షెరీఫ్ ప్రకారం…నిందితుడి తల్లిని అరెస్టు చేశారు. ఏడువారాల పాప ఏడుపు ఆపేందుకు ఆమె ఇంతటీ దారుణానికి పాల్పడింది. ఆమె తన 7 వారాల పాప సీసాలో మద్యం నింపిపట్టించింది. అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌కు తూర్పున 55 మైళ్ల దూరంలో ఉన్న రియాల్టో సమీపంలో శనివారం అర్ధరాత్రి 12:44 గంటలకు ఈ ఘటన చోటుచేసుకుంది. మహిళను 37 ఏళ్ల హానెస్టీ డి లా టోర్రేగా గుర్తించారు.

మహిళ కారు నడుపుతూ ఎక్కడికో వెళుతోందని, ఈ సమయంలో చిన్నారి ఏడుస్తూనే ఉందని నివేదికలో పేర్కొంది. చిన్నారి ఏడుపు ఆపేందుకు..ఆమె ఆ పసికందుకు మద్యం తాగించింది. దాంతో చిన్నారి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారింది. దాంతో వెంటనే చిన్నారిని ఆసుపత్రిలో చేర్చారు. తల్లిని వెస్ట్ వ్యాలీ డిటెన్షన్ సెంటర్‌లో $60,000 బాండ్‌పై ఉంచారు. కాగా, ఈ వార్తను ట్విట్టర్‌ లో వైరల్‌గా మారడంతో చాలా మంది వినియోగదారులు దీనికి ప్రతిస్పందించారు . ఒక వ్యక్తి ఇలా వ్రాశాడు – అమ్మ ఇలా చేస్తుందని నమ్మలేకపోతున్నాను. అంటే..మరొకరు పోలీసులు ఆమెను అరెస్టు చేసి మంచి పని చేశారని అన్నారు.

ఇవి కూడా చదవండి