Bomb Blast: భారీ బాంబు పేలుడు.. ఏడుగురు మృతి.. 13 మందికిపైగా గాయాలు!

Bomb Blast: షహర్-ఎ-నవ్ కాబూల్‌లోని అత్యంత సురక్షితమైన ప్రాంతాలలో ఒకటిగా పరిగణిస్తారు. గాయపడిన వారు కాబూల్‌లోని సర్జికల్ సెంటర్‌లో చికిత్స పొందుతున్నారని ఆఫ్ఘన్ రాజధానిలో ఆసుపత్రిని నిర్వహిస్తున్న ఇటాలియన్ ఎన్జీఓ ఎమర్జెన్సీ తెలిపింది. అయితే ఈ పేలుడుకు ఏ ఉగ్రవాద సంస్థ బాధ్యత వహించినట్లు ప్రకటించలేదు..

Bomb Blast: భారీ బాంబు పేలుడు.. ఏడుగురు మృతి.. 13 మందికిపైగా గాయాలు!
Bomb Blast

Updated on: Jan 19, 2026 | 8:13 PM

Bomb Blast: ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్‌లో భారీ బాంబు పేలుడు సంభవించింది. ఈ పేలుడులో సుమారు ఏడుగురు మరణించగా, 13 మంది తీవ్రంగా గాయపడ్డారని అధికారులు తెలిపారు. అయితే పెద్ద పెద్ద కార్యాలయ భవనాలు, షాపింగ్ కాంప్లెక్స్‌లు, రాయబార కార్యాలయాలు ఉన్న వాణిజ్య షహర్-ఎ-నావ్ పరిసరాల్లోని ఒక హోటల్‌ను లక్ష్యంగా చేసుకుని ఈ పేలుడు సంభవించినట్లు సమాచారం.

ఇదిలా ఉండగా, షహర్-ఎ-నవ్ కాబూల్‌లోని అత్యంత సురక్షితమైన ప్రాంతాలలో ఒకటిగా పరిగణిస్తారు. గాయపడిన వారు కాబూల్‌లోని సర్జికల్ సెంటర్‌లో చికిత్స పొందుతున్నారని ఆఫ్ఘన్ రాజధానిలో ఆసుపత్రిని నిర్వహిస్తున్న ఇటాలియన్ ఎన్జీఓ ఎమర్జెన్సీ తెలిపింది. అయితే ఈ పేలుడుకు ఏ ఉగ్రవాద సంస్థ బాధ్యత వహించినట్లు ప్రకటించలేదు.

ఈ సంఘటన కారణంగా ఆ ప్రాంతంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. అలాగే దర్యాప్తును కూడా ప్రారంభించారు. అయితే, పేలుడు ఉగ్రవాద దాడా లేదా ఏదైనా సాంకేతిక కారణం వల్ల జరిగిందా అనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు. కాబూల్‌లోని షహర్-ఎ-నౌ ప్రాంతంలో ఉన్న ఒక హోటల్‌లో సోమవారం పేలుడు సంభవించిందని ఆఫ్ఘన్ అధికారులు తెలిపారు. ఈ పేలుడులో చాలా మంది మరణించగా, చాలా మంది గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి